త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhagyashri Borse | భాగ్య‌శ్రీ బోర్సేకు క‌లిసిరాని ల‌క్ – లెనిన్ మూడోసారి వాయిదా?

టాలీవుడ్‌లో తొలి హిట్టు కోసం ఎదురుచూస్తోన్న భాగ్య‌శ్రీ బోర్సే లెనిన్‌పై భారీగా ఆశ‌లు పెట్టుకుంది. కానీ వ‌రుస వాయిదాల‌తో ఈ మూవీ ఆమెకు నిరాశ‌నే మిగులుస్తోంది. ఇప్ప‌టికే రెండు సార్లు వాయిదా ప‌డిన లెనిన్ మూడోసారి కూడా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం అనుమాన‌మేన‌ని అంటున్నారు.

N

Entertainment | Published On Jun 13, 2026, 3.36 pm IST

Bhagyashri Borse | భాగ్య‌శ్రీ బోర్సేకు క‌లిసిరాని ల‌క్ – లెనిన్ మూడోసారి వాయిదా?
Advertisement

Bhagyashri Borse |  అక్కినేని వార‌సుడు అఖిల్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప‌దేళ్లు దాటిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క హిట్టు అందుకోలేదు. మ‌రోవైపు హీరోయిన్ భాగ్య‌శ్రీ బోర్సేది అదే ప‌రిస్థితి. తెలుగులో స్టార్ హీరోల‌తో వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. కానీ విజ‌యం మాత్రం ద‌క్క‌డం లేదు. ప్ర‌స్తుతం అఖిల్‌, భాగ్య‌శ్రీ బోర్సే క‌లిసి లెనిన్ సినిమాలో జంట‌గా న‌టిస్తోన్నారు. చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ముర‌ళీకృష్ణ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. లెనిన్ మూవీని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో క‌లిసి నాగార్జున అక్కినేని స్వ‌యంగా నిర్మిస్తోన్నాడు.

ప్ర‌మోష‌న్స్ షురూ...

లెనిన్ మూవీని జూన్ 26న థియేట‌ర్ల‌లోకి తీసుకురాబోతున్న‌ట్లు నాగార్జున ప్ర‌క‌టించారు. ప్ర‌మోష‌న్స్ కూడా మొద‌లుపెట్టారు. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల డిలే కార‌ణంగా ఈ సినిమా వాయిదాప‌డ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా పోస్ట్‌పోన్ కావ‌డం ఇది మూడో సారి. తొలుత ఫిబ్ర‌వ‌రిలో లెనిన్‌ను రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ కుద‌ర‌లేదు. ఆ త‌ర్వాత మే 1న థియేట‌ర్ల‌లోకి ఈ సినిమాను తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించారు. పెద్ది కార‌ణంగా జూన్ 26కు  అఖిల్ మూవీ పోస్ట్‌పోన్అయ్యింది. ఈ సారి రావ‌డం ప‌క్కా అని నాగార్జున చెప్ప‌డంతో లెనిన్ త‌ప్ప‌కుండా రిలీజ్ అవుతుంద‌ని ఫ్యాన్స్ భావించారు. కానీ క్వాలిటీ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాకూడ‌ద‌ని అఖిల్ ప‌ట్టుప‌ట్టి ఈ సినిమా డేట్‌ను మ‌రోసారి మార్చిన‌ట్లు స‌మాచారం. త‌మ‌న్ మ్యూజిక్ విష‌యంలో అఖిల్ అసంతృప్తిగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పోస్ట్‌పోన్‌కు సంబంధించిన‌ ప్ర‌క‌ట‌న ఒక‌టి రెండు రోజుల్లో రానుదంట‌. జూలై నెలాఖ‌రున లెనిన్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

గ్లామ‌ర్ రోల్ కాదు...

లెనిన్ మూవీపై భాగ్య‌శ్రీ బోర్సే భారీగా ఆశ‌లు పెట్టుకుంది. గ్లామ‌ర్ రోల్‌లో కాకుండా చిత్తూరు యువ‌తిగా ఛాలెంజింగ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. ఈ సినిమాతోనైనా కెరీర్‌లో ఫ‌స్ట్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకోవాల‌ని చాలా రోజులుగా ఎదురుచూస్తోంది. మూడోసారి కూడా మూవీ వాయిదాప‌డ‌టంతో భాగ్య‌శ్రీ డిస‌పాయింట్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement
Advertisement