త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Public Impeachment | సీఈసీపై ప్ర‌జా అభిశంస‌న కార్య‌క్ర‌మం వాయిదా

Public Impeachment | ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar)కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండీ కూటమి (INDIA bloc) నిర్వహించ తలపెట్టిన ప్ర‌జా అభిశంసన (Public Impeachment) కార్యక్రమం వాయిదా ప‌డింది.

D

National | Published On Oct 30, 2026, 2.21 pm IST

Public Impeachment | సీఈసీపై ప్ర‌జా అభిశంస‌న కార్య‌క్ర‌మం వాయిదా
Advertisement

Public Impeachment | త్రినేత్ర న్యూస్ : ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో న‌వంబ‌ర్ 1న మెగా ర్యాలీకి ముందు కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar)కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండీ కూటమి (INDIA bloc) నిర్వహించ తలపెట్టిన ప్ర‌జా అభిశంసన (Public Impeachment) కార్యక్రమం వాయిదా ప‌డింది.

సెంట్ర‌ల్ ఢిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) అధికారిక నివాస ప్రాంగ‌ణంలో ఇవాళ మ‌ధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గాల్సి ఉంది. అయితే, ఢిల్లీలో నిరంత‌రాయంగా కురుస్తున్న వ‌ర్షం కార‌ణంగా కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేశారు. రేపు అదే స‌మ‌యానికి కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. ఇక ఈ కార్య‌క్ర‌మానికి లోక్‌స‌భ మాజీ స్పీక‌ర్ మీరా కుమార్ (Meira Kumar) అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్నారు. ఖర్గే తీర్మానం ప్రవేశపెట్టనుండగా.. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీర్మానం ఆమోదించడానికి ముందు ముగింపు ప్రసంగం చేయ‌నున్నారు.

మ‌రోవైపు ఓటు చోరీ అంశంపై ప్రజలకు వివరించేందుకు చేపట్టిన ఈ ప్రజా అభిశంసన కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనే దానిపై కూట‌మి నాయ‌కులు గురువార‌మే స‌మావేశ‌మై ఓ కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించిన విష‌యం తెలిసిందే. ఈ స‌న్నాహ‌క స‌మావేశంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు ప్రియాంకా గాంధీ వాద్రా, జైరామ్ రమేష్, కేసీ వేణుగోపాల్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీరా కుమార్, తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత డెరెక్ ఒబ్రెయిన్ త‌దితరులు పాల్గొన్నారు.

Also Read..

కాలుష్య రహిత దీపావళి.. విరాట్ కోహ్లీతో అవ‌గాహ‌న క‌ల్పించండి : సుప్రీంకోర్టు

భార్య కర్వా చౌత్ వ్రతం చేయనంద‌ని.. విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించిన భర్త..!

రైతును రారాజుగా చేయ‌డ‌మే ప్ర‌ధాని మోదీ ల‌క్ష్యం: బండి సంజ‌య్

ట్యాగ్స్:

CEC Gyanesh KumarCongressINDIA BlocINDIA Bloc PartiesMallikarjun KhargeMeira KumarPublic ImpeachmentRahul GandhiRain
Advertisement
Advertisement