Maheshkumar Goud | ఎన్ని గెలిచామన్నది కాదు.. ఎక్కడ గెలిచామన్నదే పాయింట్
Maheshkumar Goud | ఆయా రాష్ట్రాల్లో నిర్వహించిన 28 స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) కాంగ్రెస్ ఎన్ని గెలిచిందని ట్వీట్ చేసిన ప్రధాని మోదీకి టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Maheshkumar Goud) గట్టి కౌంటరిచ్చారు.
- మోదీనే కాదు.. వాళ్ల అబ్బనూ ఓడిస్తం
- వారణాసిలో బీజేపీ ఓడింది.. మోదీ తన వైఫల్యాలను ఒప్పుకోవాలి
- ఆర్ఎస్ఎస్ కంచుకోటలోనూ కాంగ్రెస్ జెండా పాతినం
- బ్యాలెట్‌తో బీజేపీకి బుల్లెట్ దింపినం
- గాంధీ భవన్ ప్రెస్‌మీట్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
Maheshkumar Goud | త్రినేత్ర న్యూస్: ఆయా రాష్ట్రాల్లో నిర్వహించిన 28 స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) కాంగ్రెస్ ఎన్ని గెలిచిందని ట్వీట్ చేసిన ప్రధాని మోదీకి టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Maheshkumar Goud) గట్టి కౌంటరిచ్చారు. ఎన్ని గెలిచామన్నది కాదని.. ఎక్కడ గెలిచామన్నదే పాయింట్ అన్నారు. మోదీ నేతృత్వం వహిస్తున్న వారణాసిలో బీజేపీ ఓడిపోవడం ఆయనపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. నాగ్‌పూర్‌లో బీజేపీ అబ్బ అయిన, ఆర్ఎస్ఎస్ కంచుకోటలో కాంగ్రెస్ జెండా పాతామన్నారు. బీజేపీకి బ్యాలెట్ ద్వారా బుల్లెట్ దింపామని గద్గదస్వరంతో మాట్లాడారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ, బీజేపీపై విమర్శలు గుప్పించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది. వారణాసి టీచర్స్ నియోజకవర్గంలో, బీజేపీ అభ్యర్థి ప్రమోద్ మిశ్రా ఓడిపోయాడు. ఇండియా కూటమి పార్టీ అయిన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి లాల్ బీహారీ యాదవ్ గెలుపొందాడు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్‌పూర్‌లో బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సొంత టౌన్ కూడా అయిన నాగ్‌పూర్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిజీత్ వంజారి, బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోహళెపై విజయం సాధించాడు.
పాట్నాలో ఖంగుతిన్నారు
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నోలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీ బీజేపీ నుంచి కైవసం చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి కాంతి సింగ్, బీజేపీ అభ్యర్థి అవనీష్ కుమార్ సింగ్‌పై విజయం సాధించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజకీయ ప్రాబల్యం ఉన్న పాట్నాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఐదుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన నవల్ కిశోర్ యాదవ్, పాట్నా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఆర్జేడీ అభ్యర్థి సంజీవ్ కుమార్ విజయం సాధించి ఈ స్థానాన్ని బీజేపీ నుంచి కైవసం చేసుకున్నారు.
పుణే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీకి ఓటమి. పుణే డివిజన్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్) అభ్యర్థి హర్షదా దేశ్‌ముఖ్, బీజేపీ అభ్యర్థి స్మితా జాధవ్‌పై విజయం సాధించారు. యోగి ఆదిత్యనాథ్ సొంత గడ్డ గోరఖ్‌పూర్‌లో బీజేపీకి గట్టి పోటీ. గోరఖ్‌పూర్-ఫైజాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధ్రువ్ కుమార్ త్రిపాఠి కేవలం 307 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. మూడు నెలల క్రితం, బీహార్ రాష్ట్రంలోని బాంకీపూర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ ప్రాతినిథ్యం వహించిన స్థానంలో బీజేపీ ఓడిపోయింది.
కుంభ స్థలాలనే కొట్టాం
కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలి. కాంగ్రెస్ కూడా అదే చేసింది. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ అయిన నాగ్ పూర్ లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇటీవల ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే మాట్లాడుతూ, మోదీని మాత్రమే కాదు, వాళ్ల అబ్బను కూడా ఓడిస్తాం అని ప్రకటించారు. కర్ణాటకలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో అయిపోతుందని కామెంట్ చేస్తున్న బేజేపీ.. మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారాణాసిలో, ఫడ్నవిస్ సొంత పట్టణ నాగ్ పూర్‌లో బీజేపీ ఓడిపోయింది. అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వం ఓడిపోబోతుందని బీజేపీ నేతలు చెప్పదల్చుకున్నారా?
కర్ణాటక లో కాంగ్రెస్ ఓడిపోయింది, అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పనైపోయిందని మాట్లాడుతున్న బీజేపీ నేతలు.. మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగిన ఎన్నికల్లోనే ప్రజలు మోదీకి వ్యతిరేకంగా ఓటు వేసి, బీజేపీ అభ్యర్థిని ఓడించారు. వారాణాసి నియోజకర్గంలో బీజేపీ ఓటమి అంటే, అది కూడా మోదీ పాలనకు రిఫరెండం లాంటిదే అని చెప్పే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? బీజేపీకి కర్ణాకటలో ఒక రీతి వారణాసిలో మరో నీతి. మోదీకి నీతి, నైతికత ఉంటే.. వారణాసిలో బీజేపీ ఓటమికి బాధ్యత వహించడంతో పాటు తన వైఫల్యాలను అంగీకరించాలి.
