త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Rock Python | కొండ చిలువ‌తో డ్యాన్స్‌.. గ‌ణేష్ నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో విశాఖ డ్యాన్స్ టీమ్ హంగామా.. వీడియో

Indian Rock Python | హైద‌రాబాద్‌లోని మ‌ధురాన‌గ‌ర్‌లో (Madhuranagar) వినాయ‌క నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో డ్యాన్స‌ర్లు కొండచిలువ‌తో హంగామా సృష్టించారు. ఈ నెల 20న‌ మ‌ధురాన‌గ‌ర్‌లో గ‌ణేష్ నిమ‌జ్జ‌న (Ganesh Immersion) కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

G

Hyderabad | Published On Sep 22, 2026, 10.17 am IST

Indian Rock Python | కొండ చిలువ‌తో డ్యాన్స్‌.. గ‌ణేష్ నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో విశాఖ డ్యాన్స్ టీమ్ హంగామా.. వీడియో
Advertisement

Indian Rock Python | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని మ‌ధురాన‌గ‌ర్‌లో (Madhuranagar) వినాయ‌క నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో డ్యాన్స‌ర్లు కొండచిలువ‌తో హంగామా సృష్టించారు. ఈ నెల 20న‌ మ‌ధురాన‌గ‌ర్‌లో గ‌ణేష్ నిమ‌జ్జ‌న (Ganesh Immersion) కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్నానికి (Visakhapatnam) చెందిన ఓ డ్యాన్స్ గ్రూప్ పాల్గొంది. జ‌నాల‌ను ఆక‌ర్శించేందుకు డ్యాన్స‌ర్లు ప్రాణాల‌తో ఉన్న కొండ‌చిలువ‌తో (Indian Rock Python) ప్ర‌ద‌ర్శ‌ణ నిర్వ‌హిస్తున్నారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో నిజ‌మైన పామును వినియోగిస్తున్న‌ట్లు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ సొసైటీ ఫ‌ర్ ప్రివెన్ష‌న్ ఆఫ్ క్రుయ‌ల్టీ టు యానిమ‌ల్స్ (GHSPCA) ప్రతినిధులకు స‌మాచారం అందింది. దీంతో ఈ గ్రూప్‌పై నిఘా ఉంచిన జీహెచ్ఎస్‌పీసీఏ ప్ర‌తినిధులు.. గ‌త ఐదు రోజులుగా వారిని ట్రాక్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో స్థానిక పోలీసుల స‌హాయంతో డ్రాన్స్ గ్రూప్ నుంచి కొండ చిలువ‌తోపాటు ఓ నాటు కోడిని ర‌క్షించారు.

కాగా, అంతకుముందు సెప్టెంబర్ 19న కొండాపూర్‌లో జరిగిన నిమజ్జనంలో ఈ టీమ్‌ను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే పామును పట్టుకున్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. చివరకు గ‌త ఆదివారం మ‌ధురాన‌గ‌ర్‌లో పోలీసులకు చిక్కారు. డ్యాన్స్ గ్రూప్‌పై వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ (వన్యప్రాణుల సంరక్షణ చట్టం) కింద కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement