Bapatla Agriculture College | బాపట్ల వ్యవసాయ కాలేజీ @ 1978 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
Bapatla Agriculture College | చెరగని తీపి స్మృతులు కల బోసుకుంటూ ఆటపాటలతో బాపట్ల వ్యవసాయ కళాశాల( Bapatla Agriculture College ) 1978 బ్యాచ్ పూర్వ విద్యార్ధులు ఈ రోజు హైదారబాద్ సమీపంలో లియోన్ రిసార్ట్స్‌లో ఆత్మీయ సమావేశం జరిగింది. దాదాపు 90 మందికిపైగా హాజరయ్యారు.
Bapatla Agriculture College | త్రినేత్ర న్యూస్ : చెరగని తీపి స్మృతులు కల బోసుకుంటూ ఆటపాటలతో బాపట్ల వ్యవసాయ కళాశాల( Bapatla Agriculture College ) 1978 బ్యాచ్ పూర్వ విద్యార్ధులు ఈ రోజు హైదారబాద్ సమీపంలో లియోన్ రిసార్ట్స్‌లో ఆత్మీయ సమావేశం జరిగింది. దాదాపు 90 మందికిపైగా హాజరయ్యారు. 1978 బ్యాచ్ స్వర్ణోత్సవాలు ఘనంగా బాపట్ల వ్యవసాయ కళాశాలలో నిర్వహించి, కళాశాల రుణం తీర్చుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఇప్పటినుంచే కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. అనుభవాలు కలబోసుకుంటూ, ఆకాశమే హద్దుగా, 70 ఏళ్ల వయస్సులో కూడా అందరూ
ఆటపాటలతో హోరెత్తించారు.
ఈ బ్యాచ్ నుంచి అనేక మంది పలు రంగాల్లో రాణించి జాతీయ స్థాయిలో పేరొందారు. నాబార్డ్ పూర్వ చైర్మన్ డాక్టర్ చింతల గోవింద రాజులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన డాక్టర్ జే పూర్ణ చంద్రరావు, మహారాష్ట్ర ప్రభుత్వ డీజీపీగా పనిచేసిన కనకరత్నం, కేంద్ర బొగ్గు శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన వీ పెద్దన్న, పలు బ్యాంకులలో జనరల్ మేనేజర్‌లుగా పని చేసిన ఉదయ భాస్కర రెడ్డి, జె సత్యన్నారాయణ, విశ్వనాథ్, రాంగోపాల్, వాసుదేవ మూర్తి, ప్రకాశ్‌తో పాటు ప్రైవేట్ విత్తన రంగంలో తిరుగు లేని విధంగా తనదైన ముద్ర వేస్తున్న యాగంటి వెంకటేశ్వర్లు, విజయ భాస్కర రెడ్డి, మురళీధర్, రాష్ట్ర వ్యవసాయ శాఖలో సంయుక్త సంచాలకులుగా పని చేసిన శ్రీరామమూర్తి, సుబ్బారాయుడు, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విస్తరణ సంచాలకులుగా పని చేసిన డాక్టర్ పులి రాంబాబు, ప్రధాన శాస్త్రవేత్తలుగా పనిచేసిన డాక్టర్ చిరంజీవి, డాక్టర్ మాధవి, డాక్టర్ నారాయణమ్మ తదితరులు అందరూ హాజరయ్యారు. తమ అభిప్రాయాలు పంచుకోవటంతో పాటు సలహాలు, సూచనలు కూడా చేశారు. ఈ బ్యాచ్‌కి చెందిన కెనడీ స్కూల్ అధినేత ఈశ్వర ప్రసాద్ రాసిన పుస్తకాలు ఆవిష్కరించారు. అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధులు ఉత్సాహంతో పాల్గొన్నారు. రామకృష్ణ కార్యక్రమం సంధాన కర్తగా వ్యవహరిస్తే, ఉదయ భాస్కర రెడ్డి, జె సత్యన్నారాయణ, యాగంటి వెంకటేశ్వర్లు ఆత్మీయ కలయిక సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | ఈ కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ ఎవరి కోసం, దేని కోసం?
అక్టోబర్ 29, 2026

Tirumala Vaikunta Ekadasi Darshan Slot Bookings |18 -50 ఏళ్ల వారికే తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనం.. ఐదు విడతల్లో స్లాట్లు
అక్టోబర్ 25, 2026

Jajula Srinivas Goud | 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేయకుంటే అగ్గి రాజేస్తం
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●Congress Party | కట్టు తప్పింది.. కుంపటి రగిలింది
- ●Trailer | ఈ నగరానికి ఏమైంది సీక్వెల్లో తరుణ్ భాస్కర్ చేసిన మార్పులు ఇవే - ట్రైలర్ రిలీజ్
- ●Godavarikhani Pylon Demolition | గోదావరిఖనిలో హైటెన్షన్: బీఆర్ఎస్ అభివృద్ధి పైలాన్ కూల్చివేత.. కోరుకంటి చందర్ అరెస్ట్ : కొప్పుల ఈశ్వర్ ఫైర్
- ●WGC Gold | బంగారానికి తగ్గిన గిరాకీ.. ధరల పెరుగుదలే కారణమా..?
- ●IVPA Global Round Table Meeting | గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా రండి.. తుమ్మలకు ఐవీపీఏ ప్రతినిధుల ఆహ్వానం
- ●GHMC Street Lights | జీహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్స్‌లో కుంభకోణం.. బెంచ్ మార్క్ ధరకు 4.49 శాతం అధికం

Congress Party | కట్టు తప్పింది.. కుంపటి రగిలింది

Trailer | ఈ నగరానికి ఏమైంది సీక్వెల్లో తరుణ్ భాస్కర్ చేసిన మార్పులు ఇవే - ట్రైలర్ రిలీజ్

Godavarikhani Pylon Demolition | గోదావరిఖనిలో హైటెన్షన్: బీఆర్ఎస్ అభివృద్ధి పైలాన్ కూల్చివేత.. కోరుకంటి చందర్ అరెస్ట్ : కొప్పుల ఈశ్వర్ ఫైర్

WGC Gold | బంగారానికి తగ్గిన గిరాకీ.. ధరల పెరుగుదలే కారణమా..?