యువత లో మోదీ పాలనపై పెరుగుతున్న వ్యతిరేకత, చదువుకున్న వర్గాల్లో మోదీ పాలనపై పెరుగుతున్న అసంతృప్తి, ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తున్న మార్పు.. మోదీ నియోజకవర్గమైన వారణాసిలో బీజేపీ అభ్యర్థి ఓడిపోవడం, మోదీ పాలనపై పెరిగిన తీవ్రమైన వ్యతిరేకతకు నిదర్శనం. ఆర్ఎస్ ఎస్ సిద్దాంతాల ఆధారంగా బీజేపీ రాజకీయం చేస్తోంది. ఇప్పుడు ఆర్ఎస్ ఎస్ హెడ్ క్వార్టర్స్ అయిన నాగ్ పూర్ లోనే చదువుకున్న యువత, మేధావులు, ప్రజలు బీజేపీని ఓడించారు. బీజేపీ మతపరమైన, సమాజాన్ని విడదీసే సిద్దాంతాలను నాగ్ పూర్ సాక్షిగా ప్రజలు తిరస్కరించారు.
వెకిలి ట్వీట్ కాదు.. ప్రెస్‌మీట్ పెట్టు
ప్రెస్ మీట్ పెట్టే దమ్ము లేని పిరికి ప్రధాన మంత్రి దేశ వ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలపై మోదీ ట్విట్టర్ లో వెకిలిగా ట్వీట్ వేసి, ప్రధాన మంత్రి స్థాయిని దిగజార్చారు. నిజంగానే, మోడీకి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స్పందించాలని ఉంటే, ప్రెస్ మీట్ పెట్టాలి. ఢిల్లీలో లేదా వారణాసిలో మోదీ ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించాలి. ప్రధాన మంత్రి అయి 12 సంవత్సరాలు దాటినా, ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టే దమ్ము లేని ప్రధాన మంత్రి, ట్వీట్ పెట్టి పైశాచికానందం పొందుతున్నారు.
బాంకీపూర్ నుంచి వారణాసి వరకు.. అన్ని వర్గాల్లోనూ బీజేపీపై పెరిగిన వ్యతిరేకత ఉంది. బీహార్ లోని బాంకీపూర్ లో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ సిట్టింగ్ స్థానంలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీని ఓడించారు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్, టీచర్స్ , యువత, మేధావులు, ఉద్యోగులు.. బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు బీజేపీ పాలనను తిరస్కరిస్తున్నా, బీజేపీకి బుద్ది రావడం లేదు. పాలనతో మార్పు రావడం లేదు.
వారి పరిస్థితేంటో తెలుస్తుంది
మోదీ సొంత నియోజకవర్గం వారణాసి నుంచి, రాజ్‌నాథ్ సింగ్ కంచుకోట లక్నో వరకు, దేవేంద్ర ఫడ్నవీస్ సొంత నగరం నాగ్‌పూర్ నుంచి, నితిన్ నబిన్‌కు చెందిన పాట్నా వరకు.. బీజేపీ అగ్రనేతల కంచుకోటల్లోనే ప్రజలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. పుణె, ప్రయాగ్‌రాజ్‌లోనూ (అలహాబాద్–ఝాన్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ) బీజేపీకి ఎదురుదెబ్బలు తగలగా, యోగి ఆదిత్యనాథ్ సొంత ప్రాంతం గోరఖ్‌పూర్‌లో కేవలం 307 ఓట్లతో బీజేపీ గట్టెక్కింది. కీలక నేతల సొంత ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి ఉంటే, దేశంలో బీజేపీ పరిస్థితి ఏంటో స్పష్టమవుతోంది.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ మూడు అంకెల సీట్లు కూడా గెలవలేని పరిస్థితి తప్పదు. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయా. ఎంపీ స్థానాల్లో కూడా బీజేపీ నేతలు ఉన్నారు. ఎమ్మెల్యేలుగా కూడా బీజేపీ నేతలు ఉన్నారు. కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. వారణాసి, నాగ్‌పూర్ లాంటి కీలక స్థానాల్లో బీజేపీ ఓడిపోయిందంటే, మోదీ పాలనపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.
బీజేపీ వంటి ప్రమాదకర రాజకీయ శక్తులను ఓడించాలంటే, వాటికి వ్యతిరేకంగా నిలిచే ప్రత్యామ్నాయ శక్తులకు ఓటు వేయాలనే ప్రజా చైతన్యం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలనే సంకల్పంతో రాహుల్ గాంధీ ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఫలితాలు బీజేపీకి పెరుగుతున్న వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఎదురయ్యే పరాజయం ఏ స్థాయిలో ఉంటుందో ఈ ఫలితాలు ముందస్తు సంకేతాలిస్తున్నాయి.
ప్రజలు డిసైడ్ అయిర్రు..
వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావడం ఖాయం. ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనం. మార్పునకు సంకేతం. ఓటు చోరీ ద్వారా, ఎస్‌ఐఆర్‌ను అడ్డం పెట్టుకొని మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఇండియా కూటమికి ప్రజలు పట్టం కట్టబోతున్నారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. బీజేపీ ఓటు చోరీకి వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో లక్షలాది మంది ప్రజలతో, ఇండియా కూటమి భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది.
ఢిల్లీకి పోవడం ఖాయం
అయితే ఈ కార్యక్రమం ఘన విజయం సాధిస్తే, బీజేపీకి దేశ వ్యాప్తంగా ఇబ్బందులు తప్పవని.. కాంగ్రెస్ కార్యక్రమానికి ప్రజలు ఎక్కవగా రాకుండా చేయాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా, రైళ్లు కేటాయించకుండా, అధికార దుర్వినియోగం చేస్తోంది. బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తెలంగాణ నుంచి వేలాదిమంది ప్రజలు, దేశవ్యాప్తంగా లక్షలాది ప్రజలు నవంబర్ 1 న ఢిల్లీ చేరుకోవడం ఖాయం. ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించిన 13.3 కోట్ల ఓట్లను వెంటనే తిరిగి చేర్చాలి అని మహేశ్‌కుమార్ డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Graduate MLC Elections | పట్టభద్రుల MLC పోరు: కాంగ్రెస్ మార్క్ వ్యూహం.. ఏకంగా 233 మంది ఇన్ఛార్జుల రంగప్రవేశం!
అక్టోబర్ 29, 2026

