త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Vijay | మ‌హిళ‌ల గురించి త‌ప్పుగా మాట్లాడితే ఊరుకోం.. స్టాలిన్‌కు విజ‌య్ హెచ్చ‌రిక‌

CM Vijay | త‌న గురించి ఏం మాట్లాడిన భరిస్తాను, కానీ మ‌హిళ‌ల గురించి త‌ప్పుగా మాట్లాడితే ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ హెచ్చ‌రించారు.

S

National | Published On Oct 4, 2026, 6.17 pm IST

CM Vijay | మ‌హిళ‌ల గురించి త‌ప్పుగా మాట్లాడితే ఊరుకోం.. స్టాలిన్‌కు విజ‌య్ హెచ్చ‌రిక‌
Advertisement

CM Vijay | త్రినేత్ర న్యూస్ : త‌న గురించి ఏం మాట్లాడిన భరిస్తాను, కానీ మ‌హిళ‌ల గురించి త‌ప్పుగా మాట్లాడితే ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ హెచ్చ‌రించారు. టీవీకే ఎమ్మెల్యే అభ్య‌ర్థి స‌త్య‌భామ‌పై స్టాలిన్ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌పై సీఎం నిప్పులు చెరిగారు. ధారాపురం నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక నేప‌థ్యంలో టీవీకే అభ్య‌ర్థి స‌త్య‌భామ‌కు మ‌ద్ద‌తుగా విజ‌య్ ప్ర‌చారం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా విజ‌య్ మాట్లాడుతూ.. స‌త్య‌భామ‌ను కించ‌ప‌రిచేలా స్టాలిన్ మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు. రాబోయే ఉప ఎన్నిక‌లో డీఎంకే, దాని మిత్ర‌ప‌క్ష పార్టీల‌కు ఓటు వేయ‌డ‌మంటే మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచిన‌ట్టే అని పేర్కొన్నారు. స‌త్య‌భామ‌ను ఉద్దేశించి నీచంగా మాట్లాడిన స్టాలిన్‌కు బుద్ధి చెప్పాల‌న్నారు. స్టాలిన్ ఒక్క‌రే కాదు.. డీఎంకేకు చెందిన ప‌లువురు నేత‌లు బ‌హిరంగ వేదిక‌ల‌పై మ‌హిళ‌ల‌ను అవ‌మానించేలా మాట్లాడుతున్నార‌ని సీఎం విజ‌య్ మండిప‌డ్డారు.

Advertisement
Advertisement