త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Petrol Price Hike | బిగ్ అల‌ర్ట్‌.. భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు..? లీటరుపై రూ. 28 బాదుడు.. ఎప్ప‌టి నుంచంటే..?

Petrol Price Hike | పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త్వ‌ర‌లో భారీగా పెర‌గ‌నున్న‌ట్లు (Petrol Price Hike) తెలిసింది. లీట‌రుపై రూ.25 నుంచి రూ.28 వరకూ పెరిగే అవకాశం ఉంద‌ని స‌మాచారం.

D

Business | Published On Apr 23, 2026, 11.28 am IST

Petrol Price Hike | బిగ్ అల‌ర్ట్‌.. భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు..? లీటరుపై రూ. 28 బాదుడు.. ఎప్ప‌టి నుంచంటే..?
Advertisement

Petrol Price Hike | వాహ‌న‌దారుల‌కు బిగ్ అల‌ర్ట్‌. గ‌త కొంత‌కాలంగా స్థిరంగా ఉన్న‌ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త్వ‌ర‌లో భారీగా పెర‌గ‌నున్న‌ట్లు (Petrol Price Hike) తెలిసింది. లీట‌రుపై రూ.25 నుంచి రూ.28 వరకూ పెరిగే అవకాశం ఉంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల త‌ర్వాత ధ‌ర‌లు పెంచే అవ‌కాశం ఉంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌లు ఏప్రిల్ 29తో ముగియ‌నున్నాయి. ఆ త‌ర్వాత ఏప్రిల్ నెలాఖ‌రు లేదా, మే మొద‌టి వారంలో ఆయిల్ కంపెనీలు ఇంధ‌న ధ‌ర‌లను స‌వ‌రించే అవ‌కాశం ఉంద‌ని కోటాక్ ఈక్విటీస్ అనే స్టాక్ బ్రోకరేజ్ సంస్థ నివేదిస్తోంది.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చేప‌ట్టిన దాడుల‌తో ప‌శ్చిమాసియా భ‌గ్గుమంటోంది. గ‌త నెల రోజులుగా వార్ కొన‌సాగుతోంది. ఈ ఉద్రిక్తతలు చమురు సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రపంచ ఇంధ‌న ర‌వాణాకు కీల‌కమైన హ‌ర్మూజ్ జ‌ల‌సంధిని టెహ్రాన్ మూసివేయ‌డంతో.. స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. ఫ‌లితంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ముడి చ‌మురు ధ‌ర‌లు భారీ స్థాయిలో పెరిగాయి (Global crude oil prices climbed). అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 120 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నెల‌రోజులుగా ఇదే ప‌రిస్థితి కొనసాగుతోంది. అయిన‌ప్ప‌టికీ దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (Indian Oil Refineries) పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్ని స్థిరంగానే ఉంచాయి.

రిఫైన‌రీలపై నెల‌కు 270 బిలియన్ డాల‌ర్ల భారం..

యుద్ధ మేఘాల మధ్య సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో చమురు మార్కెటింగ్ కంపెనీలపై నెలకు 270 బిలియన్ డాల‌ర్ల‌ అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పది రూపాయలు తగ్గించినప్పటికీ అది ఈ నష్టాలను భర్తీ చేయడానికి సరిపోవడం లేదు. ఇక పెరుగుతున్న రిఫైనరీ నష్టాల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెంచక తప్పదని తెలుస్తోంది.

ఒకేసారి కాకుండా..

లీట‌రుపై రూ.25 నుంచి రూ.28 వ‌ర‌కూ పెంచే అవ‌కాశం ఉంద‌ని స‌ద‌రు నివేదిక తెలిపింది. అయితే, ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పెంచితే ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులపై భారం పడుతుందనే ఆందోళన ప్రభుత్వానికి ఉంది. అందుకే రిఫైనింగ్ నష్టాలను తగ్గిస్తూనే, ప్రజలపై భారం పడకుండా ధరలను ద‌శ‌ల‌ వారీగా పెంచాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read..

లేచింది మ‌హిళా లోకం రివ్యూ - సీరియ‌ల్‌కు ఎక్కువ‌...సినిమాకు త‌క్కువ‌...

స్టీల్ వినియోగ‌దారుల ఫోర‌మ్ జాతీయ వైస్ చైర్మ‌న్‌గా సీహెచ్ శ్రీనివాస్‌..

కాళేశ్వ‌రం తెలంగాణ‌కు ప్రాణేశ్వ‌రం.. హైకోర్టు తీర్పుతో ధ‌ర్మం గెలిచింది: బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ఏ

Advertisement
Advertisement