త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT Review | లేచింది మ‌హిళా లోకం రివ్యూ – సీరియ‌ల్‌కు ఎక్కువ‌…సినిమాకు త‌క్కువ‌…

లేటెస్ట్ తెలుగు మూవీ లేచింది మ‌హిళా లోకం స‌న్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కామెడీ మూవీలో మంచు ల‌క్ష్మి, అన‌న్య నాగ‌ళ్ల‌, సుప్రిత ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

N

Entertainment | Published On Apr 23, 2026, 10.40 am IST

OTT Review |   లేచింది మ‌హిళా లోకం రివ్యూ – సీరియ‌ల్‌కు ఎక్కువ‌…సినిమాకు త‌క్కువ‌…
Advertisement

OTT Review | మంచు ల‌క్ష్మి, అన‌న్య నాగ‌ళ్ల‌, సుప్రిత ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ లేచింది మ‌హిళా లోకం. సెటైరిక‌ల్ కామెడీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు అర్జున్, కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌ల స‌న్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైన ఈ తెలుగు మూవీ ఎలా ఉందంటే?

విడాకుల నుంచి మ‌ర్డ‌ర్ వ‌ర‌కు....

అర‌వింద్ (సింగ‌ర్ శ్రీరామ్‌), ప్ర‌వ‌ళ్లిక (అన‌న్య నాగ‌ళ్ల‌) భార్యాభ‌ర్త‌లు. పెళ్లై ఏడాది అవుతుంది. ఫ‌స్ట్ వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ రోజున అర‌వింద్‌ను స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని ప్ర‌వ‌ళ్లిక బోలెడు ప్లాన్స్ వేస్తుంది. అవేవి ప‌ట్టించుకోకుండా అర‌వింద్ ఆఫీస్‌కు వెళ్లిపోతాడు. ప్ర‌వ‌ళ్లిక బాధ‌లో ఉంటుంది. అదే రోజు ప్ర‌వ‌ళ్లిక‌ ఇంటికి డైవ‌ర్స్ తీసుకున్న స్నేహితురాలు రేఖ (శ్ర‌ద్ధాదాస్‌) వ‌స్తుంది. ఆమెతో పాటు ప‌నిమ‌నిషి హేమ (హ‌రితేజ‌), ప‌క్కింట్లో ఉండే మ‌హిళ ( హేమ‌) క‌లిసి అర‌వింద్‌పై ప్ర‌వ‌ళ్లిక లేనిపోని క‌ట్టుక‌థ‌లు చెప్పి ద్వేషం క‌లిగేలా చేస్తారు. అర‌వింద్ పెళ్లికి ముందే చాలా మంది అమ్మాయిల‌తో ఎఫైర్లు ఉన్నాయ‌ని న‌మ్మిస్తారు. ప్ర‌వ‌ళ్లిక చెల్లెలు (సుప్రిత‌) కూడా వారిని మాట‌లు నిజ‌మ‌ని న‌మ్ముతుంది. డైవ‌ర్స్ తీసుకోమ‌ని అక్క‌కు స‌ల‌హా ఇస్తుంది. ఓ కేసు విష‌యంలో తాను వెళ్లాల్సిన అడ్ర‌స్‌ మార‌డంతో పొర‌పాటున ప్ర‌వ‌ళ్లిక ఇంటికి వ‌స్తుంది లాయ‌ర్ పుష్ప ( మంచు ల‌క్ష్మి). ప్ర‌వ‌ళ్లిక బాధ విని విడాకుల కంటే అర‌వింద్‌ను చంప‌డ‌మే క‌రెక్ట్ అని స‌ల‌హా ఇస్తుంది. కేసు కాకుండా తాను చూసుకుంటాన‌ని స‌ల‌హా ఇస్తుంది. పుష్ప మాట‌లు న‌మ్మి భ‌ర్త‌ను ప్ర‌వ‌ళ్లిక చంపేసిందా? అంతా తాను చూసుకుంటాన‌ని చెప్పిన లాయ‌ర్ పుష్ప చివ‌రి నిమిషంలో ఎందుకు పారిపోయింది? చెప్పుడు మాట‌లు న‌మ్మి భ‌ర్త‌ను అనుమానించిన ప్ర‌వ‌ళ్లిక త‌న త‌ప్పును ఎలా తెలుసుకుంది? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

మెసేజ్ విత్ కామెడీ....

భార్యాభ‌ర్తల బంధంలో న‌మ్మ‌కం, ప్రేమ ఉండాలి. అపార్థాలు, అపోహ‌ల కార‌ణంగా చిన్న చిన్న విభేదాలు రావ‌డం స‌హ‌జం. వాటిని త‌మ‌కు తామే ప‌రిష్క‌రించుకోవాలి. మూడో వ్య‌క్తి జోక్యం చేసుకుంటే ఆ చిన్న గొడ‌వ‌లు కాపురాల‌ను కూల్చే స్థాయికి ఎలా చేరుకుంటాయ‌నే మెసేజ్‌కు కామెడీని జోడించి ద‌ర్శ‌క‌ద్వ‌యం అర్జున్, కార్తీక్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. సొసైటీలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌ను సెటైరిక‌ల్‌గా ఈ సినిమాలో చూపించారు. ఎదుటివారి జీవితాల‌పై ప‌క్కంటివాళ్ల ఉత్సుక‌త ఎలా ఉంటుంది? ఓ ఇంటి విష‌యాల‌ను మ‌రో ఇంటికి ప‌నిమ‌నుషులు ఎలా చేర‌వేస్తారు? తాము దొరికిపోగానే త‌ప్పించుకోవ‌డానికి వారు చేసే ప్ర‌య‌త్నాల‌ను ఫ‌న్నీగా ఆవిష్క‌రించారు.

ఒకే ఇంట్లో...

ఈ సినిమా క‌థ మొత్తం ఒకే ఇంట్లో.. అన‌న్య నాగ‌ళ్ల‌, హేమ‌, హ‌రితేజ‌, శ్ర‌ద్ధాదాస్‌, సుప్రిత పాత్ర‌ల చుట్టే సాగుతుంది. ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు వ‌రుస‌గా అన‌న్య నాగ‌ళ్ల ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వ‌డం, వారు చేసే హ‌డావిడి, క‌న్ఫ్యూజ‌న్ నుంచే ఫ‌న్‌ను జ‌న‌రేట్ చేశారు డైరెక్ట‌ర‌ల్ఉ. చాలా వ‌ర‌కు డైలాగ్స్‌తోనే న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. రియ‌ల్ లైఫ్‌లో ఫేమ‌స్ అయిన డైలాగ్స్‌, మీమ్స్ వాడారు. అవి బాగానే వ‌ర్క‌వుట్ అయ్యాయి.

సీరియ‌ల్‌లా...

లేచింది మ‌హిళా లోకం కోసం ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ చాలా చిన్న‌ది. రెండు లైన్స్‌లో ముగిసిపోయే క‌థ‌ను రెండు గంట‌ల్లో చెప్పాల‌ని ప్ర‌య‌త్నించ‌డంతో సినిమా మొత్తం సీరియ‌ల్‌లా సాగ‌తీశారు. రిపీటెడ్ సీన్ల‌తో ఓపిక‌కు ప‌రీక్ష పెడుతుంది. క్లైమాక్స్‌ను ఇంకాస్త థ్రిల్లింగ్‌గా రాసుకోవాల్సింది.
సిల్లీగా ఎండ్ చేసిన ఫీలింగ్ క‌లుగుతుంది.

మంచు ల‌క్ష్మి కామెడీ...

లాయ‌ర్ పుష్ప‌గా మంచు ల‌క్ష్మి పాత్ర ఉన్నంత‌లో కాస్తంత న‌వ్వించింది. ఆమె డైలాగ్స్ కొన్ని వ‌ర్క‌వుట్ అయ్యాయి. బోల్ద్ రోల్‌లో శ్ర‌ద్ధాదాస్ న‌ట‌న ఓకే. హేమ‌, హ‌రితేజ, సుప్రితల యాక్టింగ్ ఓ స్టేజ్ దాటిన త‌ర్వాత చిరాకు తెప్పించింది. అమాయ‌కురాలైన ఇల్లాలిగా అన‌న్య నాగ‌ళ్ల నాచుర‌ల్‌గా క‌నిపించింది. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, భ‌ద్రం కామెడీ అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. సింగ‌ర్ శ్రీరామ్‌ది గెస్ట్ రోల్ మాత్ర‌మే.

లేచింది మ‌హిళా లోకం సీరియ‌ల్‌కు ఎక్కువ‌...సినిమాకు త‌క్కువ‌. కాన్సెప్ట్ బాగున్నా కామెడీ మాత్రం లోపించింది.

Advertisement
Advertisement