Padi Koushik Reddy | క్రాప్ హాలిడే ఇయ్యడానికి నువ్వెవరు.. తెలంగాణ నీ జాగీరా?
Padi Koushik Reddy | క్రాప్ హాలిడే (Crop Holiday) ఇయ్యడానికి రేవంత్‌రెడ్డి ఎవరని.. తెలంగాణ ఏమైనా ఆయన జాగీరా అని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Koushik Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
- మేడిగడ్డ వద్ద ఇప్పటికీ 25 వేల క్యూసెక్కుల నీళ్లు పోతున్నయ్
- కారు కడిగితే ఫైన్ వేసినవ్.. మేడిగడ్డ వద్ద నీళ్లెత్తని నీకెంత ఫైన్ ఏయాలి
- అవినీతి చేసి పందికొక్కు తిన్నట్టు తింటున్నవ్
- ఎండిన ప్రతి ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వు
- మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఫైర్
Padi Koushik Reddy | త్రినేత్ర న్యూస్: క్రాప్ హాలిడే (Crop Holiday) ఇయ్యడానికి రేవంత్‌రెడ్డి ఎవరని.. తెలంగాణ ఏమైనా ఆయన జాగీరా అని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Koushik Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికీ మేడిగడ్డ వద్ద 25 వేల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయన్నారు. హైదరాబాద్‌లో కారు కడిగితే ఫైన్ వేసిన రేవంత్‌కు.. నీళ్లు వదిలేస్తున్నందుకు ఎంత ఫైన్ వేయాలో ప్రజలే నిర్ణయించాలన్నారు. ఎండిన ప్రతి ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వంపై రుసరుసలాడారు. అవినీతి సొమ్మును పందికొక్కు తిన్నట్టు తింటున్నారని ఆరోపించారు.
ఇది కాంగ్రెస్ నినో ప్రభావం
రైతాంగానికి అండగా ఉండేందుకు కేసీఆర్ నాయకత్వంలో ఈ మీడియా సమావేశం పెడుతున్నం. రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్న జవాబు చెప్పాలి. కేటీఆర్ నాయకత్వంలో జూన్ 9 బీఆర్ఎస్ శాసన సభ్యులం మేడిగడ్డ వెళ్ళాం. నీళ్లను ఎత్తకుండా రేవంత్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్‌తో రైతులను ఇబ్బంది పెట్టాడు. వెయ్యి టీఎంసీల నీళ్లను గోదావరిలో వదిలి పెట్టారు. ఇది ఎల్ నినో ప్రభావం కాదు, కాంగ్రెస్ నినో ప్రభావం. ఇది కాలం తెచ్చిన కరవు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరవు.
నిజమేందో తెలిసింది
మేడిగడ్డ వద్ద నీళ్లను వాడుకోకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. క్రాఫ్ హాలిడే డిక్లేర్ చెయ్యడానికి రేవంత్ రెడ్డి ఎవరు? కేసీఆర్ ఉన్నప్పుడు ఏనాడు కరువు లేదు. కేసీఆర్ దిగిపోగానే కరువుతో తెలంగాణ అల్లాడిపోతోంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొందరలోనే హాలిడే ఇవ్వబోతున్నారు. వేలాది రూపాయలతో ట్యాంకర్లు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా తిరిగి వచ్చినట్లు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పాడు. నిజం ఏంటో తెలంగాణ ప్రజలకు అర్థం అయింది.
దొంగతో రాహుల్ ధర్నా
తొందరలోనే రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఇంటికి పంపుతారు. ఎండిపోయిన ప్రతి ఎకరాకు 50 వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్. కాంగ్రెస్ తెచ్చిన కరవుతో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. 50 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిన దొంగతో రాహుల్ గాంధీ ధర్నా చేస్తున్నాడు. రాహుల్ గాంధీ చేసే పిచ్చి పనుల వల్లే మోదీ రాజ్యం ఏలుతున్నాడు.
రైతుబంధు ఇవ్వమని ఏ రైతు చెప్పలేదు. రైతుల గురించి కేసీఆర్ కు తెలుసు కాబట్టే రైతుబంధు ఇచ్చాడు. దిమాకు లేని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేడిగడ్డ వద్ద నీళ్లను ఎత్తి రైతులకు సాగునీరివ్వాలి. సీనియర్ మంత్రులతో మీడియా సమావేశం పెట్టలేని పరిస్థితి రేవంత్ రెడ్డిది. రేవంత్ హౌలాగాడులా ఉన్నాడని కాంగ్రెస్ నేతలే అంటున్నారు అని కౌశిక్‌రెడ్డి విమర్శించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Supreme Court | కాలుష్య రహిత దీపావళి.. విరాట్ కోహ్లీతో అవగాహన కల్పించండి : సుప్రీంకోర్టు
- ●India Poverty | భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం.. ఇక అంతా హ్యాపీయేనా..?
- ●Kondagattu Anjanna | నాకు బంగారం ఇప్పిస్తే.. నీకు వెండి గద చేయిస్తా.. కొండగట్టు అంజన్నకు భక్తుల కోరికలు
- ●Formula E Racing case | రేసింగ్ కేసు.. డిసెంబర్ 4కు వాయిదా
- ●Karwa Chauth | భార్య కర్వా చౌత్ వ్రతం చేయనందని.. విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించిన భర్త..!
- ●Bandi Sanjay | రైతును రారాజుగా చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం: బండి సంజయ్

Supreme Court | కాలుష్య రహిత దీపావళి.. విరాట్ కోహ్లీతో అవగాహన కల్పించండి : సుప్రీంకోర్టు

India Poverty | భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం.. ఇక అంతా హ్యాపీయేనా..?

Kondagattu Anjanna | నాకు బంగారం ఇప్పిస్తే.. నీకు వెండి గద చేయిస్తా.. కొండగట్టు అంజన్నకు భక్తుల కోరికలు

Formula E Racing case | రేసింగ్ కేసు.. డిసెంబర్ 4కు వాయిదా






