త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karwa Chauth | భార్య కర్వా చౌత్ వ్రతం చేయనంద‌ని.. విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించిన భర్త..!

Karwa Chauth | మ‌ధ్య‌ప్ర‌దేశ్ (Madhya Pradesh) శివపురి (Shivpuri) జిల్లాలో విచిత్ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. కర్వాచౌత్ (Karwa Chauth) ఉప‌వాసం ఉండేందుకు భార్య నిరాక‌రించ‌డంతో.. ఓ భ‌ర్త విడాకుల కోసం పోలీసు స్టేష‌న్ మెట్లెక్కాడు.

D

National | Published On Oct 30, 2026, 12.52 pm IST

Karwa Chauth | భార్య కర్వా చౌత్ వ్రతం చేయనంద‌ని.. విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించిన భర్త..!
Advertisement

Karwa Chauth | త్రినేత్ర న్యూస్ : మ‌న దేశంలో పండుగ ఏదైనా మ‌హిళ‌లు ప్ర‌త్యేకంగా నోములు, వ్ర‌తాలు, పూజ‌లు చేస్తుంటారు. వారు చేసేది కూడా పిల్ల‌లు, భ‌ర్త‌, కుటుంబ క్షేమం కోస‌మే. ఇలాంటి పండుగ‌ల్లో క‌ర్వాచౌత్ (Karwa Chauth) ఒక‌టి. భర్త క్షేమం కాంక్షిస్తూ మహిళలు నిష్టగా నోచే నోము ఇది. జీవిత భాగస్వామి, కుటుంబ క్షేమాన్ని కోరుతూ మహిళలు పార్వతీ దేవికి నిష్టగా పూజలు చేస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఉపవాసం ఉంటారు. సాయంత్రం చంద్రుడి దర్శనం చేసుకున్న త‌ర్వాత జ‌ల్లెడ‌లో భ‌ర్త ముఖం చూసి ఆ త‌ర్వాత‌ ఉప‌వాస దీక్ష విర‌మిస్తారు. అయితే, కర్వాచౌత్ ఉప‌వాసం ఉండేందుకు భార్య నిరాక‌రించ‌డంతో.. ఓ భ‌ర్త విడాకుల కోసం పోలీసు స్టేష‌న్ మెట్లెక్కాడు. ఈ విచిత్ర ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ (Madhya Pradesh)లో చోటు చేసుకుంది.

శివపురి (Shivpuri) జిల్లా బిజ్రవాన్ గ్రామానికి చెందిన బరేలాల్ ఆదివాసి అనే వ్యక్తి తన భార్య మిథిలేష్ ఆదివాసి త‌న‌ను మోసం చేస్తోంద‌ని ఆరోపిస్తూ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. త‌న కోసం ఆమె కార్వా చౌత్ వ్రతం చేయడం లేదని, చంద్రుడికి పూజ‌లు చేసే సంప్ర‌దాయ ఆచారాల‌ను కూడా పాటించ‌డం లేద‌ని ఫిర్యాదు చేశాడు. అంతేకాదు, ఆమె త‌న‌ను చంపేందుకు కుట్ర పన్నుతోందని తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆమెపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, త‌న‌కు విడాకులు కావాల‌ని కోరుతూ పోలీసుల‌కు లిఖిత‌పూర్వ‌క ఫిర్యాదు అంద‌జేశాడు. ఈ వ్య‌వ‌హారం స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది. భ‌ర్త ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు రంగంలోకి దిగారు. మహిళా పోలీసు అధికారుల సహాయంతో ఆ దంపతుల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని శివపురి జిల్లా కొలారస్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) సంజయ్ మిశ్రా తెలిపారు.

Also Read..

ట్రిబ్యున‌ళ్ల‌ను పూర్తిగా హైజాక్ చేశారు.. కేంద్ర మంత్రిత్వ శాఖ‌పై సుప్రీం ఆగ్ర‌హం

రూ.12వేల కోట్ల వ్యాపారం ప్ర‌మాదంలో ప‌డుతుంది.. ర్యాలీని వాయిదా వేసుకోండి.. సోనియాకు ఢిల్లీ వ్యాపారుల విజ్ఞ‌ప్తి

కాంగ్రెస్ బ్యాంకులను నిర్మిస్తే.. బీజేపీ వాటిని అమ్ముతోంది : ఐడీబీఐ బ్యాంకు విక్రయంపై రాహుల్ గాంధీ విమర్శలు

ట్యాగ్స్:

Karwa ChauthKarwa Chauth FastMadhya PradeshShivpuri
Advertisement
Advertisement