Princess Isabella | సైన్యంలో చేరిన డెన్మార్క్ యువరాణి ఇసాబెల్లా.. సరికొత్త రికార్డు
Princess Isabella | డెన్మార్క్ రాజవంశ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రిన్సెస్ ఇసాబెల్లా (Princess Isabella) సైన్యంలో చేరారు. ఈ సందర్భంగా పూర్తిస్థాయి సైనిక సేవల్లోకి అడుగుపెట్టిన తొలి మహిళా రాజవంశీకురాలిగా (Danish Royal Woman) ఆమె చరిత్ర సృష్టించారు.
International | Published On Aug 6, 2026, 12.07 pm IST
Princess Isabella | త్రినేత్ర.న్యూస్ : డెన్మార్క్ రాజవంశ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రిన్సెస్ ఇసాబెల్లా (Princess Isabella) సైన్యంలో చేరారు. ఈ సందర్భంగా పూర్తిస్థాయి సైనిక సేవల్లోకి అడుగుపెట్టిన తొలి మహిళా రాజవంశీకురాలిగా (Danish Royal Woman) ఆమె చరిత్ర సృష్టించారు. డెన్మార్క్ ప్రభుత్వం (Denmark Govt) ఇటీవలే ప్రవేశపెట్టిన 11 నెలల తప్పనిసరి సైనిక శిక్షణలో భాగంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
కోపెన్‌హాగన్‌కు పశ్చిమాన ఉన్న స్లాగెల్స్‌లోని ఆంట్‌వర్‌స్కోవ్ బ్యారెక్స్‌లో ఆమె ఆగస్టు 3న విధుల్లోకి చేరారు. గార్డ్ హుస్సార్ రెజిమెంట్ (Guard Hussar Regiment)లో 11 నెలల పాటూ శిక్షణ పొందనున్నారు. హైస్కూల్ విద్య పూర్తి చేసుకున్న యువరాణి.. వేసవి సెలవులు ముగించుకొని సైన్యంలో చేరారు. ఎలాంటి ప్రత్యేక హంగులు, ఆర్బాటాలూ లేకుండా ఆమె సాధారణ సైనికురాలిగా విధుల్లో చేరడం విశేషం. బ్యారెక్స్‌కు ఆమే తన కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు.
జీతం నిరాకరణ
ప్రస్తుత డెన్మార్క్ రాజు కింగ్ ఫ్రెడరిక్ X, క్వీన్ మేరీల కుమార్తే ప్రిన్సెస్ ఇసాబెల్లా. ఆమె 21 ఏప్రిల్ 2007న జన్మించారు. ప్రస్తుతం యువరాణి వయసు 19 ఏళ్లు. సాధారణ సైనికులకు ఇచ్చే జీతభత్యాలను ఇసాబెల్లా నిరాకరించారు. తన సొంత ఖర్చులతోనే ఈ శిక్షణలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు రాజకుటుంబం తెలిపింది. తన తల్లిదండ్రుల ఆర్థిక అండతోనే ఉంటానని, ప్రభుత్వ వేతనం తనకు వద్దని ఇసాబెల్లా స్పష్టం చేసినట్లు రాజకుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది.
రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తున్న డెన్మార్క్.. మహిళలకు సైతం తప్పనిసరి!
యూరప్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో పెరుగుతున్న భద్రతా ఆందోళనలు, ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో డెన్మార్క్ తన రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేస్తోంది. ఇందులో భాగంగానే సైనిక సేవా కాలాన్ని 4 నెలల నుంచి 11 నెలలకు పెంచింది. 2024లో తొలిసారి మహిళలకు సైనిక సేవను తప్పనిసరి చేస్తూ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే ప్రిన్సెస్ ఇసాబెల్లా సైన్యంలో చేరడం విశేషం.
Also Read..
రూ.3 కోట్ల మోసం కేసు.. సల్మాన్ ఖాన్‌కు కోర్టు సమన్లు
ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్
ఒక్క రోజులోనే రూ.28వేలు పెరిగిన పసిడి ధర.. మళ్లీ రెక్కలు..
తాజావార్తలు
- ●Guvvala Balaraj | మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్టు.. పీఎస్‌కు తరలింపు
- ●Kerala Fishermen | కేరళలో 469 మంది జాలర్లు మృతి
- ●HP OmniPad 12 | విద్యార్థులు, ఉద్యోగులకు హెచ్‌పీ ప్రత్యేక ట్యాబ్.. ఉచిత ఏఐ సబ్స్క్రిప్షన్..
- ●National Handloom Day | చేనేత రంగం పునరుజ్జీవానికి ప్రాధాన్యం : మంత్రి తుమ్మల
- ●Priyanka Chopra | ఆస్కార్ విన్నింగ్ యాక్టర్‌తో గ్లోబల్ స్టార్ రొమాన్స్ - హాలీవుడ్లో జాక్‌పాట్
- ●Krishank | ఇందిరమ్మ చీరలను ఎలుకలు కొరుకుతున్నయ్.. 10 నెలల నుంచి ఎందుకు పంచలే?

Guvvala Balaraj | మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్టు.. పీఎస్‌కు తరలింపు

Kerala Fishermen | కేరళలో 469 మంది జాలర్లు మృతి

HP OmniPad 12 | విద్యార్థులు, ఉద్యోగులకు హెచ్‌పీ ప్రత్యేక ట్యాబ్.. ఉచిత ఏఐ సబ్స్క్రిప్షన్..

National Handloom Day | చేనేత రంగం పునరుజ్జీవానికి ప్రాధాన్యం : మంత్రి తుమ్మల





