త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Badrinath Dham | తెరుచుకున్న బ‌ద్రీనాథ్ ఆల‌య ద్వారాలు.. వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు

Badrinath Dham | ఉత్త‌రాఖండ్ (Uttarakhand)లోని హిమాల‌య ప‌ర్వ‌త శ్రేణుల్లో కొలువై ఉన్న బ‌ద్రీనాథ్ ధామ్ (Badrinath Dham) ద్వారాలు ఇవాళ తెరుచుకున్నాయి. ఉద‌యం 6:15 గంట‌ల స‌మ‌యంలో వేద పండితుల మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య ఆల‌య తలుపుల‌ను తెరిచారు.

D

National | Published On Apr 23, 2026, 11.59 am IST

Badrinath Dham | తెరుచుకున్న బ‌ద్రీనాథ్ ఆల‌య ద్వారాలు.. వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు
Advertisement

Badrinath Dham | ఉత్త‌రాఖండ్ (Uttarakhand)లోని హిమాల‌య ప‌ర్వ‌త శ్రేణుల్లో కొలువై ఉన్న బ‌ద్రీనాథ్ ధామ్ (Badrinath Dham) ద్వారాలు ఇవాళ తెరుచుకున్నాయి. ఉద‌యం 6:15 గంట‌ల స‌మ‌యంలో వేద పండితుల మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య ఆల‌య తలుపుల‌ను తెరిచారు. ఈ సంద‌ర్భంగా స్వామివారిని ద‌ర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. డోర్స్ ఓపెన్ చెయ్య‌గానే స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యాన్ని వివిధ ర‌కాల పూల‌తో సుంద‌రంగా అలంక‌రించారు. ప‌విత్ర చార్‌ధామ్‌ యాత్ర (Char Dham Yatra)లో భాగంగా కేదార్‌నాథ్ ధామ్‌ (Sri Kedarnath Dham) నిన్న తెరుచుకున్న విష‌యం తెలిసిందే. చార్‌ధామ్‌ యాత్ర ఈ నెల 19 నుంచి ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని గంగోత్రి, య‌మునోత్రి ఆలయాల తలుపులు తెరుచుకున్నాయి. ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం భ‌క్తులకు అనుమ‌తిస్తున్నారు.

Also Read..

బిగ్ అల‌ర్ట్‌.. భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు..? లీటరుపై రూ. 28 బాదుడు.. ఎప్ప‌టి నుంచంటే..?

లేచింది మ‌హిళా లోకం రివ్యూ - సీరియ‌ల్‌కు ఎక్కువ‌...సినిమాకు త‌క్కువ‌...

స్టీల్ వినియోగ‌దారుల ఫోర‌మ్ జాతీయ వైస్ చైర్మ‌న్‌గా సీహెచ్ శ్రీనివాస్‌..

Advertisement
Advertisement