Kotta Prabhakar Reddy | లాస్య మృతిలో వాస్తవాలు తేల్చాలి.. 20 లక్షల పరిహారం ఇవ్వాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్
అక్టోబర్ 29, 2026

Harish Rao | “నేను రైతునవుతా.. దేశానికి అన్నం పెడతా” అని చెప్పుకొనే రోజు రావాలి
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●Abhishek Banerjee | అలా అయితే.. టీఎంసీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించండి : అభిషేక్ బెనర్జీ డిమాండ్
- ●Graduate MLC Elections | పట్టభద్రుల MLC పోరు: కాంగ్రెస్ మార్క్ వ్యూహం.. ఏకంగా 233 మంది ఇన్ఛార్జుల రంగప్రవేశం!
- ●South Central Railway | ఇక పెన్షనర్లకు.. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇంట్లో నుంచే సులభంగా..
- ●Jairam Ramesh | వారణాసి నుంచి నాగ్‌పూర్ వరకూ.. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజలు తిరస్కరించారు
- ●Kotta Prabhakar Reddy | లాస్య మృతిలో వాస్తవాలు తేల్చాలి.. 20 లక్షల పరిహారం ఇవ్వాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్
- ●Janhvi Kapoor | ఆ అవమానం జీవితాంతం మోయాల్సిందే - పెద్ద వివాదంపై జాన్వీకపూర్ రియాక్షన్

Abhishek Banerjee | అలా అయితే.. టీఎంసీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించండి : అభిషేక్ బెనర్జీ డిమాండ్

Graduate MLC Elections | పట్టభద్రుల MLC పోరు: కాంగ్రెస్ మార్క్ వ్యూహం.. ఏకంగా 233 మంది ఇన్ఛార్జుల రంగప్రవేశం!

South Central Railway | ఇక పెన్షనర్లకు.. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇంట్లో నుంచే సులభంగా..

Jairam Ramesh | వారణాసి నుంచి నాగ్‌పూర్ వరకూ.. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజలు తిరస్కరించారు




