Chopper Crashes | ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు గల్లంతు
Chopper Crashes | ఉత్తరాఖండ్‌లో (Uttarakhand)ని జోషీమఠ్-బ్రదీనాథ్ మార్గంలో (Joshimath Badrinath route) హెలికాప్టర్ కూలిపోయింది (Chopper Crashes). ఈ ఘటనలో పైలట్ సహా ఆరుగురి ఆచూకీ గల్లంతైంది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ అక్కడ గాలింపు చర్యలు చేపడుతోంది. మర్వారీ వంతెన పైభాగంలో ఉన్న జేపీ పవర్ హౌస్ వైపు ఉన్న కొండ ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కూలిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
Chopper Crashes | త్రినేత్ర న్యూస్ : ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర ప్రమాదం జరిగింది. చమోలీ జిల్లాలోని (Chamoli district) జోషీమఠ్-బ్రదీనాథ్ మార్గంలో (Joshimath Badrinath route) హెలికాప్టర్ కూలిపోయింది (Chopper Crashes). ట్రాన్స్ భారత్ ఏవియేషన్ సంస్థకు (Trans Bharat Aviation) చెందిన హెలికాప్టర్ బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో అందులో ఓ పైలట్ సహా ఆరుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జోషీమఠ్ ప్రాంతంలోని మర్వారీ వంతెన పైభాగంలో ఉన్న జేపీ పవర్ హౌస్ వైపు ఉన్న కొండ ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కూలిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే, అందులోని ప్రయాణికుల ప్రస్తుత పరిస్థితి గురించి సమాచారం తెలియరాలేదు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. SDRF, ఆర్మీ, ITBP బృందాలను రంగంలోకి దించారు. హెలికాప్టర్ల సాయంతో గాలింపు చేపడుతున్నారు. అయితే, ప్రస్తుతం అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎక్స్ వేదికగా స్పందించారు. జోషీమఠ్‌లోని చాయ్ గ్రామం సమీపంలో హెలికాప్టర్ కూలిపోయినట్లు సమాచారం అందిందన్నారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాగం, విపత్తు నిర్వహణ శాఖ, ఎస్‌డీఆర్‌ఎఫ్ సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. పరిస్థితిని తాను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Also Read..
యమునా నదిలో మునకేసి గుటకేసిన బీజేపీ ఎంపీ
నా చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను : ప్రధాని మోదీ
కోకాపేటలో విషాదం.. 23వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెలల్లోనే 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు
సెప్టెంబర్ 25, 2026

Election Commission | యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
సెప్టెంబర్ 22, 2026

Surendra Koli | నిఠారీ వరుస హత్యల కేసు.. సురేందర్ కోలీ ఆత్మహత్య
సెప్టెంబర్ 18, 2026
తాజావార్తలు
- ●Nayanthara | మనసు మార్చుకున్న నయన్ - మాజీ ప్రియుడితో సినిమా...
- ●Woman Suicide | కోకాపేటలో విషాదం.. 23వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య
- ●Yamuna River | యమునా నదిలో మునకేసి గుటకేసిన బీజేపీ ఎంపీ
- ●Vedanta Oil and Gas | వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్‌కు భారీ లాభాలు.. ఆదాయంలో 7 శాతం వృద్ధి..
- ●Viral Video | పెనుగాలులు.. భారీ వర్షం.. అయినా ఆగని పూరీ జగన్నాథుడి సేవ!
- ●Amit Shah | మూడోసారి అధికారంలోకి వస్తే యూసీసీ

Nayanthara | మనసు మార్చుకున్న నయన్ - మాజీ ప్రియుడితో సినిమా...

Woman Suicide | కోకాపేటలో విషాదం.. 23వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య

Yamuna River | యమునా నదిలో మునకేసి గుటకేసిన బీజేపీ ఎంపీ

Vedanta Oil and Gas | వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్‌కు భారీ లాభాలు.. ఆదాయంలో 7 శాతం వృద్ధి..



