Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
Kavitha | సింగరేణి (Singareni) లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత (Kavitha) డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న మెడికల్ బోర్డు ప్రతి నెలా రెండు సార్లు నిర్వహించాలన్నారు.
Kavitha | త్రినేత్ర న్యూస్: సింగరేణి (Singareni) లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత (Kavitha) డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న మెడికల్ బోర్డు ప్రతి నెలా రెండు సార్లు నిర్వహించాలన్నారు. మెడికల్ బోర్డుకు (Medical Board) దరఖాస్తు చేసుకున్న అర్హులైన కార్మికులందరిని అన్‌ఫిట్ చేయాలని, ఆ స్థానంలో వారి వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలంటూ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు.
సింగరేణి కార్మికులకు దదక్కిన రూ.1.10 లక్షల దీపావళి బోనస్ (PLRB) కేవలం హెచ్‌ఎంఎస్ (HMS) కార్మిక సంఘం కృషితోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఇందులో ప్రస్తుత సింగరేణి గుర్తింపు సంఘంతో సహా మరే ఇతర సంఘాల ప్రమేయం అసలే లేదన్న వాస్తవాన్ని ప్రముఖ దినపత్రిక గుర్తించాలని హితవు పలికారు. కార్మికుల హక్కుల సాధనలో హెచ్‌ఎంఎస్ చేసిన పాత్రను విస్మరిస్తూ సోమవారం (అక్టోబర్ 5) వారు ప్రచురించిన కథనాన్ని తక్షణమే సరిదిద్దుకోవాలని సూచించారు. బొగ్గు గని కార్మికుల కష్టార్జితాన్ని ఇతరుల ఖాతాలో వేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్






