Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెలల్లోనే 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు
Kedarnath Dham | ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని పవిత్రమైన శ్రీ కేదార్‌నాథ్ ధామ్ (Sri Kedarnath Dham)లో చెత్తాచెదారం భారీగా పేరుకుపోయింది. గడిచిన ఐదు నెలల్లోనే కేదార్‌నాథ్ వద్ద సుమారు 50.30 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. ఇది గతేడాది మొత్తం యాత్రా సీజన్‌తో పోలిస్తే 135 శాతం అధికం.
Kedarnath Dham | త్రినేత్ర న్యూస్ : దేవభూమి ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని పవిత్రమైన శ్రీ కేదార్‌నాథ్ ధామ్ (Sri Kedarnath Dham)కు భక్తులు (pilgrims) పోటెత్తుతున్నారు. అదే సమయంలో భక్తుల రద్దీతో పుణ్యక్షేత్రం పరిసరాల్లో రోజురోజుకూ చెత్తాచెదారం భారీగా పెరిగిపోతోంది. గడిచిన ఐదు నెలల్లోనే కేదార్‌నాథ్ వద్ద సుమారు 50.30 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. ఇది గతేడాది మొత్తం యాత్రా సీజన్‌తో పోలిస్తే రెండున్నర రెట్లు ఎక్కువ అని అధికారులు తెలిపారు.
గతేడాదితో పోలిస్తే 135 శాతం పెరిగిన చెత్త
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ గుప్తా అడిగిన ప్రశ్నకు కేదార్‌నాథ్ నగర పంచాయతీ ఈ వివరాలను వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. కేదార్‌నాథ్‌లో 2023లో 32.58 మెట్రిక్ టన్నుల చెత్త బయటపడింది. 2024లో 26.10 మెట్రిక్ టన్నులు, 2025లో 21.40 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు జనరేట్ అయ్యాయి. అయితే, ఈ ఏడాది కేవలం ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలోనే ఏకంగా 50.30 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడటం గమనార్హం. 2023 ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐదు నెలల్లోనే దాదాపు 54 శాతం, 2024తో పోలిస్తే 93 శాతం, 2025తో పోలిస్తే 135 శాతం మేర చెత్త ఉత్పత్తి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
20 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్
నగర పంచాయతీ డేటా ప్రకారం.. ఏప్రిల్‌లో 1.7 మెట్రిక్ టన్నుల చెత్త రాగా, మే నెలలో 16.3 మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇక జూన్‌లో 11.5 మెట్రిక్ టన్నులు, జూలైలో 10.5 మెట్రిక్ టన్నులు, ఆగస్టులో 10.3 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడ్డాయి. ఈ వ్యర్థాల ద్వారా ఇప్పటివరకు సుమారు 20 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వెలువడినట్లు నగర పంచాయతీ డేటా వెల్లడిస్తోంది. ఇందులో 18.5 టన్నులు (92.5 శాతం) ప్రాసెస్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా సుమారు 1.5 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు అలాగే ఉన్నాయని చెప్పారు. కేదార్‌నాథ్‌లో చెత్త నిర్వహణ కోసం 30,000 చదరపు అడుగుల ల్యాండ్‌ఫిల్ సామర్థ్యం ఉన్నట్లు పంచాయతీ కార్యాలయం వెల్లడించింది. అందులో ఇంకా 28,000 చదరపు అడుగులు మిగిలి ఉందని పేర్కొంది. గత ఐదేళ్లలోనే నగర పంచాయతీ నాలుగు ల్యాండ్‌ఫిల్స్‌ను నిర్మించినట్లు వివరించింది.
పర్యావరణానికి పెను ముప్పు
కేదార్‌నాథ్‌లో పెరుగుతున్న వ్యర్థాల నేపథ్యంలో ల్యాండ్‌ఫిల్స్‌పైనే ఆధారపడటం హిమాలయ పర్యావరణానికి పెను ముప్పుగా మారుతుందని నోయిడాకు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ గుప్తా (Amit Gupta) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అత్యంత సున్నితమైన ప్రాంతాన్ని సందర్శించే యాత్రికులు, పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుండటమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. "కేవలం ఐదు నెలల్లోనే కేదార్‌నాథ్‌లో ఇంత భారీ మొత్తంలో చెత్త ఉత్పత్తి కావడం మన పర్యావరణానికి పెను ముప్పు. పవిత్రమైన, పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కేదార్‌నాథ్ లాంటి ప్రాంతాన్ని చెత్త కుప్పగా మార్చడానికి మనమే ప్రధాన కారణం" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకూ దాదాపు 15 లక్షల మంది యాత్రికులు కేదార్‌నాథ్‌ను సందర్శించారు.
STORY | Kedarnath generates 50.30 tonnes of waste in 5 months, 2.5 times more than last year
Kedarnath Dham generated 50.30 metric tonnes of waste in just five months from April to August 2026. This figure is more than two and a half times the waste collected during the entire… pic.twitter.com/jIT6afrpk7
— Press Trust of India (@PTI_News) September 25, 2026
Also Read..
యూట్యూబ్‌లో భారీ మార్పులు.. ఏఐతో వీడియో ఎడిటింగ్, లైవ్ డబ్బింగ్..
సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలు పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ
బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●YouTube | యూట్యూబ్‌లో భారీ మార్పులు.. ఏఐతో వీడియో ఎడిటింగ్, లైవ్ డబ్బింగ్..
- ●Balapur Laddu | రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ.. రూ.39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి
- ●PB Fintech | పాలసీబజార్ షేర్లలో మళ్లీ ఊగిసలాట.. బ్రోకరేజీల రేటింగ్ ఎటువైపు..?
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు..
- ●Danam Nagender | ఖైరతాబాద్ మహాగణపతి ఎదుట దానం నాగేందర్ డ్యాన్స్..
- ●Stock Markets | షార్ప్ పతనం తర్వాత మార్కెట్లకు ఊరట.. సెన్సెక్స్ 173 పాయింట్లు అప్..

YouTube | యూట్యూబ్‌లో భారీ మార్పులు.. ఏఐతో వీడియో ఎడిటింగ్, లైవ్ డబ్బింగ్..

Balapur Laddu | రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ.. రూ.39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి

PB Fintech | పాలసీబజార్ షేర్లలో మళ్లీ ఊగిసలాట.. బ్రోకరేజీల రేటింగ్ ఎటువైపు..?

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు..






