Asus | ఆసుస్ క్రోమ్‌బుక్‌ల హంగామా.. భారత్‌లో మూడు కొత్త మోడళ్లు..
Asus | ఆసుస్ భారత మార్కెట్లో కొత్తగా క్రోమ్‌ఓఎస్ ఆధారిత మూడు ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఆసుస్ క్రోమ్‌బుక్ సీఎం32 డిటాచబుల్, క్రోమ్‌బుక్ సీఎం14, క్రోమ్‌బుక్ సీఎం15 పేరిట వచ్చిన ఈ మోడళ్లు మీడియాటెక్ కొంపానియో 540 ప్రాసెసర్‌తోపాటు గరిష్టంగా 8జీబీ ర్యామ్‌ను అందిస్తున్నాయి. ముఖ్యంగా క్రోమ్‌బుక్ సీఎం32 డిటాచబుల్ 2-ఇన్-1 డివైస్‌గా ల్యాప్‌టాప్ నుంచి ట్యాబ్లెట్‌గా మారే సౌకర్యాన్ని అందిస్తోంది.
Technology | Published On Jun 17, 2026, 5.00 pm IST
Asus | ఆసుస్ భారత మార్కెట్లో కొత్తగా క్రోమ్‌ఓఎస్ ఆధారిత మూడు ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఆసుస్ క్రోమ్‌బుక్ సీఎం32 డిటాచబుల్, క్రోమ్‌బుక్ సీఎం14, క్రోమ్‌బుక్ సీఎం15 పేరిట వచ్చిన ఈ మోడళ్లు మీడియాటెక్ కొంపానియో 540 ప్రాసెసర్‌తోపాటు గరిష్టంగా 8జీబీ ర్యామ్‌ను అందిస్తున్నాయి. ముఖ్యంగా క్రోమ్‌బుక్ సీఎం32 డిటాచబుల్ 2-ఇన్-1 డివైస్‌గా ల్యాప్‌టాప్ నుంచి ట్యాబ్లెట్‌గా మారే సౌకర్యాన్ని అందిస్తోంది. భారత్‌లో ఆసుస్ క్రోమ్‌బుక్ సీఎం32 డిటాచబుల్ (సీఎం3206) ప్రారంభ ధరను రూ.37,990గా నిర్ణయించారు. క్రోమ్‌బుక్ సీఎం14 (సీఎం1405) ధర రూ.26,990 నుంచి ప్రారంభమవుతుంది. క్రోమ్‌బుక్ సీఎం15 (సీఎం1505) ధర రూ.28,990 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మూడు మోడళ్లు జూన్ 19 నుంచి ఆసుస్ ఈ-షాప్, అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం క్రోమ్‌బుక్ సీఎం32 డిటాచబుల్ ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది.
పవర్‌ఫుల్ డిస్‌ప్లే, ప్రాసెసర్..
కొత్త క్రోమ్‌బుక్‌లను కొనుగోలు చేసే వినియోగదారులకు గూగుల్ ఏఐ ప్రో ప్రయోజనాలతోపాటు మూడు నెలల పాటు 5టీబీ క్లౌడ్ స్టోరేజ్‌ను ఆసుస్ ఉచితంగా అందిస్తోంది. క్రోమ్‌బుక్ సీఎం32 డిటాచబుల్‌లో 12.1 ఇంచుల 2.5కె టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. 16:10 యాస్పెక్ట్ రేషియో కలిగిన ఈ స్క్రీన్ గరిష్టంగా 600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. డీసీఐ-పీ3 కలర్ గామట్‌లో 98 శాతం కవరేజ్‌ను అందించే ఈ డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కల్పించారు. స్టైలస్ సపోర్ట్‌తోపాటు 87 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది. ఈ డివైస్‌లో మీడియాటెక్ కొంపానియో 540 ప్రాసెసర్, ఏఆర్ఎమ్ మాలి-జీ57 ఎంసీ2 గ్రాఫిక్స్, గరిష్టంగా 8జీబీ ర్యామ్, 128జీబీ ఈఎంఎంసీ స్టోరేజ్‌ను అందించారు. మిల్-ఎస్‌టీడీ-810హెచ్ మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌తో ఇది మరింత దృఢంగా ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, మైక్రోఫోన్ సపోర్ట్‌ను కలిగి ఉంది. డిటాచబుల్ కీబోర్డ్‌లో 1.35 మిల్లీమీటర్ల కీ ట్రావెల్‌తోపాటు ఇంటిగ్రేటెడ్ టచ్‌ప్యాడ్‌ను అందించారు.
భారీ బ్యాటరీ..
క్రోమ్‌బుక్ సీఎం32 డిటాచబుల్‌లో 42వాట్-అవర్ టూ సెల్ లిథియం-పాలిమర్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 12 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందుతుందని కంపెనీ పేర్కొంది. దీంతోపాటు 45వాట్ పవర్ అడాప్టర్‌ను అందిస్తున్నారు. క్రోమ్‌బుక్ సీఎం14, సీఎం15 మోడళ్లు కూడా క్రోమ్‌ఓఎస్‌తో పనిచేస్తాయి. మిల్-ఎస్‌టీడీ-810హెచ్ డ్యూరబిలిటీతోపాటు 180 డిగ్రీల లే-ఫ్లాట్ హింజ్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఈ రెండు మోడళ్లలో కూడా మీడియాటెక్ కొంపానియో 540 ప్రాసెసర్, ఏఆర్ఎమ్ మాలి-జీ57 ఎంసీ2 గ్రాఫిక్స్, గరిష్టంగా 8జీబీ ర్యామ్, 256జీబీ ఈఎంఎంసీ స్టోరేజ్‌ను అందించారు.
టచ్, నాన్ టచ్ వేరియెంట్లలో..
క్రోమ్‌బుక్ సీఎం15లో 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ నాన్-టచ్ డిస్‌ప్లే ఉంది. ఇది 16:9 యాస్పెక్ట్ రేషియోతోపాటు 300 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. మరోవైపు క్రోమ్‌బుక్ సీఎం14లో 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఇది టచ్‌స్క్రీన్, నాన్-టచ్‌స్క్రీన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ డిస్‌ప్లే కూడా 16:9 యాస్పెక్ట్ రేషియో, 300 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే క్రోమ్‌బుక్ సీఎం15లో గరిష్టంగా 63వాట్-అవర్ బ్యాటరీ ఉండగా, క్రోమ్‌బుక్ సీఎం14లో గరిష్టంగా 50వాట్-అవర్ బ్యాటరీని అందించారు. దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులకు ఇవి మంచి ఎంపికలుగా నిలుస్తున్నాయి.
సంబంధిత వార్తలు

