Rahul Gandhi | కాంగ్రెస్ బ్యాంకులను నిర్మిస్తే.. బీజేపీ వాటిని అమ్ముతోంది : ఐడీబీఐ బ్యాంకు విక్రయంపై రాహుల్ గాంధీ విమర్శలు
Rahul Gandhi | ఐడీబీఐ బ్యాంక్‌లో (IDBI Bank) మెజారిటీ వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు (Canada based Fairfax Financial Holdings) విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు బ్యాంకు ఉద్యోగులకు (IDBI Bank employees) రాహుల్ బహిరంగ లేఖ రాశారు.
Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : ఐడీబీఐ బ్యాంక్‌లో (IDBI Bank) మెజారిటీ వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు (Canada based Fairfax Financial Holdings) విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా వ్యతిరేకించారు. పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నిర్మించిన లాభదాయకమైన ప్రభుత్వ బ్యాంకును మోదీ సర్కార్ విక్రమిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు బ్యాంకు ఉద్యోగులకు (IDBI Bank employees) రాహుల్ బహిరంగ లేఖ రాశారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులను లాభాల్లోకి తెచ్చిన తర్వాత కూడా వాటిని ప్రైవేటీకరించడం వెనుక ఉన్న తార్కికతను రాహుల్ గాంధీ తన లేఖలో ప్రశ్నించారు. ఈ ప్రతిపాదన వల్ల ఉద్యోగులు, డిపాజిటర్లు, రిజర్వేషన్ విధానాలపై పడే ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతేడాది మార్చిలో పార్లమెంట్ భవన్‌లో ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల బృందం తనను కలిసి విషయాన్ని రాహుల్ గుర్తు చేసుకున్నారు. ఉద్యోగులు కష్టపడి లాభాల్లోకి తీసుకొచ్చిన బ్యాంకును ప్రభుత్వం ఎందుకు విక్రహిస్తోందని వారు తనని ప్రశ్నించినట్లు రాహుల్ తెలిపారు. ఇదే ప్రశ్నను తాను లోక్‌సభలో లేవనెత్తినట్లు రాహుల్ వెల్లడించారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ బ్యాంకును ఎందుకు అమ్ముతున్నారు..? ఉద్యోగులు, డిపాజిటర్లను ఎలా కాపాడతారు..? అని ప్రశ్నించినట్లు చెప్పారు.
51 శాతం వాటాను తమవద్దే ఉంచుకుంటామని చెప్పారు..
అయితే తన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఐడీబీఐ బ్యాంకును కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ సంస్థకు విక్రయించాలని మోదీ సర్కార్ నిర్ణియించిందని మండిపడ్డారు. ఇదే సందర్భంగా ఐడీబీఐ బ్యాంకులో కనీసం 51 శాతం యాజమాన్యాన్ని కలిగి ఉంటామని 2003లో పార్లమెంట్‌కు ప్రభుత్వం ఇచ్చిన హామీని రాహుల్ ప్రస్తావించారు. "ప్రజాధనంతో నిర్మించిన సంస్థ ప్రజలకే చెందుతుంది. నేడు ఈ బ్యాంకులో ప్రభుత్వం, ఎల్‌ఐసీ కలిపి 95 శాతం వాటాను కలిగి ఉన్నాయి. విక్రయం తర్వాత వారి వాటా 34 శాతానికి తగ్గిపోతుంది. 2003లో ఐడీబీఐలో కనీసం 51 శాతం వాటాను తమవద్దే ఉంచుకుంటామని ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా హామీ ఇచ్చింది. ఆ హామీ ఇప్పుడు చట్టంలో లేకపోవచ్చు. కానీ పార్లమెంట్‌కు హామీ ఇవ్వడమంటే అది ప్రజలకు ఇచ్చినట్లే" అని పేర్కొన్నారు.
అవి విక్రయించాల్సిన ఆస్తులు కావు
ఐడీబీఐ ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళ్లినప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కల్పిస్తున్న రిజర్వేషన్లు కూడా కనుమరుగవుతాయని రాహుల్ తెలిపారు. ఇప్పటికే బలహీనపడిన ఉద్యోగ సేవా నిబంధనలు తమకున్న చివరి రక్షణను కూడా కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం రెండూ బలంగా కలిసి పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ విశ్వసిస్తుందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు విక్రయించాల్సిన ఆస్తులు కావని.. అవి దేశ నిర్మాణానికి ఉపయోగపడే సాధనాలని రాహుల్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు తన పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్ హామీ ఇచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం బ్యాకులను ఏర్పాటు చేస్తే.. మోదీ ప్రభుత్వం మాత్రం వాటిని అమ్ముతోందంటూ ఎక్స్ వేదికగా రాహుల్ ట్వీట్ పెట్టారు.
कांग्रेस के समय में IDBI बना - देश का उद्योग खड़ा करने के लिए।
मोदी के समय में पहले बोली देखी गई, फिर दाम तय हुआ।
कांग्रेस के time पे बैंक बनते थे। मोदी के time में बिकते हैं।
मैं IDBI बैंक के कर्मचारियों के साथ खड़ा हूँ। https://t.co/uLT7mWTYyr
— Rahul Gandhi (@RahulGandhi) October 30, 2026
Also Read..
భూటాన్‌లో బద్దలైన గ్లేసియల్ సరస్సు.. భారత్ హై అలర్ట్
ఫ్లాట్‌గా ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు.. పెరుగుతున్న అమ్మకాల ఒత్తిడి..
అర్ధరాత్రి 2 గంటల వరకు నిమ్స్‌లో ఏసీబీ సోదాలు.. టెండర్ల కేటాయింపులపై ఆరా..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jairam Ramesh | సర్ అనేది మోదీ, షా కుట్ర.. సీఈసీ దీన్ని అమలు చేశారు : జైరామ్ రమేశ్
అక్టోబర్ 29, 2026

