త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | పెట్టుబ‌డిదారుల‌కు అల‌ర్ట్‌.. స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు.. కొనేందుకు చాన్స్‌..?

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్‌ల‌లో అనిశ్చితి కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ బులియ‌న్ మార్కెట్ల‌లో మాత్రం ర్యాలీ క‌నిపిస్తోంది. గ‌త మూడు సెష‌న్‌ల‌లో అనిశ్చితితో క‌దిలిన బంగారం, వెండి ధ‌ర‌లు మంగ‌ళ‌వారం సెష‌న్‌లో ర్యాలీని కొన‌సాగిస్తున్నాయి.

S

Business | Published On Sep 22, 2026, 11.05 am IST

Gold And Silver Prices Today | పెట్టుబ‌డిదారుల‌కు అల‌ర్ట్‌.. స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు.. కొనేందుకు చాన్స్‌..?
Advertisement

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్‌ల‌లో అనిశ్చితి కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ బులియ‌న్ మార్కెట్ల‌లో మాత్రం ర్యాలీ క‌నిపిస్తోంది. గ‌త మూడు సెష‌న్‌ల‌లో అనిశ్చితితో క‌దిలిన బంగారం, వెండి ధ‌ర‌లు మంగ‌ళ‌వారం సెష‌న్‌లో ర్యాలీని కొన‌సాగిస్తున్నాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర ఈ సెషన్‌లో 0.09 శాతం మేర స్వ‌ల్పంగా త‌గ్గి 4,338 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.09 శాతం త‌గ్గి 65 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 4 పాయింట్లు స్వ‌ల్పంగా త‌గ్గి 1,53,085 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 303 పాయింట్లు పెరిగి 2,39,626 వ‌ద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెర‌గ్గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,475 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,23, 800 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,54,750 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,47,500 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1,700 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,185 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,13,480గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,41,850 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,18,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,500 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,606 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.92,848గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,16,060 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,60,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,200 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,50,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,55,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,550 గా ఉంది.

Advertisement
Advertisement