త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Polymer Notes | రూ.10, రూ.20 పాలిమర్‌ నోట్ల ట్ర‌య‌ల్స్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

Polymer Notes | రూ.10, రూ.20 విలువైన పాలిమర్‌ (ప్లాస్టిక్‌) నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రెండు డినామినేషన్లలో రూ.100 కోట్ల చొప్పున.. మొత్తం రూ.200 కోట్ల పాలిమర్‌ నోట్లను క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు రిజర్వ్‌ బ్యాంకు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

P

National | Published On Aug 11, 2026, 4.46 pm IST

Polymer Notes | రూ.10, రూ.20 పాలిమర్‌ నోట్ల ట్ర‌య‌ల్స్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌
Advertisement

Polymer Notes | రూ.10, రూ.20 విలువైన పాలిమర్‌ (ప్లాస్టిక్‌) నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రెండు డినామినేషన్లలో రూ.100 కోట్ల చొప్పున.. మొత్తం రూ.200 కోట్ల పాలిమర్‌ నోట్లను క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు రిజర్వ్‌ బ్యాంకు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఆర్‌బీఐ చట్టం-1934లోని సెక్షన్‌ 25 ప్రకారం ఆర్‌బీఐ కేంద్ర బోర్డు ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపింది. పాలిమర్‌ నోట్లను ప్రవేశపెట్టినప్పటికీ.. పేప‌ర్ నోట్ల స్థానంలో కాకుండా వాటితోపాటే చలామణిలోకి తీసుకురానున్నారు. క్షేత్రస్థాయి పరీక్షలు విజయవంతమైతే ఈ రెండు డినామినేషన్లలో పాలిమర్‌ నోట్లను క్రమబద్ధంగా జారీ చేసే అవకాశం ఉంటుంది. పాలిమర్‌ నోట్ల కొనుగోలు ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని ఆర్‌బీఐ తెలిపింది. దీంతో అవి ఎప్పటి నుంచి చలామణిలోకి వస్తాయన్నది, ఈ ప్రాజెక్టుకు ఎంత వ్యయం అవుతుందన్నది ఇప్పుడే చెప్పలేమని కేంద్రం స్పష్టం చేసింది. అంటే ఆమోదం లభించినంత మాత్రాన వెంటనే మార్కెట్‌లో పాలిమర్‌ నోట్లు అందుబాటులోకి రావన్నమాట.

తగ్గిన ద్రవ్యోల్బణం

దేశంలో సగటు రిటైల్‌ ద్రవ్యోల్బణం 2023–24లో 5.4 శాతం నుంచి 2024–25లో 4.6 శాతానికి, 2025–26లో 2.1 శాతానికి తగ్గిందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే 2026–27 తొలి త్రైమాసికంలో 3.9 శాతానికి పెరిగిందన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వస్తు, ఇంధన ధరల పెరుగుదల, కాలానుగుణంగా కూరగాయల ధరలు పెరగడం, ఎల్‌నినో పరిస్థితుల అవకాశాలు ఇందుకు కారణాలని వివరించారు. అయినప్పటికీ ఆర్‌బీఐ లక్ష్యమైన 4 శాతం కంటే ద్రవ్యోల్బణం దిగువనే ఉందన్నారు. వినియోగ డిమాండ్‌కు ఊతమిచ్చేందుకు పన్ను సంస్కరణలు చేపట్టినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. 56వ జీఎస్టీ మండలి సమావేశంలో రెండు ప్రధాన పన్ను రేట్ల విధానాన్ని తీసుకొచ్చామని, ప్రామాణిక రేటు 18 శాతం, మెరిట్‌ రేటు 5 శాతంగా నిర్ణయించామని చెప్పారు. ఎంపిక చేసిన కొన్ని వస్తువులు, సేవలకు 40 శాతం ప్రత్యేక డీమెరిట్‌ రేటు ఉంటుందన్నారు. పలు వస్తువులను 28 శాతం శ్లాబ్‌ నుంచి 18 శాతానికి, మరికొన్నింటిని 18 నుంచి 12 లేదా 5 శాతానికి తగ్గించినట్లు వివరించారు. ఇదే సమయంలో వివిధ ఉత్పత్తులపై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాన్ని కూడా ఫిబ్రవరి 2, 2026 నుంచి హేతుబద్ధీకరించినట్లు తెలిపారు. ఇన్‌పుట్‌ వ్యయాలు తగ్గించడం, దేశీయ తయారీని ప్రోత్సహించడం, ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచడం దీని ఉద్దేశమని పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement