MLA Sanjay | ‘గ్లోబల్’ కాదు.. నీళ్ల సమ్మిట్ పెడితే ఎట్ల ఎత్తిపోయాల్నో చెప్తం
MLA Sanjay | ఇప్పుడు పెట్టాల్సింది గ్లోబల్ సమ్మిట్ (Global Summit) కాదని.. నీళ్ల సమ్మిట్ పెడితే నీళ్లెట్ల ఎత్తి పోయాల్నో చెప్తామని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కె.సంజయ్ (MLA Sanjay) అన్నారు.
- ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేని రేవంత్.. సమ్మిట్‌కొచ్చేవాళ్లకు నీళ్లు ఎట్లిస్తడు
- కరెంటే ఇవ్వలేనప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఎందుకు?
- కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశాన్ని శాసిస్తే ఇప్పుడు ఢిల్లీలో యాచిస్తున్నరు
- పరిశ్రమలన్ని ఏపీకీ పోతున్నయ్
- సీఎం రేవంత్‌పై ఎమ్మెల్యే సంజయ్ ఫైర్
MLA Sanjay | త్రినేత్ర న్యూస్: ఇప్పుడు పెట్టాల్సింది గ్లోబల్ సమ్మిట్ (Global Summit) కాదని.. నీళ్ల సమ్మిట్ పెడితే నీళ్లెట్ల ఎత్తి పోయాల్నో చెప్తామని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కె.సంజయ్ (MLA Sanjay) అన్నారు. గొంతు తడిపేందుకు నీళ్లు లేకున్నా రేవంత్ గ్లోబల్ సమ్మిట్ పెడతామంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి పరిశ్రమలన్ని ఆంధ్రప్రదేశ్ కు తరలి వెళ్తున్నాయన్నారు. మోదీని పెద్దన్న అని పిలిచే రేవంత్ పరిశ్రమలు ఎందుకు తేలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశాన్ని శాసిస్తే ఇప్పుడు ఢిల్లీలో యాచించే దుస్థితి వచ్చాందని మండిపడ్డారు.
తెలంగాణ రాకముందు 7 వేల మెగావాట్ల కరెంట్ ఉంటే కేసీఆర్ వచ్చిన తర్వాత 20 వేల మెగావాట్ల వరకు తెచ్చారు. తెచ్చిన 20 వేల మెగావాట్ల కరెంట్ ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ఈ ప్రభుత్వంలో పరిశ్రమలకు కరెంట్ లేదు. కరెంట్ ఇవ్వలేనప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఎందుకు? కేటీఆర్ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చారు. మన రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోతున్నాయి.
అన్ని రంగాలను దెబ్బతీసిన తర్వాత 3 ట్రిలియన్ ఎకనామి ఎలా సాధ్యం? రేవంత్ రెడ్డి జోకర్‌లా మాట్లాడుతున్నారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాయి. వ్యాపారాలు లేవని అనేకమంది బాధపడుతున్నారు. నీళ్ళు లేక రైతులు గోస పడుతున్నారు. జుట్టు, బొచ్చు గురించి కేంద్రంలో ఉండే ఎంపీలు మాట్లాడుతున్నారు.
వాళ్లే ధర్నా చేయడమేందో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్ల కావొస్తోంది. హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్కటి ఫ్లైఓవర్ కట్టలేదు. కేసీఆర్ పాలనలో 30 ఫ్లైఓవర్ నిర్మించారు. అధికార పార్టీని ప్రశ్నిస్తే వాళ్ళే ధర్నా చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ధర్నా చేయడం ఏంటో? బీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తాం అంటే హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. హౌస్ అరెస్ట్ లు చేసి చేసి ఈ ప్రభుత్వం అలసిపోతుంది.
కైటెక్స్ వెళ్లిపోయింది
ప్రజలకు నీళ్లు ఇవ్వలేమని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వలేని రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే వారికి నీళ్ళు ఎలా ఇస్తాడు. కైటెక్స్ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిపోయింది. మంత్రులు మాట్లాడుతుంటే జోకర్లు మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే మంత్రి శ్రీధర్ బాబు లాంటి తెలివైన వారు మాట్లాడితే బావుంటుంది అని సంజయ్ సూచించారు.
ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమళ్ల రాకేష్ కుమార్ పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Padi Koushik Reddy | క్రాప్ హాలిడే ఇయ్యడానికి నువ్వెవరు.. తెలంగాణ నీ జాగీరా?
- ●Supreme Court | కాలుష్య రహిత దీపావళి.. విరాట్ కోహ్లీతో అవగాహన కల్పించండి : సుప్రీంకోర్టు
- ●India Poverty | భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం.. ఇక అంతా హ్యాపీయేనా..?
- ●Kondagattu Anjanna | నాకు బంగారం ఇప్పిస్తే.. నీకు వెండి గద చేయిస్తా.. కొండగట్టు అంజన్నకు భక్తుల కోరికలు
- ●Formula E Racing case | రేసింగ్ కేసు.. డిసెంబర్ 4కు వాయిదా
- ●Karwa Chauth | భార్య కర్వా చౌత్ వ్రతం చేయనందని.. విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించిన భర్త..!

Padi Koushik Reddy | క్రాప్ హాలిడే ఇయ్యడానికి నువ్వెవరు.. తెలంగాణ నీ జాగీరా?

Supreme Court | కాలుష్య రహిత దీపావళి.. విరాట్ కోహ్లీతో అవగాహన కల్పించండి : సుప్రీంకోర్టు

India Poverty | భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం.. ఇక అంతా హ్యాపీయేనా..?

Kondagattu Anjanna | నాకు బంగారం ఇప్పిస్తే.. నీకు వెండి గద చేయిస్తా.. కొండగట్టు అంజన్నకు భక్తుల కోరికలు




