Rajya Sabha Elections | మోగిన ఎన్నికల నగారా.. 24 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
Rajya Sabha Elections | దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాల (Rajya Sabha seats) భర్తీకి ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Rajya Sabha Elections | దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాల (Rajya Sabha seats) భర్తీకి ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి జూన్ 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది. జూన్ 9న నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణ జూన్ 11 వరకు గడువు ఇచ్చింది.
జూన్ 18న ఎన్నికలు (Rajya Sabha Elections) నిర్వహించనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. జూన్ 20 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగేసి స్థానాల్లో, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మూడేసి స్థానాలు, జార్ఖండ్‌లో రెండు స్థానాలకు, మణిపూర్, మేఘాలయా, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక్కోస్థానానికి.. మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Also Read..
బెంగాల్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం
సంబంధిత వార్తలు

Mallikarjun Kharge | ఆ ఘటన చాలా అవమానంగా అనిపించింది.. హల్ద్వానీలో వేదిక శుద్ధిపై ఖర్గే భావోద్వేగం
ఆగస్టు 13, 2026

Polymer Notes | రూ.10, రూ.20 పాలిమర్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
ఆగస్టు 11, 2026

Vaddiraju Ravichandra | ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు సంస్కరణలు ఓకే.. కానీ సరిగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుంది
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం
- ●Khajaguda U Turn | ఖాజాగూడ రూట్లో వెళ్తున్నారా? ట్రాఫిక్ రూల్స్‌లో కీలక మార్పులు.. జాయింట్ సీపీ ఆకస్మిక తనిఖీలు
- ●Telangana CEO Sudharsan Reddy | SIR డ్రాఫ్ట్ రిలీజ్ చేయగానే అన్ని రాజకీయ పార్టీలను మీటింగ్‌కు పిలిచిన ఈసీ.. ఎందుకంటే?
- ●Ponguleti Srinivas Reddy | హక్కుదారులకు హామీ ఇస్తున్నా.. 22ఎ వల్ల గజం భూమిని కూడా పోనివ్వం
- ●Telangana employees JAC | తెలంగాణ సర్కార్‌పై పోరుకు సిద్ధమవుతున్న ఉద్యోగులు.. పీఆర్సీ, డీఏల సాధన కోసం రేపే కీలక భేటీ
- ●Kalyana Lakshmi Scheme Stopped | 50 లక్షల లాయర్ నీకు ఓకే.. ఆడబిడ్డలకు వద్దా? సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం

Khajaguda U Turn | ఖాజాగూడ రూట్లో వెళ్తున్నారా? ట్రాఫిక్ రూల్స్‌లో కీలక మార్పులు.. జాయింట్ సీపీ ఆకస్మిక తనిఖీలు

Telangana CEO Sudharsan Reddy | SIR డ్రాఫ్ట్ రిలీజ్ చేయగానే అన్ని రాజకీయ పార్టీలను మీటింగ్‌కు పిలిచిన ఈసీ.. ఎందుకంటే?

Ponguleti Srinivas Reddy | హక్కుదారులకు హామీ ఇస్తున్నా.. 22ఎ వల్ల గజం భూమిని కూడా పోనివ్వం



