త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google Gemini | గూగుల్ జెమినిలో కొత్త ఫీచర్.. చాట్‌లోనే ఫైల్స్ క్రియేట్, ఎడిట్..

Google Gemini | గూగుల్ తన జెమిని యాప్‌లో కీలకమైన కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు చాట్‌లోనే డాక్యుమెంట్లు, పీడీఎఫ్‌లు, ప్రెజెంటేషన్లు, స్ప్రెడ్‌షీట్లు, కోడ్ ఫైల్స్‌ను క్రియేట్ చేయడంతోపాటు వాటిని ప్రివ్యూ చూసి, నేరుగా ఎడిట్ చేసుకోవచ్చు.

S

Technology | Published On Oct 30, 2026, 1.50 pm IST

Google Gemini | గూగుల్ జెమినిలో కొత్త ఫీచర్.. చాట్‌లోనే ఫైల్స్ క్రియేట్, ఎడిట్..
Advertisement

Google Gemini | గూగుల్ తన జెమిని యాప్‌లో కీలకమైన కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు చాట్‌లోనే డాక్యుమెంట్లు, పీడీఎఫ్‌లు, ప్రెజెంటేషన్లు, స్ప్రెడ్‌షీట్లు, కోడ్ ఫైల్స్‌ను క్రియేట్ చేయడంతోపాటు వాటిని ప్రివ్యూ చూసి, నేరుగా ఎడిట్ చేసుకోవచ్చు.

గూగుల్ జెమిని యాప్‌లో ఫైల్ క్రియేషన్, ఎడిటింగ్ సామర్థ్యాలను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు జెమిని చాట్‌లోనే వివిధ రకాల ఫైళ్లను తయారు చేసుకోవచ్చు. గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, ప్రెజెంటేషన్ స్లైడ్స్, మార్క్‌డౌన్, టెక్స్ట్ ఫైల్స్, పీడీఎఫ్‌లు, కోడ్ ఫైల్స్‌కు సపోర్ట్ అందిస్తోంది. ఫైల్‌ను పూర్తి స్క్రీన్‌లో తెరిచి నేరుగా మార్పులు చేయడంతో పాటు, అందులోని నిర్దిష్ట టెక్స్ట్‌ను హైలైట్ చేసి దానిపై ప్రశ్నలు అడగవచ్చు. అవసరమైన మార్పులు, టెక్స్ట్, విజువల్స్‌ను మెరుగుపరచాలని జెమినిని కోరవచ్చు.

ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించవచ్చో గూగుల్ ఒక వీడియో ద్వారా కూడా వివరించింది. చేతితో రాసిన లెక్చర్ నోట్స్‌ను జెమినికి అప్‌లోడ్ చేసి, వాటి ఆధారంగా పీడీఎఫ్ స్టడీ గైడ్‌ను రూపొందించుకోవచ్చు. అనంతరం ఆ ఫైల్‌ను మాన్యువల్‌గా ఎడిట్ చేయడంతోపాటు, నిర్దిష్ట భాగాలను హైలైట్ చేసి వాటిలోని టెక్స్ట్ లేదా విజువల్స్‌లో మార్పులు చేయాలని సూచించవచ్చు. అలాగే రూపొందించిన ఫైల్‌కు సంబంధించి అదనపు ప్రశ్నలు కూడా అడగవచ్చు.

పీడీఎఫ్ ఫైళ్ల ప్రివ్యూ, ఎడిటింగ్ సదుపాయం వెబ్‌తోపాటు మొబైల్ యాప్‌లోనూ అందుబాటులో ఉంది. అయితే గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, ప్రెజెంటేషన్లు, మార్క్‌డౌన్, టెక్స్ట్ ఫైల్స్, కోడ్ ఫైల్స్‌కు సంబంధించిన సదుపాయాలు ప్రస్తుతం వెబ్ వెర్షన్‌లో మాత్రమే పనిచేస్తాయి. జెమిని యాప్ అందుబాటులో ఉన్న అన్ని భాషల్లో, ప్రపంచవ్యాప్తంగా యూజర్లందరికీ ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

ట్యాగ్స్:

File CreationFile EditingGemini AiGoogle AiGoogle DocsGoogle GeminiPdf Editing
Advertisement
Advertisement