Vinod Kumar | బీబీనగర్ ఎయిమ్స్‌కు అన్ని జిల్లాల నుంచి బస్సులు నడపాలి: వినోద్ కుమార్
Vinod Kumar | తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్‌కు నేరుగా ఆర్టీసీ బస్సులు నడపాలని మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డికి లేఖ రాశారు. ఉప్పల్ జంక్షన్ నుంచి ఎయిమ్స్‌కు ప్రతి 30 నిమిషాలకు ప్రత్యేక షటిల్ బస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Vinod Kumar | తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్‌కు నేరుగా ఆర్టీసీ బస్సులు నడపాలని మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డికి లేఖ రాశారు. ఉప్పల్ జంక్షన్ నుంచి ఎయిమ్స్‌కు ప్రతి 30 నిమిషాలకు ప్రత్యేక షటిల్ బస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రి ఓపీడీ సమయాలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని, తెల్లవారుజామున ఆసుపత్రికి చేరుకునేలా, తిరుగు ప్రయాణానికి మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లోనూ సర్వీసులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఎయిమ్స్ బీబీనగర్‌కు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఒకటి కంటే ఎక్కువ బస్సులు మారి ఆసుపత్రికి చేరుకోవాల్సి రావడం వృద్ధులు, పేద, మధ్యతరగతి కుటుంబాలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇబ్బందిగా మారుతోందన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందరికీ చేరాలంటే మెరుగైన ప్రజా రవాణా అవసరమని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎయిమ్స్‌కు ఏర్పాటుకు 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసి చొరవ తీసుకున్నారని గుర్తుచేశారు. అప్పటి టీఆర్ఎస్ ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారని తెలిపారు. ఆ ప్రయత్నాల ఫలితంగా ఎయిమ్స్ మంజూరైందని, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బీబీనగర్‌లో సుమారు 200 ఎకరాల భూమిని కేటాయించిందని పేర్కొన్నారు.
బీబీనగర్‌కు అన్ని జిల్లాల నుంచి నేరుగా బస్సులు, పొరుగు జిల్లాల్లోని ముఖ్య పట్టణాలు, రవాణా కేంద్రాల నుంచి కనెక్టివిటీ కల్పించాలని వినోద్ కుమార్ కోరారు. ప్రధాన బస్ స్టేషన్లు, ఉప్పల్ జంక్షన్, ఎయిమ్స్ ప్రాంగణంలో బస్సు మార్గాలు, సమయాలు, చార్జీల వివరాలను ప్రదర్శించాలని సూచించారు. ఆసుపత్రి యాజమాన్యంతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక రవాణా ప్రణాళిక రూపొందించాలని, ప్రయాణికుల అవసరాలపై అధ్యయనం చేసి దశలవారీగా సర్వీసులు ప్రారంభించాలని కోరారు. ఎయిమ్స్‌ను ప్రధానమంత్రి అధికారికంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ముందే రవాణా ప్రణాళిక సిద్ధం చేసి, తొలి విడత బస్సు సర్వీసులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన ఆసుపత్రి సరైన ప్రజా రవాణా సౌకర్యాలు లేక సామాన్యులకు అందనంత దూరంలో ఉండకూడదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhai Dooj 2026 | అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భాయ్ దూజ్ ఎప్పుడు? తిలకానికి శుభ ముహూర్తం ఇదే!
నవంబర్ 10, 2026

Priya Bhavani Shankar | పెళ్లి పీటలెక్కనున్న ‘ఇరుముడి’ హీరోయిన్.. ప్రియుడితో పదేళ్ల ప్రేమకు శుభం కార్డు..!
నవంబర్ 10, 2026

Kedarnath | రేపు కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మూసివేత!
నవంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Hyderabad IVF Centers Raid | ఉద్యోగాల పేరుతో యువతుల టార్గెట్.. ఐవీఎఫ్ సెంటర్ల అక్రమ అండాల దందా గుట్టు రట్టు
- ●Bhai Dooj 2026 | అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భాయ్ దూజ్ ఎప్పుడు? తిలకానికి శుభ ముహూర్తం ఇదే!
- ●Revanth Reddy interacts with probationary DSPs | ఏ ఉద్దేశంతో పోలీస్ శాఖలో చేరారో దాన్ని మరవొద్దు
- ●Guduru Laxmi Narasimha Reddy | పట్టభద్రుల గొంతుకగా అసెంబ్లీలో పోరాడే అవకాశం ఇవ్వండి
- ●Priya Bhavani Shankar | పెళ్లి పీటలెక్కనున్న ‘ఇరుముడి’ హీరోయిన్.. ప్రియుడితో పదేళ్ల ప్రేమకు శుభం కార్డు..!
- ●OU Non Teaching Staff JAC Dharna | ఓయూలో కదం తొక్కిన నాన్-టీచింగ్ ఉద్యోగులు.. మహా ధర్నాకు అఖిలపక్ష నేతల సంపూర్ణ మద్దతు

Hyderabad IVF Centers Raid | ఉద్యోగాల పేరుతో యువతుల టార్గెట్.. ఐవీఎఫ్ సెంటర్ల అక్రమ అండాల దందా గుట్టు రట్టు

Bhai Dooj 2026 | అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భాయ్ దూజ్ ఎప్పుడు? తిలకానికి శుభ ముహూర్తం ఇదే!

Revanth Reddy interacts with probationary DSPs | ఏ ఉద్దేశంతో పోలీస్ శాఖలో చేరారో దాన్ని మరవొద్దు

Guduru Laxmi Narasimha Reddy | పట్టభద్రుల గొంతుకగా అసెంబ్లీలో పోరాడే అవకాశం ఇవ్వండి



