Jairam Ramesh | సర్ అనేది మోదీ, షా కుట్ర.. సీఈసీ దీన్ని అమలు చేశారు : జైరామ్ రమేశ్
Jairam Ramesh | భారత ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah)ల కుట్ర అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) ఆరోపించారు.
Jairam Ramesh | భారత ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. సర్ అనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), హోంమంత్రి అమిత్ షాల (Amit Shah) కుట్ర అని, దీనిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar) అమలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, సర్ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని, ECINET పోర్టల్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాలన్ని పార్టీ డిమాండ్‌ను ఆయన పునరుద్ఘాటించారు.
సర్ పూర్తైన, జరుగుతున్న కనీసం ఆరు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ గుర్తించిన అనుమానిత విదేశీయుల సంఖ్య మొత్తం ఓటర్ల సంఖ్యతో పోలిస్తే అత్యంత స్వల్పమని ఓ ప్రముఖ మీడియా సంస్థ నివేదికను జైరామ్ రమేశ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళన చేయడానికి చొరబాటుదారులను గుర్తించడం, తొలగించడం, బహిష్కరించడం (Detect, Delete, Deport) అనే త్రిముఖ (3D) లక్ష్యంతోనే ఈ ప్రక్రియ చేపట్టామని గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారని, కానీ వాస్తవంగా సాధించింది ఇదేనా..? అని ఆయన ప్రశ్నించారు.
కర్ణాటక, జార్ఖండ్, మేఘాలయ, కేరళ, గోవా, మిజోరాం రాష్ట్రాల్లో 1,600 మంది విదేశీయులను మాత్రమే గుర్తించి తొలగించారని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో దాదాపు 10 కోట్ల మంది ప్రజలు సర్ ప్రక్రియలో పాల్గొన్నారని తెలిపారు. అయితే, కేవలం 1,600 మంది అనుమానిత విదేశీయులను మాత్రమే గుర్తించి ఓటర్ల జాబితా నుండి తొలగించారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘం (ECI) ఎటువంటి డేటాను సేకరించాలని కోరకపోవడం వల్లే మిగిలిన 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆ వివరాలను అందించలేదని చెప్పారు.
కర్ణాటకలో 99.7 లక్షల పేర్లు తొలగించగా.. కేవలం 716 మంది విదేశీయులను మాత్రమే గుర్తించారని, వారిలో 545 మంది నేపాల్‌కు చెందినవారేనని ఆయన తెలిపారు. పీఎం (ప్రధాని మోదీ) - హెచ్‌ఎం (అమిత్ షా) ద్వయం పన్నిన కుట్రను సీఈసీ ECINET ద్వారా అమలు చేశారని ఆరోపించారు. ఈ మేరకు "జ్ఞానేష్ కుమార్ వైదొలగాలి. సర్‌ను నిలిపివేయాలి. ఈసినెట్ పోర్టల్ ప్రక్షాళన జరగాలి" అంటూ ఈ అంశంపై కాంగ్రెస్ డిమాండ్లను రమేష్ జాబితా చేశారు.
Also Read..
మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఫలితాలు: బీజేపీ వర్సెస్ శివసేన.. రచ్చకెక్కిన విభేదాలు
అలా అయితే.. టీఎంసీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించండి : అభిషేక్ బెనర్జీ డిమాండ్
వారణాసి నుంచి నాగ్‌పూర్ వరకూ.. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజలు తిరస్కరించారు
సంబంధిత వార్తలు

Graduate MLC Elections | పట్టభద్రుల MLC పోరు: కాంగ్రెస్ మార్క్ వ్యూహం.. ఏకంగా 233 మంది ఇన్ఛార్జుల రంగప్రవేశం!
అక్టోబర్ 29, 2026

Jairam Ramesh | వారణాసి నుంచి నాగ్‌పూర్ వరకూ.. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజలు తిరస్కరించారు
అక్టోబర్ 29, 2026

Rahul Gandhi | లాఠీలకు భయపడకండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే చలో ఢిల్లీలో పాల్గొనండి : రాహుల్ గాంధీ
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●Stock Markets | ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. భారత మార్కెట్లలో బుల్ ర్యాలీ..
- ●Maheshkumar Goud | ఎన్ని గెలిచామన్నది కాదు.. ఎక్కడ గెలిచామన్నదే పాయింట్
- ●Maharashtra MLC Election Results | మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఫలితాలు : బీజేపీ వర్సెస్ శివసేన.. రచ్చకెక్కిన విభేదాలు
- ●Bollywood | లొకేషన్లు, సెట్స్, మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఏఐ ఆధారంగా సినిమా - ఫ్యామిలీ మ్యాన్ నటి కొత్త ప్రయోగం
- ●Apple MacBook Pro | యాపిల్ నుంచి కొత్త టచ్ స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రొ.. ఫీచర్లు మామూలుగా లేవు..
- ●Abhishek Banerjee | అలా అయితే.. టీఎంసీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించండి : అభిషేక్ బెనర్జీ డిమాండ్

Stock Markets | ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. భారత మార్కెట్లలో బుల్ ర్యాలీ..

Maheshkumar Goud | ఎన్ని గెలిచామన్నది కాదు.. ఎక్కడ గెలిచామన్నదే పాయింట్

Maharashtra MLC Election Results | మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఫలితాలు : బీజేపీ వర్సెస్ శివసేన.. రచ్చకెక్కిన విభేదాలు

Bollywood | లొకేషన్లు, సెట్స్, మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఏఐ ఆధారంగా సినిమా - ఫ్యామిలీ మ్యాన్ నటి కొత్త ప్రయోగం



