Rahul Gandhi | రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఊహించని అనుభవం ఎదురైంది. పూణెలో నిర్వహించిన ఈవెంట్‌లో ఓ యువతి ఆయనకు వేదికపై ముద్దు పెట్టింది (Student Kissed Rahul Gandhi). ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Rahul Gandhi | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్ర పూణెలో నిర్వహించిన 'ఛత్రోన్ కీ గూంజ్' (Chhatron Ki Goonj) కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఊహించని అనుభవం ఎదురైంది. కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన విద్యార్థినులతో రాహుల్ గాంధీ సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థినులు వేదికపైకి వెళ్లి ప్రతిపక్ష నేతతో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ఆ సమయంలో ఓ యువతి అనూహ్యంగా రాహుల్ బుగ్గపై ముద్దు పెట్టింది (Student Kissed Rahul Gandhi). ఈ ఘటనతో రాహుల్ సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం ఆ విద్యార్థినితో రాహుల్ కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు, పొలిటికల్ లీడర్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దేశంలో ‘మనుస్మృతి మనస్తత్వం’ రాజ్యమేలుతోందని రాహుల్ ఆరోపించారు. మహిళలు పితృస్వామ్యాన్ని ఎదిరించాలని పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తున్నాయి. విద్యార్థుల సమస్యలపై సీరియస్‌గా మాట్లాడకుండా రాహుల్ సాధారణ రాజకీయ ప్రసంగానికే పరిమితమయ్యారని బీజేపీ ఆరోపించింది.
#rgtwt gurls are not not ready fr this
😭😭😭😭 pic.twitter.com/Q6t9RS2vpY— Snowbell (@Snowbel) August 23, 2026
పైసే కీ గూంజ్..
అంతేకాదు, మహిళా విద్యార్థినుల కోసం నిర్వహించిన పూణె ‘ఛత్రోన్ కీ గూంజ్’ (Chhatron Ki Goonj) కార్యక్రమాన్ని బీజేపీ పైసే కీ గూంజ్ (Paise Ki Goonj)గా అభివర్ణించింది. రాహుల్ కార్యక్రమానికి జనాన్ని సమీకరించేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించిందని ఆరోపించింది. కార్యక్రమం కోసం ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ.30 వేల రూ. 35 వేల వరకు చెల్లిస్తున్నారని పేర్కొంది. మొత్తంగా ఇందుకోసం హస్తం పార్టీ రూ.10 కోట్లు ఖర్చు చేసిందని బీజేపీ ప్రతినిధి నావ్‌నాథ్ బాన్ ఆరోపించారు.
Also Read..
కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఎవరీ కాజియా లిజ్ మెజో..?
ఏడాదికి 3 సిలిండర్లు.. ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం వరాల జల్లు
సంబంధిత వార్తలు

Paise Ki Goonj | ఛత్రోన్ కీ గూంజ్ కాదు పైసే కీ గూంజ్.. రాహుల్ కార్యక్రమం కోసం ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ. 35 వేలు
ఆగస్టు 22, 2026

Murali Akunuri | రాహుల్ గాంధీ.. ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?: ఆకునూరి మురళి
ఆగస్టు 22, 2026

Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు
ఆగస్టు 20, 2026
తాజావార్తలు
- ●Dixon Technologies | ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలకు భారీ బూస్ట్.. రూ.62,500 కోట్ల పథకం
- ●Chicken Waste | 100 టన్నుల చికెన్ వ్యర్థాలను ఏపీ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..
- ●Rashmika Mandanna | ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో విజయ్ , రష్మిక - గాయం నుంచి కోలుకున్న నేషనల్ క్రష్
- ●Harish Rao | జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్..: హరీశ్ రావు
- ●Miss Universe India 2026 | కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఎవరీ కాజియా లిజ్ మెజో..?
- ●Balmoor Venkat | విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. మీ లడాయి ఎక్కడికి పోయింది?.. బీజేపీ నేతలపై బల్మూర్ వెంకట్ ఆగ్రహం

Dixon Technologies | ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలకు భారీ బూస్ట్.. రూ.62,500 కోట్ల పథకం

Chicken Waste | 100 టన్నుల చికెన్ వ్యర్థాలను ఏపీ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..

Rashmika Mandanna | ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో విజయ్ , రష్మిక - గాయం నుంచి కోలుకున్న నేషనల్ క్రష్

Harish Rao | జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్..: హరీశ్ రావు



