త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | రైతును రారాజుగా చేయ‌డ‌మే ప్ర‌ధాని మోదీ ల‌క్ష్యం: బండి సంజ‌య్

Bandi Sanjay | రైతును రారాజుగా చేయడమే ప్ర‌ధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) అన్నారు. ఇందులో భాగంగానే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి (PM-KISAN) ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేస్తున్నామని వెల్ల‌డించారు.

G

Telangana | Published On Oct 30, 2026, 12.49 pm IST

Bandi Sanjay | రైతును రారాజుగా చేయ‌డ‌మే ప్ర‌ధాని మోదీ ల‌క్ష్యం: బండి సంజ‌య్
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర న్యూస్‌: రైతును రారాజుగా చేయడమే ప్ర‌ధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) అన్నారు. ఇందులో భాగంగానే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి (PM-KISAN) ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేస్తున్నామని వెల్ల‌డించారు. తెలంగాణలో (Telangana) 30 లక్షల మందికిపైగా రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతున్న‌ద‌ని తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్ర‌భుత్వం అనే ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంద‌న్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో (ICAR-IIRR) నిర్వహించిన కార్య‌క్ర‌మంలో పీఎం కిసాన్‌ సమ్మాన్ నిధుల‌ను బండి సంజ‌య్ విడుద‌ల చేశారు. అనంత‌రం మాట్లాడుతూ.. దేశానికి జై జవాన్‌, జై కిసాన్‌ రెండు కళ్ల లాంటి వారన్నారు. ప్రధాని మోదీకి సైనికులు, రైతులంటే ఎంతో ఇష్టమని చెప్పారు.

ఐదు రెట్లు పెరిగిన వ్య‌వ‌సాయ బ‌డ్జెట్‌..

2014తో పోలిస్తే వ్యవసాయ బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచార‌ని తెలిపారు. ఇప్పటివరకు 23 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.4.47 లక్షల కోట్లు జమ చేశామని, తాజాగా 9.34 కోట్ల మంది రైతులకు మరో రూ.18,690 కోట్లను విడుదల చేస్తున్నామని వెల్ల‌డించారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా అందుతున్న మొత్తాన్ని 92 శాతం మంది రైతులు వ్యవసాయ అవసరాలకే ఖర్చు చేస్తున్నారని, దీనివల్ల 85 శాతం మంది రైతుల ఆదాయం పెరిగిందని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ఒక రైతు ఏడాది మొత్తం కష్టపడి సంపాదించే ఆదాయం ఐటీ ఉద్యోగి నెల జీతం కంటే తక్కువగా ఉంటున్నద‌ని తెలిపారు.

ఎరువుల సబ్సిడీ (Subsidy) కోసమే కేంద్ర ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న‌ద‌ని వెల్లడించారు. కేంద్రం అందిస్తున్న సబ్సిడీ వల్ల రైతులకు ఎకరాకు సుమారు రూ.18 వేల వరకు ఆదా అవుతున్న‌ద‌ని చెప్పారు. తెలంగాణలో దాదాపు 40 లక్షల మందికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందించామని, వాటి ద్వారా రూ.50 వేల కోట్ల రుణాలు కల్పించామన్నారు. రాష్ట్రంలో 1.10 కోట్ల సాయిల్‌ హెల్త్‌ కార్డులు (Soil Health Card) పంపిణీ చేశామ‌న్నారు.

అగ్ర‌గామి భార‌త్‌..

గ‌తంలో దేశంలో ఆహార ధాన్యాల కొరత కారణంగా ఇతర దేశాల నుంచి బియ్యం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి మారింద‌ని చెప్పారు. ప్రధాని మోదీ (PM Modi) కృషి, వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా నేడు వరి ఎగుమతుల్లో ప్రపంచంలోనే భారత్‌ అగ్రస్థానంలో ఉంద‌న్నారు. హైదరాబాద్‌ అంటే కేవలం ఐటీ మాత్రమే కాదని, వ్యవసాయ పరిశోధన రంగంలోనూ ఐసీఏఆర్‌-ఐఐఆర్‌ఆర్‌ ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నాయని వెల్ల‌డించారు.

ఎల్‌నినోతో క‌రువు ప‌రిస్థితులు

ఎల్‌నినో (El Nino) ప్రభావంతో దేశవ్యాప్తంగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రాష్ట్రంలో సుమారు 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయలేకపోయారని, ఈ సీజన్‌లో దాదాపు రూ.20 వేల కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు అంచనా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా అనేక మండలాలను కరువు (Draught) జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement
Advertisement