PoK Violence | అట్టుడుకుతున్న పీవోకే.. పోలీసుల కాల్పుల్లో 20 మంది మృతి
PoK Violence | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) నిరసనలతో అట్టుడుకుతోంది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (Joint Awami Action Committee) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రావాల్కోట్‌లో (Rawalakot) ఎన్నికలను బహిష్కరించి నిరసన తెలుపుతు న్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించడంతోపాటు కాల్పులు జరిపాయి.
PoK Violence | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) నిరసనలతో అట్టుడుకుతోంది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (Joint Awami Action Committee) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. జేఏఏసీ ముజఫరాబాద్‌కు చేపట్టిన లాంగ్ మార్చ్‌కు ముందు పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు (Protesters), భద్రతా దళాల (security forces) మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.
రావాల్కోట్‌లో (Rawalakot) ఎన్నికలను బహిష్కరించి నిరసన తెలుపుతు న్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించడంతోపాటు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో కనీసం 20 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు నిరసనకారులు రావాల్కోట్‌లోకి వెళ్లకుండా ప్రధాన మార్గాలను అధికారులు మూసివేశారు. ఈ ప్రాంతంలో విద్యుత్, ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్‌లను నిలిపివేసి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
కాగా, పాక్ ఆక్రమిత్ కశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో 45 స్థానాలకు గాను 12 స్థానాలను పాక్‌లో నివసిస్తున్న కశ్మీర్ శరణార్థులకు రిజర్వ్ చేయడాన్ని జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ స్వతంత్ర ప్రతిపత్తిని అణచివేసేందుకు పాక్ కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్‌లను తీసుకొచ్చిందని జేఏఏసీ ఆరోపిస్తోంది. పీవోకేను తన నియంత్రణలో పెట్టుకునేందుకు పాక్ అడ్డదారుల్లో ప్రయత్నిస్తోందని మండిపడుతోంది.
Also Read..
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..
లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత
సంబంధిత వార్తలు

Armys Helicopter Crashes | పీవోకేలో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. 21 మంది భద్రతా సిబ్బంది మృతి
జూన్ 10, 2026

PoK | అట్టుడుకుతున్న పీవోకే.. నిరసనకారులపై పాక్ భద్రతా దళాలు కాల్పులు.. 30 మంది మృతి
జూన్ 9, 2026

Pahalgam terror attack | పహల్గామ్ దాడికి ఏడాది.. ఆ రోజు ఏం జరిగిందంటే..?
ఏప్రిల్ 22, 2026
తాజావార్తలు
- ●Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత
- ●KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి
- ●Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు
- ●WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..
- ●Supreme Court | విద్యార్థులపై చర్యలు వద్దు.. వారిని వెంటనే వదిలిపెట్టండి.. పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు
- ●Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. దిగువకు 30 వేల క్యూసెక్కులు విడుదల

Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత

KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి

Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు

WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..



