Aditya-L1 | ఆదిత్య ఎల్-1 మరో ఘనత.. సూర్యుడి గురించి కొత్త విషయాలు వెలుగులోకి!
Aditya-L1 | భారత తొలి సౌర పరిశీలనా ఉపగ్రహం ఆదిత్య ఎల్-1 మరో కీలక ఘనత సాధించింది. సూర్యుడిపై జరిగే భారీ విస్ఫోటాలు (కరోనల్ మాస్ ఎజెక్షన్స్) అన్ని వైపులా ఒకేలా విస్తరించవని భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి ఆకృతి, ప్రయాణ వేగంలో తేడాలు ఉంటాయని తేల్చారు.
Aditya-L1 | భారత తొలి సౌర పరిశీలనా ఉపగ్రహం ఆదిత్య ఎల్-1 మరో కీలక ఘనత సాధించింది. సూర్యుడిపై జరిగే భారీ విస్ఫోటాలు (కరోనల్ మాస్ ఎజెక్షన్స్) అన్ని వైపులా ఒకేలా విస్తరించవని భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి ఆకృతి, ప్రయాణ వేగంలో తేడాలు ఉంటాయని తేల్చారు. ఈ మార్పులు భూమిపై అంతరిక్ష వాతావరణాన్ని ప్రభావితం చేయడంతోపాటు ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ వెల్లడించింది. భారత ఖగోళ భౌతిక పరిశోధన సంస్థ (ఐఐఏ) శాస్త్రవేత్తలు ఆదిత్య ఎల్-1లోని వీఈఎల్‌సీ డివైజ్ పంపిన సమాచారాన్ని నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ వివరాలతో కలిపి పరిశీలించారు. త్రిమితీయ నమూనాను రూపొందించి సూర్యుడి నుంచి వెలువడే భారీ విస్ఫోటాల ఆకృతి, కదలికలను విశ్లేషించారు.
వాటి ఆకృతి ఒకేలా లేకపోవడం వల్ల సౌర గాలులతో జరిగే పరస్పర చర్యలో మార్పులు వస్తాయని పరిశోధకుడు జయంత్ జోషి తెలిపారు. దీంతో విస్ఫోటాల ప్రయాణ వేగం మారి.. అవి భూమిని చేరుకునే సమయంపైనా ప్రభావం పడుతుందని వివరించారు. ఈ పరిశోధన వివరాలు ‘ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్’లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో రూపొందించిన విధానంతో భవిష్యత్తులో మరిన్ని సౌర విస్ఫోటాలను అధ్యయనం చేయనున్నారు. ఒకటి కంటే ఎక్కువ అంతరిక్ష టెలిస్కోపుల చిత్రాలపై మాత్రమే ఆధారపడకుండా వాటి కదలికలను అంచనా వేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా సూర్యుడి బయటి పొరల్లో వేగంగా జరిగే మార్పులను గుర్తించడంలో కీలకంగా మారనుంది. 2023 సెప్టెంబర్‌లో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 ప్రస్తుతం భూమి, సూర్యుడి మధ్య ఉన్న ఎల్-1 పాయింట్ వద్ద పనిచేస్తోంది. ఇందులో మొత్తం ఏడు పరికరాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైన వీఈఎల్‌సీ సూర్యుడి బయటి వాతావరణమైన కరోనా గురించి నిరంతరం పరిశీలనలు చేస్తోంది. సూర్యుడి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sreeleela | రజనీకాంత్ సినిమాలో శ్రీలీల - కన్ఫామ్ చేసిన కమల్ హాసన్
- ●KTR | ఇంజినీరింగ్ విద్యార్థులతో కేటీఆర్ సమావేశం
- ●Bapatla Agriculture College | బాపట్ల వ్యవసాయ కాలేజీ @ 1978 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
- ●Congress Party | కట్టు తప్పింది.. కుంపటి రగిలింది
- ●Trailer | ఈ నగరానికి ఏమైంది సీక్వెల్లో తరుణ్ భాస్కర్ చేసిన మార్పులు ఇవే - ట్రైలర్ రిలీజ్
- ●Godavarikhani Pylon Demolition | గోదావరిఖనిలో హైటెన్షన్: బీఆర్ఎస్ అభివృద్ధి పైలాన్ కూల్చివేత.. కోరుకంటి చందర్ అరెస్ట్ : కొప్పుల ఈశ్వర్ ఫైర్

Sreeleela | రజనీకాంత్ సినిమాలో శ్రీలీల - కన్ఫామ్ చేసిన కమల్ హాసన్

KTR | ఇంజినీరింగ్ విద్యార్థులతో కేటీఆర్ సమావేశం

Bapatla Agriculture College | బాపట్ల వ్యవసాయ కాలేజీ @ 1978 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

Congress Party | కట్టు తప్పింది.. కుంపటి రగిలింది