Maheshkumar Goud | ఎన్ని గెలిచామన్నది కాదు.. ఎక్కడ గెలిచామన్నదే పాయింట్
అక్టోబర్ 29, 2026

Graduate MLC Elections | పట్టభద్రుల MLC పోరు: కాంగ్రెస్ మార్క్ వ్యూహం.. ఏకంగా 233 మంది ఇన్ఛార్జుల రంగప్రవేశం!
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●Glacial Lake Outburst | భూటాన్‌లో బద్దలైన గ్లేసియల్ సరస్సు.. భారత్ హై అలర్ట్
- ●TGCHE | సినిమా కోసం కాలేజీకి సెలవు.. మల్లారెడ్డి వర్సిటీకి ఉన్నత విద్యామండలి నోటీసులు!
- ●Stock Markets | ఫ్లాట్‌గా ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు.. పెరుగుతున్న అమ్మకాల ఒత్తిడి..
- ●NIMS | అర్ధరాత్రి 2 గంటల వరకు నిమ్స్‌లో ఏసీబీ సోదాలు.. టెండర్ల కేటాయింపులపై ఆరా..
- ●Comrade Kalyan | ఓటీటీలోకి వచ్చేసిన కామ్రేడ్ కళ్యాణ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
- ●Israel Elections | నెతన్యాహుకి షాక్.. అతిపెద్ద కూటమిగా అవతరించినా.. మెజార్టీకి దూరంగా..

Glacial Lake Outburst | భూటాన్‌లో బద్దలైన గ్లేసియల్ సరస్సు.. భారత్ హై అలర్ట్

TGCHE | సినిమా కోసం కాలేజీకి సెలవు.. మల్లారెడ్డి వర్సిటీకి ఉన్నత విద్యామండలి నోటీసులు!

Stock Markets | ఫ్లాట్‌గా ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు.. పెరుగుతున్న అమ్మకాల ఒత్తిడి..

NIMS | అర్ధరాత్రి 2 గంటల వరకు నిమ్స్‌లో ఏసీబీ సోదాలు.. టెండర్ల కేటాయింపులపై ఆరా..



