త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BUS and Lorry Accident | కొండ‌గ‌ట్టు స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. లారీని ఢీకొట్టిన బ‌స్సు.. ఐదుగురి ప‌రిస్థితి విష‌మం

BUS and Lorry Accident | కొండ‌గ‌ట్టు స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. జగిత్యాల-కరీంనగర్‌ జాతీయ రహదారిపై బల్వంతపూర్‌ అడ్డ రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికుల‌కు గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.

S

Telangana | Published On Aug 17, 2026, 8.13 pm IST

BUS and Lorry Accident | కొండ‌గ‌ట్టు స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. లారీని ఢీకొట్టిన బ‌స్సు.. ఐదుగురి ప‌రిస్థితి విష‌మం
Advertisement
  • 20 మందికి పైగా గాయాలు
  • బాధితుల్లో ఐదుగురు చిన్నారులు స‌హా ప‌లువురు మ‌హిళ‌లు

త్రినేత్ర‌.న్యూస్‌: కొండ‌గ‌ట్టు స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. జగిత్యాల-కరీంనగర్‌ జాతీయ రహదారిపై బల్వంతపూర్‌ అడ్డ రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికుల‌కు గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్ర‌మాదంతో లారీ డ్రైవ‌ర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా ఆయ‌న‌తో పాటు గాయ‌ప‌డిన ప్ర‌యాణికుల‌ను జ‌గిత్యాల ఆస్ప‌త్రికి త‌రలించారు. మల్యాల సీఐ రాజ్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌-1 డిపోకు చెందిన బస్సు సుమారు 60 మందికిపైగా ప్రయాణికులతో వరంగల్ నుండి నిజామాబాద్ వైపునకు వెళ్తోంది. కొండగట్టు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు, లారీ ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. లారీ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా స్థానికులు, వాహ‌న‌దారులు శ్ర‌మించి బ‌య‌ట‌కు తీశారు. ఆయ‌న‌తోపాటు గాయ‌ప‌డిన వారిని హుటాహుటిన జ‌గిత్యాల జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదం కారణంగా జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోవ‌డంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీంతోపాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. విచార‌ణ అనంత‌రం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement