త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khajaguda U Turn | ఖాజాగూడ రూట్లో వెళ్తున్నారా? ట్రాఫిక్ రూల్స్‌లో కీలక మార్పులు.. జాయింట్ సీపీ ఆకస్మిక తనిఖీలు

సైబరాబాద్ పరిధిలోని ఖాజాగూడ, మల్కంచెరువు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు కీలక మార్పులు చేశారు. పాత యూ-టర్న్స్ మూసివేత, కొత్త రూట్లపై పూర్తి వివరాలు

J

Hyderabad | Published On Aug 17, 2026, 8.09 pm IST

Khajaguda U Turn | ఖాజాగూడ రూట్లో వెళ్తున్నారా? ట్రాఫిక్ రూల్స్‌లో కీలక మార్పులు.. జాయింట్ సీపీ ఆకస్మిక తనిఖీలు
Advertisement
  • సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సున్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ఖాజాగూడ, మల్కంచెరువు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు
  • ఖాజాగూడ డీపీఎస్ (DPS) వద్ద పాత యూ-టర్న్ మూసివేసి, 70 మీటర్ల ముందు కొత్త యూ-టర్న్ ఏర్పాటుకు అధికారులకు ఆదేశాలు
  • వాహనదారుల గందరగోళానికి కారణమవుతున్న మల్కంచెరువు హైటెన్షన్ రోడ్డులోని రెండు యూ-టర్న్‌ల మూసివేత
  • రాంగ్ రూట్ డ్రైవింగ్, రోడ్డు ప్రమాదాలకు చెక్ పెడుతూ.. ట్రాఫిక్ క్రమబద్ధీకరణే లక్ష్యంగా ఈ మార్పులు

Khajaguda U Turn | త్రినేత్ర.న్యూస్ : సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనదారులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (JCP) సున్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్.. రద్దీగా ఉండే ఖాజాగూడ, మల్కంచెరువు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ సమస్యలను పరిశీలించిన ఆయన, వాహనదారుల భద్రత కోసం అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Cyberabad Traffic Update New U-Turns and Changes in Khajaguda

ఖాజాగూడ DPS వద్ద కొత్త యూ-టర్న్

ఖాజాగూడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS) వద్ద నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు జాయింట్ సీపీ సరికొత్త ప్లాన్ చేశారు. అక్కడ ప్రస్తుతం ఉన్న పాత యూ-టర్న్‌ను (U-Turn) శాశ్వతంగా మూసివేసి.. దానికి సుమారు 70 మీటర్ల ముందు ఒక కొత్త యూ-టర్న్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

Cyberabad Traffic Update New U-Turns and Changes in Khajaguda

దీనివల్ల చాలా మంది వాహనదారులు రాంగ్ రూట్‌లో (Wrong Route) ప్రయాణించడాన్ని పూర్తిగా అడ్డుకోవచ్చని, తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న స్థానికులతో జాయింట్ సీపీ స్వయంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ మార్పులను తక్షణమే అమలు చేయాలని ADCP ట్రాఫిక్ (శేరిలింగంపల్లి), ACP మాదాపూర్ ట్రాఫిక్, SHO రాయదుర్గం అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

మల్కంచెరువు వద్ద ఆ రెండు యూ-టర్న్‌లు బంద్

అనంతరం మల్కంచెరువు వెనుక వైపు ఉన్న హైటెన్షన్ రోడ్డును జాయింట్ సీపీ సున్‌ప్రీత్ సింగ్ కాలినడకన పరిశీలించారు. అక్కడ చాలా తక్కువ దూరంలోనే రెండు యూ-టర్న్‌లు ఉండటంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర గందరగోళం ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన గుర్తించారు.

Cyberabad Traffic Update New U-Turns and Changes in Khajaguda

ఈ సమస్యను పరిష్కరించేందుకు, అతి తక్కువ దూరంలో ఉన్న ఆ రెండు యూ-టర్న్‌లను వెంటనే మూసివేయాలని స్థానిక ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో సైబరాబాద్ కమ్యూనిటీకి మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను అందించేందుకు, ఎక్కడా ట్రాఫిక్ జామ్స్ (Traffic Jams) లేకుండా వాహనాలు సాఫీగా వెళ్లేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు వెంటనే చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement