త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Steel Consumer Forum | స్టీల్ వినియోగ‌దారుల ఫోర‌మ్ జాతీయ వైస్ చైర్మ‌న్‌గా సీహెచ్ శ్రీనివాస్‌..

Steel Consumer Forum | స్టీల్ వినియోగ‌దారుల ఫోర‌మ్ (Steel Consumer Forum) జాతీయ వైస్ చైర్మ‌న్‌గా తెలంగాణ‌కు చెందిన‌ సీహెచ్ శ్రీనివాస్ నియ‌మితుల‌య్యారు. జాతీయ వైస్ చైర్మ‌న్‌గా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌తోపాటు పాండిచ్చేరి బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌నున్నారు.

G

Telangana | Published On Apr 23, 2026, 10.01 am IST

Steel Consumer Forum | స్టీల్ వినియోగ‌దారుల ఫోర‌మ్ జాతీయ వైస్ చైర్మ‌న్‌గా సీహెచ్ శ్రీనివాస్‌..
Advertisement

Steel Consumer Forum | స్టీల్ వినియోగ‌దారుల ఫోర‌మ్ (Steel Consumer Forum) జాతీయ వైస్ చైర్మ‌న్‌గా తెలంగాణ‌కు చెందిన‌ సీహెచ్ శ్రీనివాస్ నియ‌మితుల‌య్యారు. జాతీయ వైస్ చైర్మ‌న్‌గా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌తోపాటు పాండిచ్చేరి బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌నున్నారు. రియ‌ల్ఎస్టేట్ రంగంలో వినియోగ‌దారుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రెరా లాంటి నియంత్ర‌ణ సంస్థ‌లు ఉన్న‌ట్లే, ఉక్కు ప‌రిశ్ర‌మ రంగంలోని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఏర్పాటైన‌ స్టీల్ వినియోగ‌దారుల ఫోర‌మ్ దేశ‌వ్యాప్తంగా ప‌నిచేస్తుంది. స్టీల్ స‌ర‌ఫ‌రా, తూకం, నాణ్య‌త వంటి అంశాల్లో వినియోగ‌దారుల నుంచి ఫిర్యాదుల‌ను విచారించ‌డంతోపాటు కేంద్ర ప్ర‌భుత్వం, స్టీల్ ప‌రిశ్ర‌మ‌కు మ‌ధ్య స‌మ‌న్వ‌క్త‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది.

కాగా, ఫోరం వైస్ చైర్మ‌న్‌గా శ్రీనివాస్‌ను నియ‌మిస్తూ ఢిల్లీలో ఫోరం జాతీయ చైర్మ‌న్ నివేదిత శ‌ర్మ ప్రేమ్ ఉత్త‌ర్వులు జారీచేశారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌.. వ్యాపారరీత్యా హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ్డారు. ప‌ర్యావ‌ర‌ణ‌హిత స్టీల్ త‌యారీని ప్రోత్స‌హించ‌డం, వినియోగ‌దారుల హ‌క్కుల‌ను పరిరక్షించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Advertisement
Advertisement