Cabinet Expands | బెంగాల్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం
Cabinet Expands | పశ్చిమ బెంగాల్ (West Bengal)లో ముఖ్యమంత్రి సువేందు అధికారి (Suvendu Adhikari) నేతృత్వంలోని ప్రభుత్వం భారీగా మంత్రివర్గాన్ని విస్తరించింది (Cabinet Expands). కొత్తగా 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా (35 BJP MLAs Take Oath As Ministers) ప్రమాణ స్వీకారం చేశారు.
Cabinet Expands | పశ్చిమ బెంగాల్ (West Bengal)లో ముఖ్యమంత్రి సువేందు అధికారి (Suvendu Adhikari) నేతృత్వంలోని ప్రభుత్వం భారీగా మంత్రివర్గాన్ని విస్తరించింది (Cabinet Expands). కొత్తగా 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా (35 BJP MLAs Take Oath As Ministers) ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు.
294 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 208 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలుకుతూ.. కమలం పార్టీ బెంగాల్‌లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మే 9న బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సువేందుతోపాటూ బీజేపీ ఎమ్మెల్యేలు దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, నిసిత్ ప్రామాణిక్, అశోక్ కీర్తనియా, క్షుదిరామ్ తుడు సహా పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇప్పుడు కొత్తగా 35 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడంతో బెంగాల్ కేబినెట్ బలం 41కి చేరింది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో స్వపన్ దాస్‌గుప్తా, దూధ్ కుమార్ మండల్, దీపక్ బర్మన్, మనోజ్ ఓరాన్, గౌరీ శంకర్ ఘోష్, అర్జున్ సింగ్, తపస్ రాయ్, శరద్వత్ ముఖర్జీ, జగన్నాథ్ ఛటోపాధ్యాయ, శంకర్ ఘోష్, రాజేష్ మహతో, ఇంద్రనీల్ ఖాన్, మాలతీ రవా రాయ్ తదితరులు ఉన్నారు.
Also Read..
కేంద్ర విద్యాశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !
- ●CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!
- ●CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్
- ●CM Revanth Reddy | ప్రజాపాలనలో వైద్యానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం
- ●Khajaguda U Turn | ఖాజాగూడ రూట్లో వెళ్తున్నారా? ట్రాఫిక్ రూల్స్‌లో కీలక మార్పులు.. జాయింట్ సీపీ ఆకస్మిక తనిఖీలు

22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !

CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!

CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్

CM Revanth Reddy | ప్రజాపాలనలో వైద్యానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్‌రెడ్డి






