Tarun Tejpal | అత్యాచారం కేసు.. తహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు శిక్ష
Tarun Tejpal | సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రముఖ మీడియా సంస్థ తహెల్కా మాజీ ఎడిటర్ (Ex Tehelka Editor) తరుణ్ తేజ్‌పాల్ (Tarun Tejpal)కు గోవాలోని బాంబే హైకోర్టు (Goa Bench of Bombay High Court) శిక్ష ఖరారు చేసింది. ఆయనకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
Tarun Tejpal | త్రినేత్ర.న్యూస్ : ప్రముఖ మీడియా సంస్థ తహెల్కా మాజీ ఎడిటర్ (Ex Tehelka Editor) తరుణ్ తేజ్‌పాల్ (Tarun Tejpal)కు గట్టి షాక్ తగిలింది. సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో గోవాలోని బాంబే హైకోర్టు (Goa Bench of Bombay High Court) శిక్షను ఖరారు చేసింది. ఆయనకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.10లక్షల జరిమానా విధించింది. అతను నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.
2013 నవంబర్‌లో గోవాలో జరిగిన థింక్ ఫెస్ట్ ఈవెంట్ సమయంలో హోటల్ ఎలివేటర్‌లో తనపై సీనియర్ జర్నలిస్ట్ తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో తరుణ్ తేజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత బెయిల్‌పై ఆయన విడుదలయ్యాడు. ఈ కేసుపై మపుసా ట్రయల్ కోర్టులో 2017లో విచారణ ప్రారంభమైంది. సుదీర్ఘ వాదనల అనంతరం 2021లో తేజ్‌పాల్‌ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత కోర్టు తీర్పును గోవా ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం తరుణ్ తేజ్‌పాల్‌ని దోషిగా తేలుస్తూ ఇవాళ ఉదయం తీర్పు వెలువరించింది. ఈ కేసులో తేజ్‌పాల్‌ను నిర్దోషిగా విడుదల చేస్తూ 2021లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది.
కోర్టు తీర్పు తర్వాత తుషార్ మెహతా మాట్లాడుతూ.. తరుణ్ తేజ్‌పాల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తరుణ్‌కి బాధితురాలు కూతురు వయసుతో సమానమని.. అయినా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. "బాధితురాలికి అతను తండ్రిలాంటి వాడు. ఇంతటి అఘాయిత్యానికి పాల్పడి ఉండకూడదు. అమ్మాయి వద్దు అంటే.. వద్దు అనే అర్థం. తన తీర్పుతో కోర్టు సమాజానికి స్పష్టమైన సందేశం ఇవ్వాలి" అని తుషార్ మెహతా వాదించారు. ఇక దోషిగా తేలిన తర్వాత తేజ్‌పాల్ కోర్టును క్షమాభిక్ష కోరారు. తాను బాధితుడినని హైకోర్టు ఉత్తర్వులపై అప్పీల్ చేసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు. తనపై కనికరం చూపించాలని అభ్యర్థించాడు.
Also Read..
సైన్యంలో చేరిన డెన్మార్క్ యువరాణి ఇసాబెల్లా.. సరికొత్త రికార్డు
రూ.3 కోట్ల మోసం కేసు.. సల్మాన్ ఖాన్‌కు కోర్టు సమన్లు
ప్రయాణికుల ఫ్లైట్‌కు దగ్గరగా వెళ్లిన ట్రంప్ మెరైన వన్ హెలికాప్టర్
తాజావార్తలు
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
- ●Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి
- ●BJP OBC Morcha | బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకం
- ●Rajaram Yadav | అభివృద్ధి నాలుగు పాదాల నడుస్తుందట.. మహేశ్‌కుమార్‌గౌడ్ మాటలు సిగ్గుచేటు

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?

స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!

Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి

Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి





