MLA KP Vivekananda Goud | కూకట్‌పల్లి ట్రక్ పార్కు భూములను అమ్మేసి కుట్ర
MLA KP Vivekananda Goud | కూకట్‌పల్లి ట్రక్ పార్కు భూములను అమ్మేసే కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తూ.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజం
MLA KP Vivekananda Goud | త్రినేత్ర న్యూస్ : కూకట్‌పల్లి ట్రక్ పార్కు భూములను అమ్మేసే కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తూ.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని హుడా ట్రక్ పార్క్ భూముల వేలాన్ని నిరసిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డిని కొడంగల్ ప్రజలు ఓడిస్తే.. మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేశాడు. ఇక సీఎం అయినప్పటి నుంచి విలువైన స్థలాలను అమ్ముతున్నాడు. కంచె గచ్చిబౌలి భూములను ముంబయి మార్కెట్‌లో తాకట్టు పెట్టాడు. మెట్రోను బలవంతంగా బెదిరించి విలువైన మెట్రో భూములను లాక్కుంటున్నాడు. హైదరాబాద్ నగరాన్ని మురికి కూపంగా మారుస్తున్నాడు. విలువైన మియాపూర్ భూములను అమ్ముతున్నాడు. రేవంత్ రెడ్డి అక్రమ దందాలు ఎక్కువయ్యాయి. భూములు అమ్మి పాలన చేస్తానని రేవంత్ రెడ్డి అంటుండు. ట్రక్ పార్క్ భూముల నిరసన ఇంతటితో ఆగదు. న్యాయ పోరాటం చేసి ట్రక్ పార్క్ భూములను కాపాడుతామని వివేకానంద గౌడ్ తేల్చిచెప్పారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Supreme Court | కొండపై కార్తీక దీపం వెలిగించలేకపోయాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం
- ●Gold | నెల రోజుల్లో రూ.20వేలు తగ్గిన పసిడి ధర.. ఇప్పుడు కొనవచ్చా..?
- ●Nirmal | పెళ్లి కోసం దాచిన రూ. 10 లక్షలు అగ్నికి ఆహుతి
- ●Laxmi Lankala Kenderla | ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ..
- ●Anthropic IPO | ఐపీఓ జోరు ఆవిరి.. ఇష్యూ ధర కంటే దిగువకు ఆంథ్రోపిక్ షేర్లు..
- ●Miss Universe 2026 | భారత్‌కు నిరాశ.. విశ్వసుందరి కిరీటాన్ని ఎగరేసుకుపోయిన ప్యూర్టో రికో భామ

Supreme Court | కొండపై కార్తీక దీపం వెలిగించలేకపోయాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం

Gold | నెల రోజుల్లో రూ.20వేలు తగ్గిన పసిడి ధర.. ఇప్పుడు కొనవచ్చా..?

Nirmal | పెళ్లి కోసం దాచిన రూ. 10 లక్షలు అగ్నికి ఆహుతి

Laxmi Lankala Kenderla | ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ..





