Kajal Aggarwal | కాజల్‌కు అచ్చిరాని బాలీవుడ్ – చందమామ ఖాతాలో మరో డిజాస్టర్
అందాల చందమామ కాజల్ అగర్వాల్‌కు బాలీవుడ్ అచ్చిరాలేదు. ది ఇండియా స్టోరీతో కాజల్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరింది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా మూవీకి ఐదు రోజుల్లో కేవలం 92 లక్షల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.
Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ బ్యాడ్‌టైమ్ కంటిన్యూ అవుతోంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్లలో ఒకరిగా పేరుతెచ్చుకుంది ఈ అందాల చందమామ. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో దూసుకుపోయింది. ఫ్లాప్‌ల కారణంగా కాజల్ జోరుకు బ్రేకులుపడ్డాయి. గత ఎనిమిదేళ్లలో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కలిపి కాజల్ హీరోయిన్‌గా పదిహేడు సినిమాలు చేసింది. అందులో మూడు సినిమాలు మాత్రమే హిట్టయ్యాయి. మిగిలినవన్నీ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.
లాయర్ పాత్రలో...
ఇటీవల రిలీజైన ది ఇండియా స్టోరీ మూవీపై కాజల్ భారీగా ఆశలు పెట్టుకుంది. మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో కోర్ట్‌రూమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో కాజల్ లాయర్ పాత్రలో కనిపించింది. పురుగుమందుల వాడకం వల్ల తలెత్తుతోన్న అనర్ధాలను చర్చిస్తూ తెరకెక్కిన ఈ బాలీవుడ్ మూవీని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
సెన్సార్ అడ్డంకులు...
కానీ చివరి నిమిషంలో సెన్సార్ అడ్డంకుల కారణంగా తెలుగు, తమిళ వెర్షన్లు రిలీజ్ కాలేదు. హిందీ వెర్షన్ కోసం కాజల్ భారీగానే ప్రమోషన్స్ చేసింది. ఇంటర్వ్యూలు ఇచ్చింది. అయినా సినిమాపై అనుకున్నంతగా బజ్ రాలేదు. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఐదు రోజుల్లో కేవలం 92 లక్షల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. మొదటి రోజు ఈ సినిమాకు కేవలం 16 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. రోజురోజుకు కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఐదో రోజు కేవలం తొమ్మిది లక్షల వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఓవరాల్ థియేట్రికల్ రన్‌లో ది ఇండియా స్టోరీ కోటి కలెక్షన్స్ రాబట్టడం కూడా కష్టంగానే కనిపిస్తోంది.
కలిసిరాని బాలీవుడ్...
ఈ ఏడాది బాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్ట్‌లో ది ఇండియా స్టోరీ ఒకటిగా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ రిజల్ట్‌తో కాజల్ కష్టం మొత్తం వృథాగా మారిపోయిందని నెటిజన్లు చెబుతోన్నారు. బాలీవుడ్ కాజల్‌గా అంతగా అచ్చిరాదని మరోసారి సారి ఈ మూవీ ప్రూవ్ చేసిందని కామెంట్లు చెస్తున్నారు.
భగవంత్ కేసరి తర్వాత...
ప్రస్తుతం కాజల్ తెలుగులో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. భగవంత్ కేసరి తర్వాత బాలకృష్ణ, కాజల్ కాంబినేషన్‌లో వస్తోన్న సెకండ్ మూవీ ఇది. ఇందులో గవర్నమెంట్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. మరోవైపు బాలీవుడ్ మూవీ రామాయణలో మండోదరి పాత్రలో యశ్ కు జోడీగా నటిస్తోంది. రామాయణలో రణభీర్‌కపూర్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి రామాయణ పార్ట్ 1 థియేటర్లలోకి రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

National Awards | నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే – బెస్ట్ యాక్టర్‌గా మమ్ముట్టి – ఉత్తమ నటిగా యామీ గౌతమ్
జులై 18, 2026

National Awards | నేషనల్ అవార్డుల్లో సత్తా చాటిన పుష్ప 2, కల్కి – టాలీవుడ్‌కే అత్యధిక పురస్కారాలు
జులై 18, 2026

Adinath Kothare | 15 ఏళ్ల దాంపత్యానికి తెర.. విడాకులు తీసుకున్న రామాయణ నటుడు..!
జులై 16, 2026
తాజావార్తలు
- ●Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు 11,000 దరఖాస్తులు.. దరఖాస్తు చేసుకోండిలా..
- ●PoK Violence | అట్టుడుకుతున్న పీవోకే.. పోలీసుల కాల్పుల్లో 20 మంది మృతి
- ●X Money | ఎలాన్ మస్క్ ఎక్స్ (X) నుంచి ఇక బ్యాంకింగ్ సేవలు.. ఎక్స్ మనీ లాంచ్.. డిజిటల్ బ్యాంకింగ్, 6 శాతం వడ్డీ..
- ●Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత
- ●KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి
- ●Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు 11,000 దరఖాస్తులు.. దరఖాస్తు చేసుకోండిలా..

PoK Violence | అట్టుడుకుతున్న పీవోకే.. పోలీసుల కాల్పుల్లో 20 మంది మృతి

X Money | ఎలాన్ మస్క్ ఎక్స్ (X) నుంచి ఇక బ్యాంకింగ్ సేవలు.. ఎక్స్ మనీ లాంచ్.. డిజిటల్ బ్యాంకింగ్, 6 శాతం వడ్డీ..

Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత



