త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trailer | ఈ న‌గ‌రానికి ఏమైంది సీక్వెల్‌లో త‌రుణ్ భాస్క‌ర్ చేసిన మార్పులు ఇవే – ట్రైల‌ర్ రిలీజ్‌

త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ న‌గ‌రానికి ఏమైంది మూవీ క‌ల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఈఎన్ఈ రిపీట్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ న‌వంబ‌ర్ 19న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమాలో విశ్వ‌క్‌సేన్‌, అభిన‌వ్ గోమ‌టం, శ్రీనాథ్ మాగంటి, వెంక‌టేష్ కాకుమాను ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

N

Entertainment | Published On Nov 3, 2026, 7.16 pm IST

Trailer | ఈ న‌గ‌రానికి ఏమైంది సీక్వెల్‌లో త‌రుణ్ భాస్క‌ర్ చేసిన మార్పులు ఇవే – ట్రైల‌ర్ రిలీజ్‌
Advertisement

Trailer | విశ్వ‌క్‌సేన్‌, అభిన‌వ్ గోమ‌టం, వెంక‌టేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న సినిమా "ఈఎన్ఈ రిపీట్" (ఈ న‌గ‌రానికి ఏమైంది రిపీట్‌). బ‌డ్డీ కామెడీగా డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్కర్ తెర‌కెక్కించిన ఈ మూవీ న‌వంబ‌ర్ 19న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. పార్ట్ వ‌న్ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ఈ సీక్వెల్ కథ మొదలైన‌ట్లు "ఈఎన్ఈ రిపీట్" ట్రైల‌ర్‌లో చూపించారు. వివేక్ త‌న ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో కలిసి ఒక వైల్డ్ సర్వైవల్ సినిమా తీయాల‌ని అనుకుంటాడు. ఈ క్ర‌మంలో వారికి ఎదురైన అడ్డంకులు, స‌ర‌దా సంఘ‌ట‌న‌ల‌తో పాటు ఆ స్నేహితుల మ‌ధ్య గొడ‌వ‌ల‌తో ట్రైల‌ర్ ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగింది. పాన్ ఇండియ‌న్ సినిమాల‌పై త‌రుణ్ భాస్క‌ర్ రాసిన పంచ్‌లు న‌వ్వించాయి. పెళ్లిచూపులు సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ చెప్పిన డైలాగ్‌తోనే ఈ ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. డైరెక్ట‌ర్‌నురా నేను డ్రైవ‌ర్‌ను కాదు అంటూ ప్ర‌స్టేష‌న్‌లో విశ్వ‌క్‌సేన్ డైలాగ్ చెప్ప‌డం ఆక‌ట్టుకుంది. స్టోరీ న‌చ్చ‌లేదా అని విశ్వ‌క్‌సేన్ అన‌గానే...నువ్వు రాసింది ఏమైనా టైటానిక్ అనుకుంటున్నావా అని అభిన‌వ్ సైట‌ర్లు వేయ‌డం ఫ‌న్నీగా ఉంది.

వివేక్‌...

వివేక్ పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ మ‌రోసారి అద‌ర‌గొట్టారు. అత‌డి ప్ర‌స్టేష‌న్‌, డైలాగ్స్ ఆక‌ట్టుకున్నాయి. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్, కౌశిక్‌గా అభినవ్ గోమఠం, ఉప్పుగా వెంకటేష్ కాకుమాను, కార్తీక్‌గా శ్రీనాథ్ మాగంటి మరోసారి కనిపించనున్నారు.కార్తీక్ క్యారెక్ట‌ర్‌ను తొలి భాగంలో సాయి సుశాంత్ న‌టించారు. సీక్వెల్‌లో మాత్రం అత‌డి పాత్ర‌ను శ్రీనాథ్‌ మాగంటి పోషించారు. శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, ప్రియ‌ద‌ర్శిని రామ్ కొత్త‌గా సీక్వెల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సీక్వెల్‌ను కామెడీ కంటే ఎమోష‌న్స్‌కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌మిస్తూ తెర‌కెక్కించిన‌ట్లు క‌నిపించింది.

ఫ్రెండ్‌షిప్ గురించి...

ఈ ట్రైల‌ర్ లాంఛ్ వేడుక‌లోడైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. "పెళ్లి చూపులు విజయం తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని చాలా ఆలోచించా. నా జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నా చుట్టూ ఎప్పుడూ నలుగురు స్నేహితులు ఉండేవారు. ఆ ఫ్రెండ్‌షిప్ గురించి సినిమా చేయాల‌ని ఈ నగరానికి ఏమైందిని తెర‌కెక్కించా. ఈ సినిమాకు సీక్వెల్ అన‌గానే ప్రేక్షకుల అంచనాల గురించే భ‌యం ఎక్కువ‌గా ఉండేది. వాటిని రీచ్ అయ్యామ‌నే న‌మ్మ‌క‌ముంది. నేను ఎక్కడికి వెళ్లినా సరే, ఈ నగరానికి ఏమైంది 2 ఎప్పుడు వస్తుందని అడుగుతుండేవారు. సినిమా ప‌ట్ల ఆడియెన్స్ అంద‌రిలో ఉన్న‌ ప్రేమను తిరిగి ఇవ్వడానికి న‌వంబ‌ర్ 19న థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాం" అని అన్నారు.

గ‌ర్వంగా చెప్పుకునే సినిమా...

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "చాలా గర్వంగా వరల్డ్ వైడ్ రిలీజ్ అని చెప్పుకునే సినిమా ఇది. తరుణ్ ప్రాణం పెట్టి సినిమా చేశారు. ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది. మీరందరూ నవ్వుతారు, ఆనందంతో ఏడుస్తారు. సినిమాలో చాలా జరుగుతాయి" అని  చెప్పారు.

విశ్వ‌క్‌సేన్ వ‌ల్లే...

శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. "ఈ నగరానికి ఏమైంది సినిమా చూసినప్పుడు ఒక నటుడిగా కచ్చితంగా ఇలాంటి సినిమాల్లో భాగం కావాలనిపించింది. ఇందులో భాగం కావడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది.కచ్చితంగా ఇది ఒక మంచి ఫన్ రైడ్. ఈ సినిమా కోసం నన్ను రిఫర్ చేసిన విశ్వక్ సేన్‌కు కృతజ్ఞతలు"  అని పేర్కొన్నారు.

ట్యాగ్స్:

Abhinav GomatamEe Nagaraniki Emaindi 2Ee Nagaraniki Emandi SequelEne Repeat TrailerShivatmika RajasekharSrinath MagantiTharun BhasckerVishwak Sen
Advertisement
Advertisement