ASUS ExpertBook | వ్యాపారులు, ప్రొఫెషనల్స్ కోసం అసుస్ అల్ట్రా సిరీస్ ల్యాప్ టాప్‌లు.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..
ఏప్రిల్ 24, 2026

Asus | ప్రీమియం ల్యాప్ టాప్‌లు ఆకర్షణీయమైన ధరల్లో.. కొత్త మోడల్స్‌ను లాంచ్ చేసిన అసుస్..
ఏప్రిల్ 15, 2026

Asus PCs | అసుస్ నుంచి చవక ధరలకే డెస్క్ టాప్, ఆలిన్ వన్ పీసీలు
మార్చి 7, 2026
తాజావార్తలు
- ●EHS | ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్ట్ బోర్డుకు సభ్యులు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు..
- ●MLC Dasoju Sravan | రేవంత్ సీఎం అయ్యాక మెట్రో ప్రాజెక్టు విధ్వంసం : ఎమ్మెల్సీ దాసోజు
- ●Pavel Durov Reliance | భారత్‌లో టెలిగ్రామ్ బ్యాన్పై రిలయన్స్, వాట్సప్ కుట్ర! సీఈఓ సంచలన ఆరోపణలు.. అసలు నిజమేంటి?
- ●TG Weather | తెలంగాణలో నాలుగురోజులు వడగాలులు, వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..
- ●Ponguleti Srinivasa Reddy | రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు.. గుడిసెల వాసులకే తొలి ప్రాధాన్యత : మంత్రి పొంగులేటి
- ●Donald Trump Iran Deal | మళ్లీ బాంబులు వేస్తాం.. ఇరాన్‌తో డీల్ ఇంకా ఫైనల్ కాలేదు: జీ7 సమ్మిట్‌లో డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

EHS | ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్ట్ బోర్డుకు సభ్యులు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు..

MLC Dasoju Sravan | రేవంత్ సీఎం అయ్యాక మెట్రో ప్రాజెక్టు విధ్వంసం : ఎమ్మెల్సీ దాసోజు

Pavel Durov Reliance | భారత్‌లో టెలిగ్రామ్ బ్యాన్పై రిలయన్స్, వాట్సప్ కుట్ర! సీఈఓ సంచలన ఆరోపణలు.. అసలు నిజమేంటి?

TG Weather | తెలంగాణలో నాలుగురోజులు వడగాలులు, వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..



