Dalai Lama | దలైలామాకు ఢిల్లీలో అధికారిక బంగ్లా కేటాయింపు
Dalai Lama | టిబెట్ బౌద్ధమత గురువు (Tibetan spiritual leader) దలైలామాకు (Dalai Lama) కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని లుటియెన్స్ (Lutyens) ప్రాంతంలో అధికారిక బంగ్లా కేటాయించింది. దలైలామా కార్యాలయమైన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కు (Gaden Phodrang Trust) ఈ బంగ్లాను కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Dalai Lama | త్రినేత్ర న్యూస్ : టిబెట్ బౌద్ధమత గురువు (Tibetan spiritual leader) దలైలామాకు (Dalai Lama) కేంద్ర ప్రభుత్వం అధికారిక బంగ్లా కేటాయించింది. దేశ రాజధాని ఢిల్లీలోని లుటియెన్స్ (Lutyens) ప్రాంతంలో ఒక ప్రభుత్వ బంగ్లాను (టైప్-7 బంగ్లా) కేటాయించింది. పండిట్ రవిశంకర్ శుక్లా లేన్‌లోని బంగ్లాను దలైలామాకు కేటాయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
దలైలామా కార్యాలయమైన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కు (Gaden Phodrang Trust) ఈ బంగ్లాను కేటాయించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా ఇటువంటి నివాసాలను మూడేళ్ల కాలానికి కేటాయిస్తుంటారు. అవసరాన్ని బట్టి పొడిగించే వెసులుబాటు కూడా ఉంటుంది.
గాడెన్ ఫోడ్రాంగ్ వెబ్‌సైట్ ప్రకారం.. దలైలామా సంస్థను పరిరక్షించడం, ఆయన ఆధ్యాత్మిక సేవలను ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ ట్రస్ట్ కృషి చేస్తోంది. మానవ విలువలను పెంపొందించడం, మత సామరస్యాన్ని ప్రోత్సహించడం, టిబెటన్ సంస్కృతి, గుర్తింపును కాపాడటం, పర్యావరణ పరిరక్షణ, ప్రాచీన భారతీయ విజ్ఞానంపై లోతైన అవగాహనను పెంపొందించడం వంటి దలైలామా ప్రధాన ఆశయాలకు ప్రోత్సహించేలా ఈ ట్రస్ట్ పనిచేయనుంది.
ఈ బంగ్లాకు ఇటీవలే మరమ్మతులు చేసి, ఆధునికీకరించారు. ప్రధాన గేటు వద్ద 'గాడెన్ ఫోడ్రాంగ్ - దలైలామా కార్యాలయం' పేరుతో నేమ్‌ప్లేట్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నివసిస్తున్న దలైలామా దేశ రాజధాని ఢిల్లీకి వచ్చినప్పుడు బస చేసేందుకు, ఆయన కార్యాలయ కార్యకలాపాలకు ఇది శాశ్వత కేంద్రంగా ఉపయోగపడనుంది. దీనిపై ప్రవాస టిబెటన్ పార్లమెంట్ సభ్యులు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, తదుపరి దలైలామా ఎంపిక విషయంలో భారత్, చైనా మధ్య మతపరమైన, వ్యూహాత్మక విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని భారత్ ఇప్పటికే స్పష్టం చేయగా.. న్యూ ఢిల్లీ నిర్ణయాన్ని చైనా తీవ్రంగా ఖండిస్తోంది. దలైలామా పునర్జన్మ ప్రక్రియ చైనా చట్టాలకు, నిబంధనలకు లోబడి జరగాలని, తమ ఆమోదం తప్పనిసరి అని చైనా స్పష్టం చేస్తోంది. అదే సమయంలో వారసుడి ఎంపికపై చైనా జోక్యాన్ని అడ్డుకునేందుకు అమెరికా సైతం పావులు కదుపుతోంది. ఈ క్రమంలో వారసుడిని ప్రకటించే అధికారం ఉన్న ట్రస్ట్‌కు కేంద్రం సైలెంట్‌గా దేశ రాజధాని నడిబొడ్డున అధికారిక బంగ్లా కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read..
మహేశ్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిన చిన్నారి!
24 గంటల పాటు స్తంభించిన సేవలు.. మైక్రోసాఫ్ట్‌లో 'కోడ్ రెడ్' హై అలర్ట్!
తాజావార్తలు
- ●NSE Shares | ఎన్ఎస్ఈ షేర్లపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బై రేటింగ్.. 20 శాతం లాభం అంచనా..
- ●Ponnam Prabhakar | రేపు సంవిధాన్ రక్షా మార్చ్.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Horoscope | నవంబర్ 25 రాశిఫలాలు.. కొత్త ఒప్పందాలకు అనుకూలమైన సమయం!
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లు కుదేలు.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
- ●Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. 1,000 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్..
- ●Mahesh Babu Instagram Comment | మహేశ్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిన చిన్నారి!

NSE Shares | ఎన్ఎస్ఈ షేర్లపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బై రేటింగ్.. 20 శాతం లాభం అంచనా..

Ponnam Prabhakar | రేపు సంవిధాన్ రక్షా మార్చ్.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్

Horoscope | నవంబర్ 25 రాశిఫలాలు.. కొత్త ఒప్పందాలకు అనుకూలమైన సమయం!

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లు కుదేలు.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..






