Plane Crashes | జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో కుప్పకూలిన విమానం.. ఐదుగురు మృతి
Plane Crashes | అస్సాంలో (Assam)ని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ (Jorhat Air Force Station)లో భారత వైమానిక దళానికి (IAF) చెందిన AN-32 రవాణా విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది మరణించినట్లు ఐఏఎఫ్ అధికారికంగా వెల్లడించింది.
Plane Crashes | అస్సాంలో (Assam) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి (IAF) చెందిన AN-32 రవాణా విమానం జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ (Jorhat Air Force Station)లో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కుప్పకూలిపోయింది.
ఈ ఘటనలో వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభమ్ కుమార్, సర్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్‌వాయు ఖేమారామ్ కుమావత్, అగ్నివీర్‌వాయు డానిష్ ఆలమ్ తమ విధి నిర్వహణలో వీర మరణం పొందినట్లు తెలిపింది. ఈ మేరకు తీవ్ర సంతాపం తెలిపింది. వారి కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. మరోవైపు ఈ ప్రమాదం ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
ఐఏఎఫ్‌కు వర్క్‌హార్స్ లాంటిది
ఆంటనోవ్ ఏఎన్-32 (Antonov AN-32).. దృఢమైన, ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్ సైనిక రవాణా విమానం. ఇది భారత వైమానిక దళానికి వర్క్‌హార్స్ (workhorse) లాంటిది. భారతీయ అవసరాల కోసం సోవియేట్ యూనియన్ (Soviet Union) కాలంలో ఈ విమానాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు. భారతీయ వైమానిక దళంలో సుమారు వంద వరకు ఏఎన్-32 ట్రాన్స్‌పోర్టు విమానాలు సేవలందిస్తున్నాయి.
అతి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం మెరుగైన రీతిలో పనిచేసేలా వీటిని రూపొందించారు. ఎత్తైన ప్రాంతాల్లో ఉండే విమానాశ్రయాల్లో, తీవ్రమైన ఉష్ణమండల వాతావరణాల్లోనూ సమర్థంగా పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 7.5 టన్నుల సరకును, 50 మంది ప్రయాణికులను, 42 మంది పారాట్రూపర్లను రవాణా చేయగలదు. ప్రకృతి విపత్తు సమయాల్లో మారుమూల ప్రాంతాలకు సామగ్రిని చేరవేసేందుకు ఈ విమానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు.
Also Read..
భాగ్యశ్రీ బోర్సేకు కలిసిరాని లక్ - లెనిన్ మూడోసారి వాయిదా?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gellu Srinivas Yadav | 'మన ఊరు - మన బడి' కిందనే 'ఆరుట్ల స్కూల్' అభివృద్ధి.. సీఎం రేవంత్‌కు గెల్లు శ్రీనివాస్ కౌంటర్
- ●Pizza Hut | అమ్మకానికి పిజ్జా హట్.. 2.7 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు డీల్..!
- ●Road Accident | ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురు మృతి
- ●Asus | ఆసుస్ క్రోమ్‌బుక్‌ల హంగామా.. భారత్‌లో మూడు కొత్త మోడళ్లు..
- ●Vijay Devarakonda | విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు.. టీజీ 20 లీగే కారణమా..?
- ●Sanchita Ugale | నవ్వుల వెనుక అంతులేని వేదన.. సంచిత కేసులో కీలక వివరాలు వెల్లడించిన స్నేహితురాలు

Gellu Srinivas Yadav | 'మన ఊరు - మన బడి' కిందనే 'ఆరుట్ల స్కూల్' అభివృద్ధి.. సీఎం రేవంత్‌కు గెల్లు శ్రీనివాస్ కౌంటర్

Pizza Hut | అమ్మకానికి పిజ్జా హట్.. 2.7 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు డీల్..!

Road Accident | ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురు మృతి

Asus | ఆసుస్ క్రోమ్‌బుక్‌ల హంగామా.. భారత్‌లో మూడు కొత్త మోడళ్లు..






