త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kondagattu Anjanna | నాకు బంగారం ఇప్పిస్తే.. నీకు వెండి గద చేయిస్తా.. కొండగట్టు అంజన్నకు భక్తుల కోరికలు

Kondagattu Anjanna | నాకు బంగారం ఇప్పిస్తే.. నీకు వెండి గ‌ద చేయిస్తా!.., హ‌నుమాండ్ల సాక్షిగా ఇచ్చిన హామీని మా ఎమ్మెల్యే నిల‌బెట్టుకోవాలి.. స్వామీ నా పిల్ల‌ల‌కు తెలివితేట‌లు పెంచు.. ఏంటీ ఈ కోరిక‌ల చిట్టా అనుకుంటున్నారా?.. ఇవి కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌కు (Kondagattu Anjanna) భ‌క్తుల మొక్కులు.

G

Telangana | Published On Oct 30, 2026, 1.15 pm IST

Kondagattu Anjanna | నాకు బంగారం ఇప్పిస్తే.. నీకు వెండి గద చేయిస్తా.. కొండగట్టు అంజన్నకు భక్తుల కోరికలు
Advertisement

Kondagattu Anjanna | త్రినేత్ర న్యూస్‌: నాకు బంగారం ఇప్పిస్తే.. నీకు వెండి గ‌ద చేయిస్తా!.., హ‌నుమాండ్ల సాక్షిగా ఇచ్చిన హామీని మా ఎమ్మెల్యే నిల‌బెట్టుకోవాలి.. స్వామీ నా పిల్ల‌ల‌కు తెలివితేట‌లు పెంచు.. ఏంటీ ఈ కోరిక‌ల చిట్టా అనుకుంటున్నారా?.. ఇవి కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌కు (Kondagattu Anjanna) భ‌క్తుల మొక్కులు.

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీలు (Hundi Counting) తెరిచి కానుకలను లెక్కించారు. ఈ సంద‌ర్భంగా హుండీల్లో అంజ‌న్న‌ను వేడుకుంటూ భ‌క్తులు రాసిన లేఖ‌లను (Letters) అధికారులు గుర్తించారు. వాటిలో పలువురి లేఖలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ముంపు గ్రామంగా ప్రకటించాలి..

`కరీంనగర్​ జిల్లా నారాయణపూర్​ ప్రజలపై కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. ఆ గ్రామాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించాలి. ఆ గ్రామాన్ని వరద ప్రాంతంగా ప్రకటిస్తామని హన్మండ్ల సాక్షిగా ఇచ్చిన హామీని ఎమ్మెల్యే నిలబెట్టుకోవాలి` అంటూ స్వామివారి పేరుతో ఓ భ్య‌క్తుడు రాసిన లేఖ‌లో కోరారు.

స్వామీ తెలివితేట‌లు పెంచు..

`స్వామీ మా కుమారుడు, కుమార్తె తెలివితేటలను పెంచు. నా భార్యాపిల్లలను బడికి పంపేలా చెయ్యి స్వామీ' అని మ‌రో భ‌క్తుడు పేర్కొన్నారు. `నాకు డీపీవోలో ఉద్యోగం రీ పోస్టింగ్​ ఇప్పించు. దాంతోపాటు నేను కోరినట్లుగా బంగారం, సెల్‌ఫోన్, నగదు ఇప్పిస్తే.. నీకు రెండు తులాల వెండి గదను తయారు చేయించి ఇస్తా` అంటూ ఓ భ‌క్తుడు త‌న‌ లేఖలో స్వామివారిని వేడుకున్నారు.

కోటీ 23 ల‌క్ష‌ల ఆదాయం..

కాగా, గ‌త 76 రోజుల్లో కొండ‌గ‌ట్టు అంజ‌న్న ఆల‌యానికి రూ.1,23,00,984 నగదు సమకూరింది. 68 విదేశీ నోట్లు కూడా హుండీల్లో ల‌భించాయ‌ని ఈవో అంజనా రెడ్డి తెలిపారు. హుండీల్లో లభించిన బంగారం, వెండి ఆభరణాలను తూకం వేయకుండా సంచుల్లో కట్టి, సీల్ చేసి తిరిగి హుండీలలోనే భద్రపరిచినట్లు వెల్ల‌డించారు.

ట్యాగ్స్:

Donation BoxesHundi CountingKondagattu AnjannaKondagattu TempleLetters
Advertisement
Advertisement