Plane Crashes | అస్సాంలో కుప్పకూలిన ఐఏఎఫ్ జెట్.. పైలట్ మృతి..!
Plane Crashes | అస్సాంలో (Assam) ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి (IAF) చెందిన AN-32 రవాణా విమానం జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ (Jorhat Air Force Station)లో ప్రమాదానికి గురైంది.
Plane Crashes | అస్సాంలో (Assam) ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి (IAF) చెందిన AN-32 రవాణా విమానం జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ (Jorhat Air Force Station)లో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కుప్పకూలిపోయింది. జెట్ కూలినట్లు ఐఏఎఫ్ కూడా ధృవీకరించింది. అయితే, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను మాత్రం వెల్లడించలేదు. అలాగే ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా లేదా ప్రాణనష్టం జరిగిందా అనే వివరాలపై కూడా స్పష్టత లేదు. ఈ ప్రమాదంలో పైలట్ మరణించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఐఏఎఫ్‌కు వర్క్‌హార్స్ లాంటిది
ఆంటనోవ్ ఏఎన్-32 (Antonov AN-32).. దృఢమైన, ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్ సైనిక రవాణా విమానం. ఇది భారత వైమానిక దళానికి వర్క్‌హార్స్ (workhorse) లాంటిది. భారతీయ అవసరాల కోసం సోవియేట్ యూనియన్ (Soviet Union) కాలంలో ఈ విమానాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు. భారతీయ వైమానిక దళంలో సుమారు వంద వరకు ఏఎన్-32 ట్రాన్స్‌పోర్టు విమానాలు సేవలందిస్తున్నాయి.
అతి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం మెరుగైన రీతిలో పనిచేసేలా వీటిని రూపొందించారు. ఎత్తైన ప్రాంతాల్లో ఉండే విమానాశ్రయాల్లో, తీవ్రమైన ఉష్ణమండల వాతావరణాల్లోనూ సమర్థంగా పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 7.5 టన్నుల సరకును, 50 మంది ప్రయాణికులను, 42 మంది పారాట్రూపర్లను రవాణా చేయగలదు. ప్రకృతి విపత్తు సమయాల్లో మారుమూల ప్రాంతాలకు సామగ్రిని చేరవేసేందుకు ఈ విమానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు.
Also Read..
మహిళా పైలట్‌కు వేధింపులు.. జిమ్ మేనేజర్‌పై కేసు..
గడువు దాటిందని ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను తిరస్కరిస్తే కుదరదు
బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. ఇదే సరైన సమయమా..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Muslim Marriages | ముస్లిం వివాహాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. కొత్త చట్టానికి అస్సాం కేబినెట్ ఆమోదం
సెప్టెంబర్ 25, 2026

BJP | ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రూ.529 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ.. బెంగాల్లోనే అత్యధికం
సెప్టెంబర్ 24, 2026

HIV Cases | అస్సాం జైళ్లలో హెచ్ఐవీ కలకలం.. 4 నెలల్లో 200 మందికి పాజిటివ్
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం
- ●ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
- ●Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్
- ●V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్
- ●Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ
- ●AISF | ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్

TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం

ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్

Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్

V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్



