త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gellu Srinivas Yadav | ‘మ‌న ఊరు – మ‌న బ‌డి’ కింద‌నే ‘ఆరుట్ల స్కూల్’ అభివృద్ధి.. సీఎం రేవంత్‌కు గెల్లు శ్రీనివాస్ కౌంట‌ర్

Gellu Srinivas Yadav | కేసీఆర్ ప్ర‌భుత్వ హ‌యాంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన మ‌న ఊరు - మ‌న బడి ప‌థ‌కం కింద‌నే ఆరుట్ల స్కూల్ అభివృద్ధి జ‌రిగింద‌ని బీఆర్ఎస్వీ అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Jun 17, 2026, 5.12 pm IST

Gellu Srinivas Yadav | ‘మ‌న ఊరు – మ‌న బ‌డి’ కింద‌నే ‘ఆరుట్ల స్కూల్’ అభివృద్ధి.. సీఎం రేవంత్‌కు గెల్లు శ్రీనివాస్ కౌంట‌ర్
Advertisement

Gellu Srinivas Yadav | త్రినేత్ర‌.న్యూస్ : కేసీఆర్ ప్ర‌భుత్వ హ‌యాంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన మ‌న ఊరు - మ‌న బడి ప‌థ‌కం కింద‌నే ఆరుట్ల స్కూల్ అభివృద్ధి జ‌రిగింద‌ని బీఆర్ఎస్వీ అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. ఒక వేళ సీఎం రేవంత్ రెడ్డినే ఆరుట్ల స్కూల్‌ను అభివృద్ధి చేసి ఉంటే.. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌ను ఆ మాదిరి అభివృద్ది చేస్తామ‌ని ఎందుకు చెప్ప‌లేద‌ని గెల్లు శ్రీనివాస్ నిల‌దీశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో తుంగ బాలుతో క‌లిసి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు.

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశాలు లేవ‌ని సీఎం అంటున్నారు. ప్ర‌యివేటు స్కూల్స్‌ను ప్రోత్స‌హించేందుకే సీఎం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను నిర్వీర్యం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో గురుకులాల్లో అడ్మిషన్లకు భారీ డిమాండ్ ఉండేది. ఇప్పుడు గురుకులాల‌కు పిల్ల‌ల‌ను పంపాలంటేనే త‌ల్లిదండ్రులు భ‌య‌ప‌డుతున్నారని గెల్లు మండిప‌డ్డారు.

విద్యా శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్

ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో విచ్చ‌ల‌విడిగా ఫీజులు వ‌సూలు చేస్తున్నారు. ఫీజుల నియంత్ర‌ణ చ‌ట్టం తెస్తాన‌ని చెప్పిన సీఎం రేవంత్.. ఇప్ప‌టికీ ఆ విష‌యంపై దృష్టి సారించ‌లేదు. విద్యా శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. పేద విద్యార్థుల‌పై సీఎం త‌న ప్ర‌తాపం చూపిస్తున్నారు. త‌క్ష‌ణ‌మే ఫీజుల నియంత్ర‌ణ చ‌ట్టం చేయాల‌ని సీఎంను డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 20న అన్ని మండ‌లాల ఎంఈవోల‌కు విన‌తిప‌త్రం ఇస్తాం. 22న అన్ని జిల్లా క‌లెక్ట‌రేట్ల‌లో ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేస్తామ‌ని గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ తెలిపారు.

Advertisement
Advertisement