Gym Trainer Arrest | యువతి అశ్లీల ఫొటో వాట్సాప్‌లో షేర్.. జిమ్ ట్రైనర్ అరెస్ట్
Gym Trainer Arrest | మహిళను బెదిరించడంతోపాటు ఆమె అశ్లీల ఫొటోను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసిన కేసులో 27 ఏళ్ల జిమ్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని ఒట్టేరి ప్రాంతానికి చెందిన ఇంతియాజ్ షెరీఫ్‌ను సెక్రటేరియట్ కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Gym Trainer Arrest | మహిళను బెదిరించడంతోపాటు ఆమె అశ్లీల ఫొటోను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసిన కేసులో 27 ఏళ్ల జిమ్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని ఒట్టేరి ప్రాంతానికి చెందిన ఇంతియాజ్ షెరీఫ్‌ను సెక్రటేరియట్ కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 19 ఏళ్ల కాలేజీ విద్యార్థినికి 2024లో జిమ్‌లో చేరిన సమయంలో షెరీఫ్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరి మధ్య స్నేహం, ఆ తర్వాత రిలేషన్ ఏర్పడింది. షెరీఫ్ ప్రవర్తన సరిగా లేదని భావించిన యువతి అతడితో మాట్లాడటం మానేసింది. దీంతో ఆమెను మళ్లీ మాట్లాడేలా చేసేందుకు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత యువతికి సంబంధించిన ఓ అశ్లీల ఫొటోను షెరీఫ్ సంపాదించి, దాన్ని చూపిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్టెంబర్ 28న కాలేజీకి వెళ్తున్న యువతిని అడ్డగించి దుర్భాషలాడటంతోపాటు వాగ్వాదం అనంతరం దాడి చేశాడని, అదే రోజు ఆమె సభ్యురాలిగా ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల ఫొటోను షేర్ చేసినట్లు పోలీసులు చెప్పారు. యువతి ఫిర్యాదు మేరకు సెక్రటేరియట్ కాలనీ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), తమిళనాడు మహిళల వేధింపుల నిషేధ చట్టం, సమాచార సాంకేతిక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. షెరీఫ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సదరు నిందితుడిని అరెస్టు చేసి, అదే రోజు కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత
- ●ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!
- ●Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులి దర్శనం..
- ●CM Revanth Reddy | కొత్త ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు సమకూర్చండి
- ●Captain Smit Machchhar | భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను ఆస్పత్రిలో పరామర్శించి ప్రశంసించిన దుబాయ్ యువరాజు
- ●Artificial Intelligence | ఏఐతో ఆర్థిక నిపుణుల కొలువులకు ఎసరు.. స్వల్ప ఛార్జీలకే సలహాలు..

Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత

ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!

Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులి దర్శనం..

CM Revanth Reddy | కొత్త ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు సమకూర్చండి






