త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Park | పోలీసుల‌మ‌ని బెదిరించి.. ఢిల్లీ పార్క్‌లో మైన‌ర్‌పై గ్యాంగ్ రేప్‌.. 10 రోజుల్లో నాలుగో ఘ‌ట‌న‌

Delhi Park | దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)లో మ‌రో మైన‌ర్‌పై గ్యాంగ్ రేప్ జ‌రిగింది. పోలీసుల‌మ‌ని బెదిరించి ముగ్గురు నిందితులు ఓ పార్కులో (Delhi Park) బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. కేవ‌లం 10 రోజుల వ్య‌వ‌ధిలోనే రాజ‌ధానిలో మైన‌ర్ బాలిక‌ల‌పై అత్యాచారం జ‌ర‌గ‌డం ఇది నాలుగో ఘ‌ట‌న కావ‌డం గ‌మ‌నార్హం. వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో రాజ‌ధానిలో మ‌హిళ‌లు, బాలిక‌ల భ‌ద్ర‌త‌పై ఆందోళ‌నలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

D

National | Published On Sep 22, 2026, 11.23 am IST

Delhi Park | పోలీసుల‌మ‌ని బెదిరించి.. ఢిల్లీ పార్క్‌లో మైన‌ర్‌పై గ్యాంగ్ రేప్‌.. 10 రోజుల్లో నాలుగో ఘ‌ట‌న‌
Advertisement

Delhi Park | త్రినేత్ర‌.న్యూస్ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. తాజాగా మ‌రో దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది. పోలీసుల‌మ‌ని బెదిరించి 17 ఏళ్ల బాలిక‌పై (minor girl) ముగ్గురు వ్య‌క్తులు అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. కల్కాజీ మందిర్ (Kalkaji Mandir) సమీపంలోని ఓ పార్కు (Delhi Park)లో సోమ‌వారం సాయంత్రం 7 గంట‌ల ప్రాంతంలో ఈ దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బాధితురాలు నిన్న సాయంత్రం త‌న స్నేహితుడితో క‌లిసి క‌ల్కాజీ మందిర్‌కు వెళ్లింది. పూజ‌లు ముగించుకుని రాత్రి 7:30 గంటల సమయంలో టెంపుల్ సమీపంలోని పార్కుకు వెళ్లారు. అక్క‌డ 25-30 ఏళ్ల వ‌య‌సు గ‌ల ముగ్గురు నిందితులు వారిని అనుస‌రించారు. తాము పోలీసుల‌మ‌ని బెదిరించి బాలిక‌ను ప‌క్క‌కు తీసుకెళ్లారు. అక్క‌డ‌ నిందితులు తుపాకీ, క‌త్తితో బెదిరించి బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం ఈ విష‌యం ఎవ‌రికైనా చెబితే చంపేస్తామ‌ని బెదిరించి అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు.

రాత్రి 8:45 గంట‌ల‌కు క‌ల్కాజీ మందిర్ స‌మీపంలోని పార్కులో అత్యాచారం జ‌రిగింద‌ని పీసీఆర్‌కు కాల్ రావ‌డంతో పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. బాధితురాలిని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుల‌ను గుర్తించేందుకు పార్క్ ప‌రిస‌ర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ల‌ను ప‌రిశీలించారు. పోలీసులు ప్ర‌త్యేక బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చేప‌ట్టారు.

ఎన్‌కౌంట‌ర్‌

ఈ క్ర‌మంలో అమ‌ర్ కాల‌నీలోని డీఎం ఆఫీస్ రోడ్డు స‌మీపంలో నిందితుల్లో ఒక‌రి క‌ద‌లిక‌ల‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ మాటువేశారు. పోలీసుల‌ను చూసిన నిందితుడు వారిపైకి కాల్పులు జ‌రిపాడు. లొంగిపోవాల‌ని హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ నిందితుడు మూడు రౌండ్లు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం పోలీసులు సైతం ఎదురుకాల్పులు జ‌రిపారు. ఈ క్ర‌మంలో నిందితుడి కాలికి గాయ‌మైంది. వెంట‌నే అత‌డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఓక్లా మండిలో ప‌నిచేస్తున్న ఆసిఫ్‌గా గుర్తించారు. ప‌రారీలో ఉన్న మిగ‌తా ఇద్ద‌రు నిందితుల కోసం గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పోక్సో చ‌ట్టం స‌హా వివిధ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

10 రోజుల్లో నలుగో ఘ‌ట‌న‌

కాగా, ఇటీవ‌లే కాలంలో రాజ‌ధాని ప్రాంతంలో మ‌హిళ‌లు, చిన్నారులు, మైన‌ర్ల‌పై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కేవ‌లం 10 రోజుల వ్య‌వ‌ధిలోనే రాజ‌ధానిలో మైన‌ర్ బాలిక‌ల‌పై అత్యాచారం జ‌ర‌గ‌డం ఇది నాలుగో ఘ‌ట‌న కావ‌డం గ‌మ‌నార్హం. సెప్టెంబ‌ర్ 13న వాయువ్య ఢిల్లీలోని స్వ‌రూప్ న‌గ‌ర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలిక‌పై న‌లుగురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారం చేసి ఆపై హ‌త్య చేశారు. ఆ త‌ర్వాత మూడు రోజుల‌కే అంటే సెప్టెంబ‌ర్ 16న ఉత్త‌ర ఢిల్లీలోని స‌ద‌ర్ బ‌జార్ ప్రాంతంలో ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న 10 ఏళ్ల బాలిక చేతులు, కాళ్లు క‌ట్టేసి ఓ దుకాణంలో లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. సెప్టెంబ‌ర్ 21 కిష‌న్ గంజ్ ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారిపై 34 ఏళ్ల వ్య‌క్తి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. తాజాగా పార్కులో మైన‌ర్ బాలిక‌పై సామూహిక అత్యాచారం జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇలా వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో రాజ‌ధానిలో మ‌హిళ‌లు, బాలిక‌ల భ‌ద్ర‌త‌పై ఆందోళ‌నలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Also Read..

పెట్టుబ‌డిదారుల‌కు అల‌ర్ట్‌.. స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు.. కొనేందుకు చాన్స్‌..?

బండ్ల‌గూడ ఆర్టీవో ఆఫీసులో న‌గ‌దు లెక్కింపు వ్య‌వ‌హారం.. ముగ్గురు అధికారుల‌పై వేటు

కొండ చిలువ‌తో డ్యాన్స్‌.. గ‌ణేష్ నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో విశాఖ డ్యాన్స్ టీమ్ హంగామా.. వీడియో

Advertisement
Advertisement