త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pizza Hut | అమ్మ‌కానికి పిజ్జా హ‌ట్‌.. 2.7 బిలియ‌న్ డాల‌ర్ల‌కు విక్ర‌యించేందుకు డీల్‌..!

Pizza Hut | ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్ బ్రాండ్ పిజ్జా హట్ అమ్మకానికి సిద్ధమైంది. కంపెనీ మాతృసంస్థ అయిన యమ్ బ్రాండ్స్ (Yum Brands) ఈ చైన్‌ను విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది. మొత్తం ఒప్పంద విలువ సుమారు 2.7 బిలియన్ డాలర్లుగా నిర్ణ‌యించింది. మారుతున్న వినియోగదారుల అభిరుచులు, పెరుగుతున్న పోటీ, అమ్మకాలు త‌గ్గ‌డం త‌దిత‌ర కార‌ణాల నేప‌థ్యంలో విక్ర‌యించాల‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

P

Business | Published On Jun 17, 2026, 5.10 pm IST

Pizza Hut | అమ్మ‌కానికి పిజ్జా హ‌ట్‌.. 2.7 బిలియ‌న్ డాల‌ర్ల‌కు విక్ర‌యించేందుకు డీల్‌..!
Advertisement

Pizza Hut | ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్ బ్రాండ్ పిజ్జా హట్ అమ్మకానికి సిద్ధమైంది. కంపెనీ మాతృసంస్థ అయిన యమ్ బ్రాండ్స్ (Yum Brands) ఈ చైన్‌ను విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది. మొత్తం ఒప్పంద విలువ సుమారు 2.7 బిలియన్ డాలర్లుగా నిర్ణ‌యించింది. మారుతున్న వినియోగదారుల అభిరుచులు, పెరుగుతున్న పోటీ, అమ్మకాలు త‌గ్గ‌డం త‌దిత‌ర కార‌ణాల నేప‌థ్యంలో విక్ర‌యించాల‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. గ్లోబల్ రెస్టారెంట్ ఇండ‌స్ట్రీలో అతిపెద్ద డీల్స్‌లో ఇది ఒక‌టిగా భావిస్తున్నారు.

అగ్రిమెంట్ స్ట్ర‌క్చ‌ర్ ప్ర‌కారం.. పిజ్జా హట్ వ్యాపారాన్ని రెండుభాగాలుగా విడ‌గొట్ట‌నున్నారు. చైనాలోని కార్యకలాపాలను యమ్ చైనా హోల్డింగ్స్ 1.2 బిలియన్ డాలర్లకు స్వాధీనం చేసుకోనుంది. మిగిలిన ఇంట‌ర్నేష‌న‌ల్ బిజినెస్‌ను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ లాంగ్‌రేంజ్ క్యాపిటల్ 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనుంది. అవసరమైన నియంత్రణ అనుమతులు లభిస్తే ఈ ఒప్పందం 2026 మూడో త్రైమాసికానికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. గత కొన్నేళ్లుగా పిజ్జా హట్ వ్యాపారం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వినియోగదారుల ఆహార అలవాట్లలో మార్పులు, వేగంగా పెరుగుతున్న పోటీ సంస్థ ఆదాయంపై భారీగా ప్ర‌భావం చూపింది. ద్రవ్యోల్బణం పెర‌గ‌డంతో పాటు ఆహార ధ‌ర‌లు పెర‌గ‌డం సైతం కంపెనీకి భారంగా మారింది. మరోవైపు మారుతున్న వినియోగ‌దారుల లైఫ్‌స్ట‌యిల్ కార‌ణంగా పిజ్జా తినే వారి సంఖ్య త‌గ్గిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారాల‌లో తీవ్ర పోటీ కూడా అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపింది. వరుసగా కొన్ని త్రైమాసికాల్లో అమ్మకాలు తగ్గడంతో గత ఏడాది నుంచే యమ్ బ్రాండ్స్ విక్ర‌యానికి ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తూ వ‌చ్చింది. విక్ర‌యానికి ఉన్న‌ అవకాశాలను పరిశీలించడం ప్రారంభించింది.

ఈ విక్రయం తర్వాత యమ్ బ్రాండ్స్ తన దృష్టిని కీల‌క‌మైన కేఎఫ్‌సీ, టాకో బెల్ బ్రాండ్లపై కేంద్రీకరించనుంది. లాభదాయకంగా, వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపారాల్లో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని యమ్ బ్రాండ్స్ సీఈవో తెలిపారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. కంపెనీ ఇప్పుడు స్థిరమైన వృద్ధి చూపుతున్న బ్రాండ్లను మరింత బలోపేతం చేసే వ్యూహాన్ని అనుసరిస్తోంది. పిజ్జా హట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన రెస్టారెంట్ బ్రాండ్లలో ఒకటి. 1977లో ఇది పెప్సీకో చేతికి వెళ్లింది. అనంతరం 1997లో పిజ్జా హట్, కేఎఫ్‌సీ, టాకో బెల్ కలిసి ట్రైకాన్ గ్లోబల్ రెస్టారెంట్‌గా ఏర్పడ్డాయి. 2002లో అదే సంస్థ యమ్ బ్రాండ్స్‌గా రూపాంతరం చెందింది. దశాబ్దాలుగా పిజ్జా హట్ ప్రపంచవ్యాప్తంగా పిజ్జా డైనింగ్ సంస్కృతిని విస్తరించడంలో కీలక పాత్ర పోషించింది.

Advertisement
Advertisement