PM Modi | మెలోనీకి ప్రత్యేక కానుకలు ఇచ్చిన ప్రధాని మోదీ.. అవేంటంటే..?
PM Modi | ఇటలీ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తన ఫ్రెండ్ జార్జియా మెలోనీ (Giorgia Meloni)కి ప్రత్యేక కానుకలు అందజేశారు.
PM Modi | ఇటలీ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తన ఫ్రెండ్ జార్జియా మెలోనీ (Giorgia Meloni)కి ప్రత్యేక కానుకలు అందజేశారు. అస్సాం (Assam)లో గోల్డెన్ సిల్క్ (Golden Silk)గా పేరున్న ముగా సిల్క్ స్టోల్ (Muga Silk Stole) (దుపట్టా), మణిపూర్‌కు చెందిన శిరుయ్ లిల్లీ సిల్క్ స్టోల్ (Shirui Lily silk stole)ను బహుమతిగా అందించారు. ఈ బహుమతుల ద్వారా భారతదేశ హస్తకళల వైభవాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రాంతీయ సంప్రదాయాలను ప్రధాని ప్రపంచానికి చాటిచెప్పారు. మెలోనీతోపాటూ ఇటలీ (Italy) అధ్యక్షుడికి పండిట్ భీమ్‌సేన్ జోషి, ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటల సీడీలు కలిగిన మార్బుల్ ఇన్‌లే వర్క్ బాక్స్‌ను బహుమతిగా ఇచ్చారు.
యూఏఈ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్ దేశాధినేతలకు కూడా మన సంస్కృతి, వారసత్వం ఉట్టిపడేలా పలు ప్రత్యేక కానుకలను అందజేశారు. ఇక ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ చాక్లెట్లను కూడా గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే. తమ స్నేహానికి గుర్తుగా మెలోనీకి మోదీ పార్లె మెలోడీ (Melody) చాక్లెట్లను బహుమతిగి ఇచ్చారు. ఈ గిఫ్ట్ చూసి ఇటలీ ప్రధాని ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రధానులు చేసిన ఓ రీల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇక ఐదు దేశాల పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ నేడు భారత్‌కు చేరుకున్నారు.
PM Modi also gifted a Shirui Lily silk stole for Italy PM Giorgia Meloni.
The Shirui Lily silk stole draws its inspiration from the misty heights of Shirui Kashong Peak in Manipur, India. It is inspired by the rare Shirui Lily, a delicate bell-shaped flower with pale… pic.twitter.com/RdRNDzY3f2
— ANI (@ANI) May 21, 2026
Also Read..
మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Maheshkumar Goud | ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మిత్రపక్షాలతో మాట్లాడతాం: మహేశ్‌కుమార్ గౌడ్
- ●Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్‌రెడ్డి
- ●Ranabaali Vs Jailer 2 | రణబాలి వర్సెస్ జైలర్ 2 - రజనీకాంత్, విజయ్ దేవరకొండ మధ్య గట్టిపోటీ - ఎక్కువ కలెక్షన్స్ దేనికంటే?
- ●DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్
- ●Bathukamma Song in Dubai | ‘ఎడారిలో తంగేడు వనమే మొలిసేనో’.. దుబాయ్‌లో ‘మిట్టపల్లి’ బతుకమ్మ పాట ఆవిష్కరణ
- ●Land Survey | మూడు దశల్లో సమగ్ర భూసర్వే.. ఆధార్ తరహాలో భూదార్ కార్డులు

Maheshkumar Goud | ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మిత్రపక్షాలతో మాట్లాడతాం: మహేశ్‌కుమార్ గౌడ్

Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్‌రెడ్డి

Ranabaali Vs Jailer 2 | రణబాలి వర్సెస్ జైలర్ 2 - రజనీకాంత్, విజయ్ దేవరకొండ మధ్య గట్టిపోటీ - ఎక్కువ కలెక్షన్స్ దేనికంటే?

DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్






