త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Techie | ట్రావెల్ వీడియోల కోసం.. ఏడాదికి రూ.85 ల‌క్ష‌ల ప్యాకేజీ ఉద్యోగాన్ని వ‌దులుకున్న టెకీ

Techie | ట్రావెల్ కంటెంట్ క్రియేట‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించేందుకు ఓ టెకీ (Techie) సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నాడు. ఏకంగా ఏడాదికి రూ.85 ల‌క్ష‌ల ప్యాకేజీ ఉద్యోగాన్ని వ‌దులుకున్నాడు (Techie Leaves Rs 85 Lakh Per AnnumJob). స‌క్ష‌మ్‌ సాహ‌సోపేత నిర్ణ‌యానికి ఆయ‌న భార్య స్మృతి కూడా పూర్తి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం విశేషం.

D

National | Published On Aug 24, 2026, 1.42 pm IST

Techie | ట్రావెల్ వీడియోల కోసం.. ఏడాదికి రూ.85 ల‌క్ష‌ల ప్యాకేజీ ఉద్యోగాన్ని వ‌దులుకున్న టెకీ
Advertisement

Techie | త్రినేత్ర‌.న్యూస్ : ట్రిప్‌ల‌కు వెళ్ల‌డ‌మంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి. ఉద్యోగులు ప‌ని ఒత్తిడి నుంచి బ్రేక్ తీసుకుని కొన్ని రోజులు ఫ్యామిలీతో స‌ర‌దాగా ట్రిప్‌కు వెళ్ల‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మే. అయితే, ఓ టెకీ మాత్రం పూర్తిగా ట్రావెల్ కంటెంట్ క్రియేట‌ర్‌గా మారేందుకు ఏడాదికి రూ.85 ల‌క్ష‌ల ప్యాకేజీ ఉద్యోగాన్ని వ‌దులుకోవ‌డం (Techie Leaves Rs 85 Lakh Per AnnumJob) అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది.

స‌క్ష‌మ్ రాజ్ సేథ్ (Saksham Raj Seth) అనే టెక్ నిపుణుడు ఓ కంపెనీలో ఏడాదికి రూ.85 ల‌క్ష‌ల ప్యాకేజీకి ఉద్యోగం చేస్తున్నాడు. అంత జీతం వ‌స్తున్నా జీవితంలో ఏదో తెలియ‌ని లోటు. స్వేచ్ఛ‌గా జీవించ‌లేక‌పోతున్నాన‌న్న భావ‌న‌. అదే స‌మ‌యంలో అత‌డికి కొత్త ప్ర‌దేశాలకు వెళ్ల‌డం అంటే చాలా ఇష్టం. ఈ క్ర‌మంలో పూర్తిస్థాయి ఓ ట్రావెల్ కంటెంట్ క్రియేట‌ర్‌గా మారాల‌నుకున్నాడు. దీంతో త‌న అద్భుత‌మైన టెక్ కెరీర్‌కు ముగింపు ప‌లికాడు. స‌క్ష‌మ్‌ సాహ‌సోపేత నిర్ణ‌యానికి ఆయ‌న భార్య స్మృతి కూడా పూర్తి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం విశేషం. ప్ర‌స్తుతం స్మృతి నెల‌కు రూ.1.5 ల‌క్ష‌ల జీతంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కొన‌సాగుతోంది.

నిజానికి ఉద్యోగం న‌చ్చ‌క తాను ఈ నిర్ణ‌య తీసుకోలేద‌ని చెబుతున్నాడు స‌క్ష‌మ్‌. మంచి జీతం ఉన్నా న‌చ్చిన‌ట్లు జీవితాన్ని గ‌డిపే స్వేచ్ఛ లేద‌ని తెలిపాడు. అందుకే జీతం కంటే జీవితంలో స్వేచ్ఛకు, కొత్త అనుభూతులకు ప్రాధాన్యత ఇవ్వడం కోసమే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించాడు. పూర్తి సమయం ట్రావెల్ కంటెంట్ క్రియేటర్‌గా మారి ప్రపంచాన్ని చుట్టేస్తూ న‌చ్చిన జీవితాన్ని స్వేచ్ఛ‌గా గ‌డ‌పాల‌న్న‌ తన కల కోసమే ఈ రిస్క్ తీసుకున్న‌ట్లు వివ‌రించాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా తాను సంపాదించిన దానికి, ప్ర‌స్తుతం కంటెంట్ క్రియేట‌ర్‌గా త‌న ఆదాయానికి ఏమాత్రం పోలిక లేద‌ని తెలిపాడు.

త‌న నిర్ణ‌యం ఆర్థికంగా ఒక వెన‌క‌డుగు వంటిద‌ని పేర్కొన్నాడు. కంటెంట్ క్రియేష‌న్‌లో స్థిర‌మైన జీతం, గ్యారెంటీతో కూడిన ఎదుగుద‌ల‌, నిర్ద‌ష్ట‌మైన కెరీర్ ఉండ‌వ‌ని అంగీక‌రించాడు. అంతేకాదు, క్రియేట‌ర్లు నిరంత‌రం కంటెంట్‌ను రూపొందించ‌డం, కొత్త ఆలోచ‌న‌ల‌తో ప్ర‌యోగాలు చేయ‌డం అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ప్ర‌యాణాన్ని ఒక శాశ్వ‌త సెల‌వుగా భావించ‌కూడ‌ద‌ని పేర్కొన్నాడు. వాస్తవానికి నిలకడగా ఉండే జీవనశైలిని నిర్మించుకోవడం స‌వాలుతో కూడుకున్న‌ద‌ని తెలిపాడు. స‌క్ష‌మ్ నిర్ణ‌యం అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది.

Also Read..

రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువ‌తి.. వీడియో వైర‌ల్‌

కేర‌ళ భామ‌కు మిస్ యూనివ‌ర్స్ ఇండియా కిరీటం.. ఎవ‌రీ కాజియా లిజ్ మెజో..?

రేవంత్.. ఇప్ప‌టికైనా క‌న్నెప‌ల్లి పంప్‌హౌజ్ మోటార్లు ఆన్ చెయ్‌

Advertisement
Advertisement