Helicopter Accident | హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆరుగురి మృతి
Helicopter Accident | ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. బద్రీనాథ్‌ను దర్శించుకుని తిరిగి డెహ్రాడూన్ వెళ్తుండగా ట్రాన్స్ భారత్ ఏవియేషన్‌కు చెందిన ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా జోషిమఠ్ - బద్రీనాథ్ మార్గంలో జోషిమఠ్ సమీపంలోని చాయీ గ్రామం వద్ద ఈ హెలికాప్టర్ రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలట్‌తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు.
Helicopter Accident | ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. బద్రీనాథ్‌ను దర్శించుకుని తిరిగి డెహ్రాడూన్ వెళ్తుండగా ట్రాన్స్ భారత్ ఏవియేషన్‌కు చెందిన ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా జోషిమఠ్ - బద్రీనాథ్ మార్గంలో జోషిమఠ్ సమీపంలోని చాయీ గ్రామం వద్ద ఈ హెలికాప్టర్ రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలట్‌తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ఒకవైపు దట్టమైన మంచు, మరోవైపు భారీ వర్షం కురుస్తుండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో బద్రీనాథ్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన సంభవించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న రాష్ట్ర సహాయక బృందాలు, ఆర్మీ ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను చేపట్టాయి. జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖ, ఎస్డీఆర్ఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన చర్యల్లో జేపీ పవర్ హౌజ్ మార్గంలోని పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. మృతి చెందిన అయిదుగురు పర్యాటకులు కర్ణాటకకు చెందిన వారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Aditi Shankar | మణిరత్నం కల్ట్ క్లాసిక్ టైటిల్ కొట్టేసిన శంకర్ కూతురు
- ●Rafale | ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ల్యాండైన రాఫెల్
- ●Harish Rao | మియాపూర్ 550 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
- ●IND Vs NZ T20 | ఫిలిప్స్ విధ్వంసం.. నాల్గో టీ20లో భారత్‌కు భారీ ఓటమి
- ●Uttam Kumar Reddy | బియ్యం ధరల దోపిడీపై ఉక్కుపాదం
- ●Chamala Kirankumar | రైల్వే అండర్‌పాస్ కోసం రైల్వే మంత్రికి ఎంపీ చామల వినతి

Aditi Shankar | మణిరత్నం కల్ట్ క్లాసిక్ టైటిల్ కొట్టేసిన శంకర్ కూతురు

Rafale | ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ల్యాండైన రాఫెల్

Harish Rao | మియాపూర్ 550 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

IND Vs NZ T20 | ఫిలిప్స్ విధ్వంసం.. నాల్గో టీ20లో భారత్‌కు భారీ ఓటమి





