Wedding Sherwani | ఇస్త్రీ చేస్తుండగా కాలిన షేర్వాణీ.. రూ. 14 వేలు జరిమానా విధించిన కోర్టు
Wedding Sherwani | ఓ వ్యక్తి తన పెళ్లికి సంబంధించిన షేర్వాణీ( Wedding Sherwani ) ని డ్రైక్లీనింగ్‌కు ఇచ్చాడు. ఇక ఇస్త్రీ చేస్తుండగా.. అది కాలిపోయింది. దీంతో వినియోగదారుల కోర్టు( Consumer Court )ను ఆశ్రయించగా.. డ్రైక్లీనింగ్ షాపు యజమానికి రూ. 14 వేలు జరిమానా విధించింది.
Wedding Sherwani | త్రినేత్ర.న్యూస్ : ఓ వ్యక్తి తన పెళ్లికి సంబంధించిన షేర్వాణీ( Wedding Sherwani ) ని డ్రైక్లీనింగ్‌కు ఇచ్చాడు. ఇక ఇస్త్రీ చేస్తుండగా.. అది కాలిపోయింది. దీంతో వినియోగదారుల కోర్టు( Consumer Court )ను ఆశ్రయించగా.. డ్రైక్లీనింగ్ షాపు యజమానికి రూ. 14 వేలు జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్( Chattishgrah )కు చెందిన దాగేశ్వర్ యాదవ్.. తన పెళ్లి షేర్వాణీతో పాటు మరో మూడు దుస్తులను డ్రై క్లీనింగ్‌కు ఇచ్చాడు. అయితే డ్రైక్లీనింగ్ అనంతరం ఇస్త్రీ కూడా చేశారు. ఇస్త్రీ చేస్తుండగా షేర్వాణీ రెండో బటన్ వద్ద కాలిపోయింది. దీంతో డ్రైక్లీనింగ్ యజమాని అశోక్ నిర్మల్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాగేశ్వర్ యాదవ్. తనకు నష్ట పరిహారం ఇప్పించాలని అశోక్‌పై బాధితుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.
2019 సెప్టెంబర్ 8వ తేదీన దాగేశ్వర్‌కు షేర్వాణీతో పాటు ఇతర దుస్తులను అశోక్ అప్పగించాడు. కానీ షేర్వాణీ కాలిపోయి ఉండడంతో.. కోర్టును నవంబర్ నెలలో ఆశ్రయించాడు. తనకు రూ. 12 వేల నష్టం జరిగిందని కోర్టు ముందు వాపోయాడు దాగేశ్వర్. ఈ క్రమంలో అశోక్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. కానీ అతన్నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కోర్టుకు కూడా హాజరు కాలేదు.
45 రోజుల్లోనే రూ. 14 వేలు చెల్లించాలి..
ఇక దాగేశ్వర్ తన కాలిపోయిన షేర్వాణీని కోర్టుకు సమర్పించాడు. దాని విలువ రూ. 12 వేలు అని, అంతమొత్తం చెల్లించేలా ఆదేశించాలని కోర్టును కోరాడు. చివరకు ఏడేళ్ల తర్వాత షేర్వాణీ కొనుగోలు చేసిన బిల్లులను కోర్టుకు సమర్పించాడు. ఆ బిల్లులు నమ్మశక్యంగా లేవని, ఆలస్యానికి సరైన వివరణ ఇవ్వకపోవడంతో దాగేశ్వర్ డిమాండ్లను కోర్టు అంగీకరించలేదు. రూ. 12 వేలకు బదులుగా షేర్వాణీ ఖరీదును రూ. 6 వేలకు ఫైనల్ చేసింది కోర్టు. దాంతో పాటు మానసికంగా కుంగదీసినందుకు రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా, దాన్ని రూ. 3 వేలకు కుదించింది కోర్టు. ఇక కోర్టు ఖర్చులకు రూ. 5 వేలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అంటే మొత్తం రూ. 14 వేలు బాధితుడికి చెల్లించాలని అశోక్‌ను కోర్టు ఆదేశించింది. అది కూడా 45 రోజుల్లో చెల్లించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది.
తాజావార్తలు
- ●Supreme Court | 135 ఏళ్ల చరిత్ర కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ తరలింపు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..
- ●MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..
- ●Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. మార్పు లేకుండా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..
- ●CJP | దేశమంతా కదులుతుంది.. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు..?

Supreme Court | 135 ఏళ్ల చరిత్ర కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ తరలింపు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..

MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..

Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్



