త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhai Dooj 2026 | అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భాయ్ దూజ్ ఎప్పుడు? తిలకానికి శుభ ముహూర్తం ఇదే!

Bhai Dooj 2026 | పండుగలు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను పెంపొందించడమే కాకుండా.. మన సంప్రదాయాలు, ఆచారాల గొప్పతనాన్ని చాటిచెబుతాయి. అలాంటి పండుగల్లో భాయ్ దూజ్ ప్రత్యేకమైనది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయత, నమ్మకానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుంది. దీపావళి సంబరాలకు ముగింపు పలుకుతూ జరుపుకునే ఈ పర్వదినాన్ని యమ ద్వితీయ అని కూడా పిలుస్తారు.

P

Devotional | Published On Nov 10, 2026, 8.04 pm IST

Bhai Dooj 2026 | అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భాయ్ దూజ్ ఎప్పుడు? తిలకానికి శుభ ముహూర్తం ఇదే!
Advertisement

Bhai Dooj 2026 | పండుగలు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను పెంపొందించడమే కాకుండా.. మన సంప్రదాయాలు, ఆచారాల గొప్పతనాన్ని చాటిచెబుతాయి. అలాంటి పండుగల్లో భాయ్ దూజ్ ప్రత్యేకమైనది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయత, నమ్మకానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుంది. దీపావళి సంబరాలకు ముగింపు పలుకుతూ జరుపుకునే ఈ పర్వదినాన్ని యమ ద్వితీయ అని కూడా పిలుస్తారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు తిలకం దిద్ది, హారతి ఇచ్చి వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రార్థిస్తారు. సోదరులు సైతం తమ సోదరీమణులకు కానుకలు అందించి, జీవితాంతం అండగా ఉంటామని భరోసా ఇస్తారు. మరి 2026లో భాయ్ దూజ్ ఎప్పుడు జరుపుకోవాలి? తిలకం పెట్టడానికి శుభ ముహూర్తం ఏది? ఈ పండుగ వెనుక ఉన్న విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందాం.

భాయ్ దూజ్ 2026 తేదీ ఎప్పుడంటే?

హిందూ పంచాంగం ప్రకారం.. ప్రతి ఏడాది కార్తీక మాసంలోని శుక్ల పక్ష విదియ తిథి రోజున భాయ్ దూజ్‌ను జరుపుకుంటారు. ఈ ఏడాది కార్తీక శుక్ల విదియ తిథి నవంబర్ 10, 2026న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 11న మధ్యాహ్నం 3.53 గంటలకు ముగుస్తుంది. హిందూ సంప్రదాయంలో పండుగల తేదీలను నిర్ణయించేటప్పుడు ఉదయ తిథికి విశేష ప్రాధాన్యత ఇస్తారు. ఈ కారణంగా 2026లో భాయ్ దూజ్‌ను నవంబర్ 11, బుధవారం జరుపుకోనున్నారు. భాయ్ దూజ్ వేడుకల్లో సోదరుడికి తిలకం దిద్దడం అత్యంత ముఖ్యమైన ఆచారం. ఈ ఏడాది నవంబర్ 11న మధ్యాహ్నం 1.10 గంటల నుంచి 3.20 గంటల వరకు తిలకం పెట్టేందుకు శుభ సమయంగా పేర్కొన్నారు. సోదరీమణులు ఈ సమయంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, తమ సోదరుల నుదుటిపై తిలకం దిద్దవచ్చు. అనంతరం హారతి ఇచ్చి.. వారు ఆరోగ్యంగా, సంతోషంగా, దీర్ఘాయుష్షుతో జీవించాలని ప్రార్థించాలి.

భాయ్ దూజ్ పూజ ఎలా చేయాలి?

భాయ్ దూజ్ రోజున కొన్ని సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ పూజ నిర్వహిస్తారు. ఆ విధానం ఏమిటంటే.. పర్వదినం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించి పూజకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో గణేశుడు, శ్రీమహావిష్ణువు, యమధర్మరాజులను భక్తితో స్మరించుకోవాలి. సోదరుడి క్షేమం, సుఖసంతోషాల కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఒక పళ్లెంలో కుంకుమ, అక్షింతలు, గంధం, పూలు, స్వీట్లు, దీపం, కొబ్బరికాయ వంటి పూజా సామగ్రిని ఉంచుకోవాలి. నిర్ణీత శుభ ముహూర్తంలో సోదరుడిని శుభ్రమైన ఆసనంపై కూర్చోబెట్టాలి. అనంతరం అతడి నుదుటిపై కుంకుమ, అక్షింతలతో తిలకం దిద్దాలి. తిలకం పెట్టిన తర్వాత దీపంతో సోదరుడికి హారతి ఇవ్వాలి. స్వీట్లు తినిపించి, అతడు జీవితంలో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, మంచి ఆరోగ్యంతో దీర్ఘకాలం జీవించాలని ఆకాంక్షించాలి. పూజ పూర్తయిన తర్వాత సోదరుడు తన సోదరికి బహుమతులు అందిస్తాడు. పరస్పరం ప్రేమాభిమానాలను పంచుకుంటూ ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు.

భాయ్ దూజ్ వెనుక ఉన్న విశిష్టత ఏమిటి?

భాయ్ దూజ్‌ను యమ ద్వితీయ అని కూడా అంటారు. ఈ పండుగకు సోదరసోదరీమణుల మధ్య ఉండే ఆత్మీయ బంధమే ప్రధానమైన నేపథ్యం. సోదరీమణులు తమ సోదరులకు తిలకం దిద్ది, హారతి ఇచ్చి వారి క్షేమం కోసం ప్రార్థించడం ఈ పండుగలోని ముఖ్యమైన ఆచారం. సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు అందించి, కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని భరోసా ఇస్తారు. ఈ పర్వదినం సందర్భంగా అనేక కుటుంబాల్లో సోదరీమణులు తమ సోదరుల కోసం ప్రత్యేకమైన వంటకాలు, పిండివంటలు తయారు చేస్తారు. సోదరులు సోదరీమణుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి భోజనం చేయడం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే ఆయా రాష్ట్రాలు, కుటుంబాల సంప్రదాయాలను బట్టి పూజా విధానాల్లో మార్పులు ఉంటాయి.

Advertisement
Advertisement