త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Housing Scheme | ఇందిర‌మ్మ ఇళ్లకు 11,000 ద‌ర‌ఖాస్తులు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..

Indiramma Housing Scheme | హైద‌రాబాద్ క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్( Indiramma Towers ) నిర్మాణానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అర్హులైన ప్ర‌జ‌లు.. ఇందిరమ్మ ఇళ్ల( Indiramma Illu ) కోసం ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నారు.

S

Hyderabad | Published On Jul 28, 2026, 2.55 pm IST

Indiramma Housing Scheme | ఇందిర‌మ్మ ఇళ్లకు 11,000 ద‌ర‌ఖాస్తులు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..
Advertisement

Indiramma Housing Scheme | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్( Indiramma Towers ) నిర్మాణానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అర్హులైన ప్ర‌జ‌లు.. ఇందిరమ్మ ఇళ్ల( Indiramma Illu ) కోసం ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నారు. సోమ‌వారం నాటికి 11 వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు ప్ర‌భుత్వ అధికారులు అధికారికంగా వెల్ల‌డించారు. ఆగ‌స్టు 10వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో స్వీక‌రించ‌నున్నారు.

ఈ ప‌థ‌కానికి సంబంధించిన‌ దరఖాస్తు విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలు, చెల్లింపులు, కేటాయింపు విధానం తదితర అంశాలపై పూర్తి సమాచారం మీ కోసం.

ఇందిరమ్మ ఇళ్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply)

ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన నిరుపేదలు సులభంగా దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. కింది విధానాల ద్వారా అప్లై చేసుకోవచ్చు.

మీసేవ (MeeSeva): స్థానికంగా అందుబాటులో ఉండే మీసేవ కేంద్రాలకు వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వాట్సప్ (WhatsApp): మీసేవ వాట్సప్ నంబర్ 8096958096 కు మెసేజ్ చేయడం ద్వారా కూడా ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఆన్‌లైన్ (Online): దరఖాస్తుదారులు మీసేవ అధికారిక వెబ్‌సైట్ meeseva.telangana.gov.in ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు.

హెల్ప్‌లైన్ నంబ‌ర్ ఇదే..

ప్రజలు ఎలాంటి సందేహాలు ఉన్నా మ‌ధ్య‌వ‌ర్తుల‌ను న‌మ్మ‌కుండా నేరుగా 040-24603572 నంబర్‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయింత్రం 6 గంట‌ల మ‌ధ్య‌ ఫోన్ చేసి అధికారిక సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. ద‌ర‌ఖాస్తుదారుల సౌక‌ర్యార్ధం తెలుగు , హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాష‌ల‌లో స‌మాచారం తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్రభుత్వం నుంచి సరైన సమాచారం అందించేందుకు ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు.

ఏ నియోజకవర్గానికి చెందిన ప్రజలు అదే నియోజకవర్గంలో దరఖాస్తు

క్యూర్ ప‌రిధిలో ల‌క్ష ఇళ్ల నిర్మాణం ల‌క్ష్యంగా తొలివిడ‌త‌లో 16 నియోజకవర్గాలలో 7680 ఇళ్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టిన‌ట్లు తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని యూనిట్‌గా తీసుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఏ నియోజకవర్గానికి చెందిన ప్రజలు అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ద‌ర‌ఖాస్తు దారులు ఎలాంటి విష ప్ర‌చారాల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని మీ సేవ కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్,వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే

హైదరాబాద్ క్యూర్ ఏరియా ప్రాంతంలో నివసిస్తున్న అల్పాదాయ వర్గాల కుటుంబాల కోసం ఈ పథకాన్ని రూపొందించామ‌ని కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షల వరకు ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే స్వీకరించబడుతుందని అర్హత కలిగిన కుటుంబానికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయించబడుతుందన్నారు. అందిన దరఖాస్తులను డిజిటల్ విధానంలో పరిశీలించడంతో పాటు, క్షేత్రస్థాయి పరిశీలన మరియు సమగ్ర ధృవీకరణ నిర్వహిస్తామన్నారు. నిర్మిస్తున్న ఫ్లాట్ల సంఖ్య కంటే అర్హులైన దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే, పారదర్శకమైన విధానంలో లాటరీ ద్వారా ఇండ్లను కేటాయించ‌నున్నారు.

ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలో ఆధార్ నెంబ‌ర్

ద‌ర‌ఖాస్తుదారు క్యూర్ ప‌రిధిలో ప‌దేళ్లుగా నివాసం ఉండాల‌ని, ద‌ర‌ఖాస్తుదారు లేదా కుటుంబానికి ఓఆర్ఆర్‌, క్యూర్ ప‌రిధిలో సొంత ఇల్లు లేదా ఫ్లాట్ లేదా ప్లాట్ ఉండ‌కూడ‌ద‌ని, ఒక కుటుంబానికి ఒక ద‌ర‌ఖాస్తు ఒక ఫ్లాట్ మాత్ర‌మే కేటాయింపు ఉంటుంద‌ని తెలిపారు. ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలో ఆధార్ నెంబ‌ర్ తెలియ‌జేస్తే స‌రిపోతుంద‌ని, కుల‌, జీత భ‌త్యాల ధృవీక‌ర‌ణ పత్రాల‌ను అప్ లోడ్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని లాట‌రీ స‌మ‌యంలో వీటిని స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

తిరిగి అదే ఖాతాకు ఆ మొత్తం వాప‌సు

ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో 10 వేల రూపాయిల చెల్లింపున‌కు యూపిఐ లేదా నెట్ బ్యాంకింగ్‌ను మాత్ర‌మే ఉప‌యోగించాల‌ని, ఒక వేళ ఇల్లు మంజూరు కాక‌పోతే తిరిగి అదే ఖాతాకు ఆ మొత్తం వాప‌సు అవుతుంద‌న్నారు. ప‌రిశీల‌న‌, కేటాయింపు, వాప‌సు త‌దిత‌ర స‌మాచారం పూర్తయ్యేవ‌ర‌కు మీసేవ ర‌శీదు, చెల్లింపు ర‌శీదు, ద‌ర‌ఖాస్తు సంఖ్య‌, మొబైల్‌నెంబ‌ర్‌ల‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలి.

అన్ డివైడెడ్ షేర్ కింద 20 నుంచి 25 గ‌జాల స్థ‌లం

ఈ పథకం కింద ప్రతిపాదించిన ఫ్లాట్లు ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌తో, సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మిస్తున్నామ‌న్నారు. ఒక్కో ఫ్లాట్ ఖ‌రీదు రూ. 40 నుంచి రూ. 60 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని, ఇందులో ప్ర‌భుత్వం ఐదు ల‌క్ష‌ల రూపాయిల స‌బ్సిడీతో పాటు అన్ డివైడెడ్ షేర్ కింద 20 నుంచి 25 గ‌జాల స్ధ‌లాన్ని కూడా ల‌బ్దిదారుని పేరిట రిజిస్ట్రేష‌న్ చేప‌డుతుంద‌న్నారు. ల‌బ్దిదారుడు కేవ‌లం ఆరు ల‌క్ష‌ల రూపాయిలు మాత్ర‌మే చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది.

Advertisement
Advertisement